IPL2024: కొద్ది రోజుల్లో ఐపీఎల్‌(ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌) టీ-20 క్రికెట్ అట్ట‌హాసంగా ప్రారంభం కానుంది. ఇప్ప‌టికే జ‌ట్ల‌న్నీ తీవ్ర క‌స‌ర‌త్తులో నిమ‌గ్న‌మయ్యాయి. ఈనెల 22 నుంచి ఏప్రిల్ 7వ వ‌ర‌కు క్రికెట్ పండుగ సాగ‌నుంది. ఈ పోటీల‌ కోసం క్రికెట్ అభిమానులు ఆస‌క్తిగా ఎదురుస్తున్నారు. తొలిమ్యాచ్ 22న చెన్నై, బెంగుళూరు మ‌ధ్య జ‌ర‌గ‌నుంది. 2008 నుంచి ప్రారంభ‌మైన ఐపీఎల్ మ్యాచ్‌ల‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా య‌మ క్రేజీని తెచ్చాయి. ప్ర‌తీ రెండు ఏళ్ల కోసం జ‌రిగిన మ్యాచ్‌ల‌కు ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఎక్కువే. ఈసారి స‌రి ఐపీఎల్ స‌రికొత్త‌గా అల‌రించ‌నున్నాయి. ఈసారి 72 ప్లేయ‌ర్ల‌ను వేలంలో ఏకంగా 230కోట్ల 75ల‌క్ష‌లు వెచ్చించారు. ఇందులో 30 మంది విదేశీ ప్లేయ‌ర్లు ఉన్నారు. మొత్తం 10 టీంలు ఉండ‌గా ఓ టీమ్ వ‌ద్ద 25 మంది ఆట‌గాళ్లు ఉన్నారు. 2024లో జ‌రిగేది 17వ ఐపీఎల్ సీజ‌న్‌.

 

ఒక్క టైటిల్ కూడా గెల‌వ‌ని టీంలు..

ప్రస్తుతం 17 టైటిల్ పోరు జ‌రుగుతుండ‌గా ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా విజేత‌గా నిల‌వ‌ని టీం(IPL)లు చాలానే ఉన్నాయి. వీటిలో కొన్ని టీంలు బ‌రిలో లేక‌పోయినా.. కొన్ని టీం ఇంకా ఆడుతున్నా టైటిల్‌ను మాత్రం సాధించ‌లేక పోయాయి.

  • ఢిల్లీ క్యాపిట‌ల్ ఇప్ప‌టి వ‌ర‌కు ఒక్క‌సారి కూడా విజ‌త‌గా నిల‌వేల‌క పోయింది. 20202లో మాత్ర‌మే క్వాలిఫై అయింది. ఎన్నో అంచ‌నాల‌తో బ‌రిలో దిగుతున్నా ఫ‌లితం మాత్రం అంతంత మాత్ర‌మే.
  •  పంజాబ్ కింగ్స్ కూడా ఇంత వ‌ర‌కు టైటిల్ గెలుపు ఖాతా తెర‌వ‌లేదు. కేవ‌లం 2014లో మాత్ర‌మే ఫైన‌ల్ చేరింది. ఆ త‌ర్వాత ఆట‌గాళ్లు మారినా ఫ‌లితం లేదు.
  • ల‌క్నో సూప‌ర్ గేయింట్ 2022 నుంచి ఐపీఎల్‌కు కొత్త‌గా వ‌చ్చింది. త‌ర్వాతి రెండు సీజన్లు 2022, 2023 జ‌రిగినా ఇప్ప‌టి వ‌ర‌కు ప్లే ఆఫ్ తోనే స‌రిపెట్టుకుంది.
  •  చెన్నై, రాజ‌స్థాన్ రాయ‌ల్స్ టీంలు 2015, 2016 రెండేళ్లు విషేధానికి గుర‌వ‌డంతో వాటి స్థానంలో వ‌చ్చింది రైజింగ్ పూణే సూప‌ర్ గేయింట్‌, గుజ‌రాత్ ల‌య‌న్స్‌ టీంలు. కానీ పూణే టైటిల్ రేసులో నిల‌వ‌లేక‌పోయింది.
  •  మ‌రో టీమ్‌ గుజ‌రాత్ ల‌య‌న్స్ కూడా ఆ రెండు సీజ‌న్ల‌లో ఆక‌ట్టుకోలేక పోయింది. 2015లో పూర్తిగా విఫ‌ల‌మైనా, 2016లో మాత్రం ప్లే ఆఫ్‌కు చేరుకోగ‌లిగింది.
  • 2010, 2011 సీజ‌న్‌లో ఆడిన పూణే వారియ‌ర్ ఇండియా కూడా ఐపిఎల్ టైటిల్ గెల‌వ‌లేక పోయింది.
  •  కోచ్చి ట‌స్క‌ర్ కేర‌ళ 2011 ఒక్క సీజ‌నే ఆడినా ఏ మాత్రం ఆక‌ట్టుకోలేక పోయింది. ఆ టీం ఎలా వ‌చ్చిందో అలాగే వెళ్లిపోయింది.
  •  బెంగుళూరు, 2009, 2011, 2016 ఫైన‌ల్‌కు చేరినా టైటిల్‌ను మాత్రం ముద్దాడ‌లేక పోయింది. ఈ టీమ్‌కు కింగ్ కోహ్లీ క్యాప్ట‌న్‌గా ఉన్నా జ‌ట్టుకు మాత్రం క‌ప్పు అందించ‌లేక పోయారు.

ఐపీఎల్ విజేత‌లు

  1.  చెన్నై సూపర్ కింగ్స్ ఇప్ప‌టి వ‌ర‌కు 2010, 2011, 2018, 2021, 2023 టైటిళ్ల‌ను సాధించింది.
  2.  డ‌క్క‌న్ చార్సెజ్‌(హైద‌రాబాద్ స‌న్ రైజ‌ర్స్‌) కేవ‌లం 2009 లో ఒకే ఒక్కసారి టైటిల్‌ను గెలిచింది.
  3.  రాజ‌స్తాన్ రాయ‌ల్ ఐపీఎల్ తొలి టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. 2008లో ఐపిఎల్ టీ-20 ప్రారంభం కాగా తొలి టైటిల్‌నే గెలుపొందింది. ఆ త‌ర్వాత ఆ స్థాయిలో ఆట తీరు లేక‌పోవ‌డంతో మ‌రో టైటిల్‌ను గెల‌వ‌లేక పోయింది.
  4.  కోల్‌క‌తా నైట్ రైడ‌ర్స్ కేవ‌లం 2012లో మాత్ర‌మే విజేత‌గా నిలిచింది.
  5.  ముంబాయి ఇండియ‌న్స్ 2013, 2015, 2019, 2020లో టైటిళ్ల‌ను ఎగురేసుకుపోయింది.
  6.  డ‌క్క‌న్ చార్జెస్ పేరుగా స‌న్‌రైజ్ హైద‌రాబాద్‌కు మారాక 2016లో మాత్ర‌మే విజేత‌గా నిలిచింది. ఆ త‌ర్వ‌తా ఆ స్థాయి ప్ర‌ద‌ర్శన ఇవ్వ‌లేక పోయింది.
  7.  గుజ‌రాత్ టైటాన్స్ 2022లో విజేత‌గా నిలిచి క్రికెట్ అభిమానుల‌ను ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. ఈసారి కూడా టైటిల్ గెలిచే స‌త్తా ఉంద‌ని చాటుతోంది.

 

ఈసారి ఐపీఎల్ జ‌ట్ల క్యాప్టెన్లు కోచ్‌లు..

  •  సన్ రైజర్స్ హైదరాబాద్ క్యాప్టెన్‌గా ఐడెన్ మార్క్రామ్, కోచ్‌గా డేనియల్ వెట్టోరి, గ‌త సీజ‌న్‌లో సార‌థిగా ఉన్న డేవిడ్ వార్న‌ర్ ఢిల్లీకి సార‌థ్యం వ‌హిస్తుండంతో మార్క్రామ్ కు బాధ్య‌త‌లు అప్ప‌గించింది.
  •  చెన్నై సార‌థిగా మళ్లీ ఎంఎస్ ధోని కొన‌సాగుతున్నారు. కోచ్‌గా స్టీఫెన్ ఫ్లెమింగ్ ఉన్నారు.
  • ముంబై ఇండియన్స్ క్యాప్టెన్‌గా హార్దిక్ పాండ్యా కోచ్‌గా మార్క్ బౌచర్ ఉన్నారు. టీమ్ మేనేజ్‌మెంట్ అనూహ్యంగా కెప్ట‌న్ రోహిత్ శ‌ర్మ‌ను కాద‌ని పాండ్యాకు బాధ్య‌త‌లు అప్ప‌గించ‌డం విశేషం.
  • గుజరాత్ టైటాన్స్ క్యాప్టెన్‌గా శుభ్‌మ‌న్ గిల్, కోచ్‌గా ఆశిష్‌ నెహ్రా
  • లక్నో సూపర్ జెయింట్స్ క్యాప్టెన్‌గా కె.ఎల్. రాహుల్ కోచ్‌గా జస్టిన్ లాంగర్
  • ఢిల్లీ క్యాపిటల్స్ క్యాప్టెన్‌గా డేవిడ్‌ వార్నర్ ఉండ‌గా, కోచ్ గా రికీ పాంటింగ్
  • పంజాబ్‌ కింగ్స్ క్యాప్టెన్‌గా శిఖర్ ధావన్, కోచ్‌గా ట్రెవర్ బేలిస్
  •  రాజస్తాన్ రాయల్స్ క్యాప్టెన్‌గా సంజు శాంసన్, కోచ్‌గా కుమార సంగక్కర
  •  రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ క్యాప్టెన్‌గా ఫాఫ్ డు ప్లెసిస్, కోచ్‌గా ఆండీ ఫ్లవర్
  •  కోల్‌కతా నైట్‌రైడర్స్ క్యాప్టెన్‌గా శ్రేయాస్ అయ్య ర్ , కోచ్‌గా చంద్రకాంత్ పండిట్

ఈ సీజ‌న్‌లో ఎవ‌రి రేటు ఎంతంటే..

  • మిచెల్ స్ట్రాస్‌- రూ.24కోట్ల 75ల‌క్ష‌లు( కోల్‌క‌త‌)
  • ప్యాట్ క‌మ్మిన్స్ రూ. 20కోట్ల 50ల‌క్ష‌లు( హైద‌రాబాద్‌)
  • డారియ‌ల్ మిచెల్ రూ.14కోట్లు (చెన్నై)
  • హ‌ర్ష‌ల్ ప‌టేల్ రూ.11కోట్ల 75 ల‌క్ష‌లు( పంజాబ్‌)

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *