covid-19 updates: కోవిడ్ మరణాలపై కేంద్ర కీలక ప్రకటన చేసింది. దేశంలో ఇటీవల హఠాన్మరణాలు పెరిగిపోతుండడంతో ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. చిన్నా పెద్దా తేడాలేకుండా గుండెపోటుకు గురవుతుండడంతో ప్రజల్లో సహజంగానే అనుమానాలు రేకెత్తుతాయి. కోవిడ్ సమయంలో తీసుకున్న టీకాలతో గుండెపోటు మరణాలు ప్రధాన కారణం సంభవిస్తున్నాయన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ క్రమంలో ఎవరు ఎలా మరణించినా దీనికి టీకా తీసుకోవడమే కారణమనే అపోహలు పెరిగిపోతున్నాయి. ఇటీవల కాలంలో వేదికపై మాట్లాడు, పాటలు పాడుతూ, జిమ్‌లో కసరత్తు చేస్తూ, బరాత్‌లలో నృత్యాలు చేస్తూ.. ఇలా ఎంతోమంది గుండెపోటుకు గురైన దృశ్యాలు, కథనాలు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతుండడం, అవి క్షణాల్లోనే వైరల్ అవుతుండడంతో చాలా మంది ఇది నిజమేనేమో అన్న అపోహకు గురవుతున్నారు. కానీ, ఇవేవీ నిజం కావని కేంద్రం తాజాగా స్పష్టం చేసింది.
నిశితంగా పరిశోధనలు..
కోవిడ్ తర్వాత ముఖ్యంగా 18 ఏళ్ల నుంచి 45 ఏళ్ల వారి ఆకస్మిక మరణాలపై పరిశోధనలు చేశారు. వీటిని ఐసీఎంఆర్, ఎన్‌సీడీసీలు పలు కోణాల్లో పరిశోధనలు జరిపాయి. వాటి పరిశోధనలో పలు కీలక అంశాలు వెలుగుచూశాయి. ముఖ్యంగా 2021 నుంచి 2023 వరకు ఆరోగ్యంగా ఉండీ హఠాన్మరణం చెందిన వారిపై ఈ సంస్థలు పరిశోధనలు చేశాయి. వీటికి, కోవిడ్(covid-19 in india) టీకాలకు ఎలాంటి సంబంధం లేదని తేల్చిచెప్పాయి. అయితే ఈ మరణాలకు ప్రధానంగా జన్యుపరమైన సమస్యలు, జీవన శైలి, గతంలో ఎదుర్కొన్న అనారోగ్య సమస్యలే కారణమై ఉండొచ్చని అధ్యయనంలో తేలినట్టు స్పష్టం చేశాయి.
ఆ టీకాలు సురక్షితమే…
ఇటీవల గుండెపోటులకు కోవిడ్ (covid-19)టీకాలు ఎంతమాత్రం కారణం కాదని కేంద్రం స్పష్టం చేసింది. కర్ణాటకలోని హాసన్ జిల్లాలో కేవలం 40 రోజుల్లోనే 24 మంది గుండెపోటుతో మరణించినట్టు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. అయితే ఈ మరణాలకు కోవిడ్ టీకాలు కారణమై ఉండొచ్చనే అక్కడి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య అనుమానం వ్యక్తం చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన కేంద్రం స్పందించింది. దేశంలోని కొవిడ్–19 టీకాలు పూర్తిగా సురక్షితమైనవని, జాతీయ వైద్యసంస్థల పరిశోధనల్లో ఇది స్పష్టమైందని పేర్కొంది. ప్రజలు టీకాలపై ఎలాంటి అపోహలకు గురికావద్దని సూచించింది.
కోవిడ్-19 అనేది కరోనా వైరస్
కోవిడ్-19 అనేది కరోనా వైరస్ డిసీస్ 2019కి సంక్షిప్త రూపం. ఇది SARS-CoV-2 అనే కొత్తరకమైన కరోనా వైరస్ తో పుట్టింది. 2019లో చైనాలో ఈ వైరస్ పుట్టింది. తర్వాత ్రపంచవ్యాప్తంగా మహమ్మారిగా విస్తరించింది. చైనాలోని వూహాన్ నగరంలో మొదటి కేసులు నమోదైంది. మొదట్లో ఇది జంతువుల మార్కెట్ నుంచి వ్యాపించినట్టు గుర్తించారు. 2020 ప్రారంభంలో మానవులకు సులభంగా వ్యాపించగల వైరస్ అని నిర్ధారణ అయింది. మార్చి 11, 2020 ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) కోవిడ్-19ను గ్లోబల్ పాండెమిక్‌గా ప్రకటించింది.
భారతదేశంలో ..
ఇండియాలో మొదటి దశ జనవరి 30, 2020లో తొలి కోవిడ్ కేసు కేరళలో నమోదైంది. మార్చి 24, 2020: ప్రధాని నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ ప్రకటించారు. మాస్కులు, భౌతిక దూరం, శానిటైజర్‌లు ప్రజల జీవితంలో భాగమయ్యాయి. రెండో దశ 2021 – డెల్టా వేరియంట్, అత్యంత ప్రభావశీలమైన డెల్టా వేరియంట్ కారణంగా భారీగా మరణాలు సంభవించాయి. మూడో దశ 2022లో ఒమిక్రాన్ వేరియంట్ పెద్ద ఎత్తున కేసులు వచ్చాయి కానీ మరణాలు తక్కువగా ఉన్నాయి.