TRUMP TARGET ELAN MUSK: ప్రపంచ కుబేరుడు, టెస్లా యజమాని ఎలాన్‌ మస్క్‌, అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌ మధ్య వైరం మరోసారి వెలుగుచూసింది. ట్రంప్‌ మరోసారి మస్క్‌ను టార్గెట్‌ చేశాడు. ఇందులో భాగంగా మస్క్‌పై వేటు వేసేందుకు ట్రంప్‌ రెడీ అయ్యాడు. అతడిపై డోజ్‌(DOGE)ను అస్ర్త్రంగా వాడనున్నట్టు తెలుస్తోంది. ఇదే విషయం అమెరికా మీడియా కోడై కూస్తోంది. గత కొద్ది రోజుల నుంచి ఇద్దరి మధ్య వైరం పీక్‌కు చేరిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి మస్క్‌ను బెదిరింపు ధోరణి అవలంబించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.

మస్క్‌పై డోజ్‌ అస్త్రం

TRUMP TARGET ELAN MUSK: డోలాల్డ్‌ ట్రంప్‌ రెండో సారి అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత రోజుకో వివాదంతో ప్రపంచ వ్యాప్తంగా చర్చకు తెరలేపుతున్నారు. ఎన్నికల వేళ ట్రంప్‌, మస్క్‌ చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ ఒకరినొకరు ఆకాశానెత్తుకున్నారు. ట్రంప్‌ గెలుపు కోసం మస్క్‌ తీవ్రంగా శ్రమించారు. ఇంతకాలం డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియన్సీ(డోజ్‌)కు సేవలందించిన మాస్క్‌పై అదే డోజ్‌ కొరడా ఝులిపించాలని ట్రంప్‌ యోచిస్తుండడం విశేషం. ట్రంప్‌ గెలిచాక డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ ఎఫిషియన్సీ(డోజ్‌)ను ప్రయోగించాలని చూస్తున్నారు. మాస్క్‌ వ్యాపారాలకు ఎన్నో రకాల సబ్సిడీలు సర్కారు నుంచి అందాయని, మస్క్‌ తయారు చేస్తున్న రాకెట్‌ ప్రయోగాలకు, శాటిలైట్లు, విద్యుత్‌ కార్ల తయారుకు పెద్ద మొత్తంలో సబ్సిడీ ఇస్తున్నట్టు ట్రంప్‌ పేర్కొంటున్నారు. డోజ్‌ను అస్త్రంగా చేసుకుని మస్క్‌కు అందిస్తున్న సబ్సిడీలను ఎత్తివేయాలని చూస్తోంది. ఇదే జరిగితే మస్క్‌ వ్యాపారాలకు గట్టి ఎదురుదెబ్బ తగిలినట్టే.

మస్క్‌ వెనక్కి తగ్గాడా..?

ట్రంప్‌ రోజుకో విధంగా టార్గెట్‌ చేస్తుండడం మస్క్‌ ఆలోచనలో పడ్డట్టు తెలుస్తోంది. ఇప్పటికే ట్రంప్‌ను ఎదిరించి స్టార్‌లింక్‌ను మస్క్‌ ఇండియాలో ప్రవేశ పెట్టేందుకు రెడీ అయ్యారు. దీంతో అగ్గిమీద గుగ్గిలం అవుతున్న ట్రంప్‌ ఇప్పుడు సబ్సిడీలను ఎత్తివేయాలని చేస్తుండడం, అలాగే అతడిని దేశం నుంచి బహిష్కరించాలనే దిశగా పావులు కదుపుతున్నట్టు అమెరికా మీడియాలో ఇటీవల కథనాలు పెరిగిపోయాయి. మస్క్‌ను దేశ బహిష్కరణ చేస్తారా అని ట్రంప్‌ను అక్కడి ఓ విలేకరి ప్రశ్నించగా పరిశీలిస్తామంటే బదులివ్వడం దీనికి బలం చేకూరుస్తోంది. ఈ క్రమంలో మస్క్‌ కాస్త వెనక్కి దగ్గినట్టు ప్రచారం కూడా సాగుతోంది. అయితే ఇటీవల మస్క్‌ మాట్లాడుతూ సబ్సిడీలు ఎత్తివేస్తామంటూ ట్రంప్‌ బెదిరిస్తున్నారని, దమ్ముంటే ఎత్తివేసి చూపాలంటూ ప్రతి సవాల్‌ విసిరిరారు. మరి ఈ వివాదం మునుముందు మరెంత ముదురుతుందే చూడాలి.

డోజ్ అంటే ఏమిటి?

డోజ్ అంటే డిపార్ట్ మెంట్ ఆఫ్ గ‌వ‌ర్న‌మెంట్ ఎఫీసియ‌న్సీ. ప్రభుత్వంలో సమర్థత కోసం ప్రత్యేక విభాగంగా దీన్ని ట్రంప్ రెండో సారి అమెరికా అధ్య‌క్షుడు అయ్యాక అమ‌ల్లోకి తెచ్చారు. ప్రభుత్వ విధానాలు, కార్యాచరణలు త్వరగా, తక్కువ ఖర్చుతో, మంచి ఫలితాలను ఇవ్వాలన్నది దీని ల‌క్ష్యం.
ఉత్పాదకతను పెంపొందించడం, అనవసర ఖర్చును తగ్గించడం, ప్రజలకు సేవలు వేగంగా అందించడం ప్ర‌ధాన ఉద్దేశం. డెసెంబర్ 2024లో తొలి ప్రణాళిక వచ్చింది, కానీ అధికారికంగా జనవరి 20, 2025న శ్వేత గృహ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారా తయారైంది . ఇది సంయుక్త విభాగంలా పనిచేస్తుంది మరియు USDA చరిత్రాత్మక US Digital Service ని స్థానంలోకి తీసుకుంది, ఇప్పుడు United States DOGE Service (USDS) అని పిలవబడుతుంది

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *