ADITYA BIRLA: హైదరాబాద్: సంప్రదాయ పెయింట్ షాపులకు భిన్నంగా సృజనాత్మకం, అధునాతన పద్ధతుల్లో ఆదిత్య బిర్లా గ్రూప్ ముందుకు సాగుతోంది. కంపెనీ గ్రాసిమ్ ఇండస్ట్రీస్‌లో భాగమైన బిర్లా ఓపస్ పెయింట్స్, హైదరాబాద్‌లో బిర్లా ఓపస్ పెయింట్ స్టూడియోను తాజాగా ప్రారంభించింది. కార్యక్రమానికి బిర్లా ఓపస్(ADITYA BIRLA PAINT STUDIO) పెయింట్స్ సీఈఓ రక్షిత్ హర్గవే ముఖ్యఅతిథిగా స్టూడియోని ప్రారంభించారు. గురుగ్రామ్, లక్నో, ముంబయి, నవీ ముంబయి, బెంగళూరులో ఇప్పటికే విజయవంతంగా డిజైనర్ పెయింట్ స్టూడియోలను ప్రారంభించింది. తాజాగా హైదరాబాద్‌లోనూ కంపెనీ తన సేవలను విస్తరించింది. ఈ పెయింట్ స్టూడియో సంప్రదాయ పెయింట్ దుకాణాలకు అతీతంగా సృజనాత్మకతకు కేంద్రంగా తీర్చిదిద్దారు. ఈ స్టోర్ 170ం కన్నా ఎక్కువ ఉత్పత్తులను ప్రదర్శించడమే కాకుండా, రంగుల ఎంపికపై నిపుణుల సంప్రదింపులు, వినూత్న అప్లికేషన్ టెక్నిక్‌లు మరియు గొప్ప స్థానిక వారసత్వం నుంచి ప్రేరణ పొందిన క్యూరేటెడ్ డెకర్ సొల్యూషన్లతో సహా పలు ప్రత్యేక సేవలను అందించనుంది. బిర్లా ఓపస్ పెయింట్స్ సీఈఓ రక్షిత్ హర్గవే మాట్లాడుతూ హైదరాబాద్‌లో స్టూడియో కేవలం రిటైల్ స్థలం మాత్రమే కాదు, ఇది మీ పెయింటింగ్ అవసరాలకు ఒక అనుభవ కేంద్రంగా ఉంటుందని పేర్కొన్నారు. అత్యాధునిక సాంకేతికత నుంచి స్థానికంగా ప్రేరణ పొందిన షేడ్ ప్యాలెట్ల వరకు, వినియోగదారులు, నిపుణులు అన్వేషించేందుకు, ప్రయోగాలు చేయడానికి ఉపయోగంగా ఉంటుందని వెల్లడిరచారు.