India 6G revolution:ప్రపంచంలో సాంకేతిక రంగం రోజుకో కొత్తపుంత తొక్కుతోంది. ఇప్పటికే రోబో, ఏఐ, స్మార్ట్‌ వర్క్‌.. అంటూ వినూత్న ఆవిష్కరణలు అబ్బురపరుస్తున్నారు. ఇక సెల్‌ఫోన్‌ రంగంలో ఏకంగా సాంకేతిక విప్లవమే చోటుచేసుకుంది. ఇప్పటికే 3జీ నుంచి 4జీకి అప్‌డేట్‌ అవగా, ఇప్పుడు 4జీ నుంచి 5జీకి శరవేగంగా మారుతోంది. ఇంకా పూర్తిస్థాయిలో ఇండియాలో 5జీ సేవలు అందుబాటులోకి రాకముందే.. ఇండియా ప్రపంచ దేశాలకు సవాల్‌ విసురుతూ ఏకంగా 6జీ టెక్నాలజీని అందుబాటులోకి తేవడానికి ఉవ్వీళ్లూరుతోంది. 5జీ ఇంటర్‌నెట్‌ శరవేగంగా పనిచేస్తుందంటే.. దానికి అధిక రేట్లు 6జీ పనిచేయనుంది. 6జీ అందుబాటులోకి వస్తే ప్రపంచ రూపురేఖలే మారిపోతాయని టెక్‌రంగ నిపుణులు భావిస్తున్నారు.

  • ఇండియాలో ఇప్పటికే ఎయిర్‌టెల్‌ 5జీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. కానీ అది కొన్ని నగరాలకే పరిమితమైంది. 5జీ మార్కెట్‌ను అందిపుచ్చుకునేందుకు రిలయన్స్‌ జియో శరవేగంగా అడుగులు వేస్తోంది. దానిలో భాగంగా 2024నాటికి దేశవ్యాప్తంగా విస్తరించాలని భావిస్తోంది. వచ్చే దీపావళి నాటికి 5జీ ధరల ప్యాకేజీని ప్రారంభించనున్నట్టు ప్రకటించడం విశేషం.

విపణిలోకి 6జీ సేవలను అతిత్వరలోనే అందుబాటులోకి తెస్తామంటూ ఇటీవల కేంద్ర టెలికం మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ కీలక ప్రకటన చేయడం విశేషం. అంతర్జాతీయ టెలికమ్యూనికేషన్స్‌ యూనియన్‌ (ఐటీయూ) ఆధ్వర్యంలో కాగా, 6జీ, 5జీ మొబైల్‌ సిస్టం అభివృద్ధికి అధ్యయన బృందాలను ఏర్పాటు చేయగా, దానికి ఇండియా ప్రతినిధులు నేతృత్వం వహిస్తున్నట్టు మంత్రి పేర్కొన్నారు. పరిస్థితులు చూస్తుంటే అతిత్వరలోనే 6జీ సేవలు అందుబాటులోకి రావడం ఖాయమని తెలుస్తోంది. ఇదే జరిగితే మొబైల్‌ రంగంలో మరో నవశకం ఆరంభమైనట్టేనని సాంకేతిక నిపుణులు పేర్కొంటున్నారు.

 

  • టెలికం విభాగం (డిఓటీ) విడుదల చేసిన 6జీ విడుదల చేసిన డాక్యుమెంటరీ ప్రకారం. 5జీ సెకండ్‌కు 10గిగా బైట్‌ వేగంతో పనిచేస్తే అదే 6జీ ఏకంగా 100 గిగాహెడ్జ్‌తో పనిచేస్తుంది. అలాగే ఫ్రీక్వెన్సీ బ్యాండ్‌ 5జీ 24 గిగాహెడ్జ్‌ ఐతే 6జీ మాత్రం 66 గిగాహెడ్జ్‌తో పనిచేస్తాయి. ఇక స్పెక్ట్రమ్‌ వేవ్స్‌ విషయానికి వస్తే 5జీ 30 గిగాహెడ్జ్‌తో పనిచేస్తే, 6జీ ఏకంగా 300 టెరాహెడ్జ్‌తో పనిచేస్తాయి. దాంతో సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లు, రిమోట్‌ హెల్త్‌ కేర్‌, స్మార్ట్‌ సిటీలకు 6జీ ఎంతో కీలకం కానున్నాయి. అంతేకాదు, ఒక్క నిమిషంలోనే వందలాది సినిమాలను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. నెట్‌ ఎట్టిపరిస్థితిలో బర్ఫింగ్‌ ఉండదని తెలుస్తోంది. 6జీ టెక్నాలజీ 2030నాటి పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తాయని తెలుస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *