SUGAR DADY: సనాతన ధర్మానికి మారుపేరైన భారతదేశంలో విష సంస్కృతి రోజురోజుకూ విస్తరిస్తోంది. సంప్రదాయం, కుటుంబ బంధాలకు అత్యంత విలువనిచ్చే ఇండియా పాశ్చాత్య సంస్కృతి విశృంఖలంగా విస్తరిస్తోంది. మానవసంబంధాలు మంటగలుస్తున్నాయి. యువత పెడదోవపడుతోంది. ఇప్పటికే పండుగలు, పర్వదినాలు, శుభకార్యాలయాల్లో పాశ్చాత్య ధోరణి చొచ్చుకొచ్చింది. తాజాగా విష బంధనం వికృతరూపం దాల్చుతోంది. అదే షుగర్‌ డాడీ పేరు చూడ్డానికి తీయగా ఉన్న అ సంస్కృతి తెలుసుకుంటేనే కంపరం పడుతుంది. ఇప్పటివరకు మహానగరాలకే పరిమితమైన ఈ షుగర్‌ డాడీ యవ్యారం ఇప్పుడు పల్లెలకు తాగడంతో మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

షుగర్‌ డాడీ అంటే ఏమిటీ..

ఇదే విచిత్ర రిలేషన్‌. యుక్త వయసులో ఉన్న అమ్మాయి.. నడిఈడు దాటిన పురుషుడితో డేటింగ్‌ చేయడం. ఇద్దరు పరస్పర అంగీకారంతోనే డేటింగ్‌ చేస్తారన్నమాట. ఇలా షుగర్‌డాడీ డేటింగ్‌ ఉన్న పురుషుడు సదరు అమ్మాయి రిలేషన్‌ ఉన్నసేపు ఆర్థిక అవసలు తీర్చాలన్నమాట. ఆమెకుపూర్తి ఆర్థిక భద్రత కల్పించడం ఆ వ్యక్తి బాధ్యత. అలాగే విలాసవంతమైన వస్తువులు కొనివ్వడం, విల్లాలాంటి స్థిరాస్తులు అందించడం ఇందులో భాగమే. ఇందుకుగాను ఒకరిపై ఒకరు అనురాగం, ఆప్యాయత, ప్రేమను పంచాల్సి ఉంటుంది.

విదేశాల్లో సర్వసాధారణం..

షుగర్‌ డాడీ(SUGAR DADY), షుగర్‌ బేబీ, షుగర్‌ బాయ్‌. డేటింగ్‌ వంటి పేర్లలతో ఈ సంస్కృతి విదేశాల్లో ఎప్పటినుంచో ఉంది. అక్కడ విహహ వ్యవస్థ పటిష్టంగా లేకపోవడం, కలిసి జీవించడంపై ఆసక్తి అంతగా చూపరు. ఈక్రమంలో డేటింగ్‌ వ్యవస్థ పుట్టుకొచ్చింది. అవసరం ఉన్నవరకు లింగ్‌లోఉండడం, ఆతర్వాత ఎవరిదారి వారి చూసుకోవడం సర్వసాధారణం. ఇది ఇప్పటివరకు యువతలో డేటింగ్‌ వ్యవహారం కనబడేది. అదికాస్త వయసును సైతం విస్మరించి డేటింగ్‌దిశగా సాగడంతో మేధావులు ఆందోళన కలిగిస్తోంది.

పల్లెలకు పాకిన షుగర్‌ డాడీ..

ఈ షుగర్‌ డాడీ వ్యవహరం ఇండియాలో గతంలోనూ కనిపించిన దాఖలాలు లేవు. పాశ్చాత్య సంస్కృతిని ఒక్కొక్కటిగా ఒంటబట్టించుకుంటున్నారు. ఇండియా ఇప్పటికే డేటింగ్‌ వ్యవహారం నడుస్తోంది. మొదట్లో మహానగరాకలు పాకినా క్రమక్రమంగా పల్లెలకు చేరింది. ఈ షుగర్‌ డాడీ అడదపాదడపా పట్టణాల్లో వెలుగులోకి వచ్చేవి. ప్రస్తుతం ఈ సంస్కృతి పల్లెలకు పాకడం కలవరపడుతోంది. కొందరు ధనవంతులు పేదరికంతో అల్లాడే యువతిని ఎంచుకుని డేటింగ్‌ చేస్తున్నారు. అలాగే తమ ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు పేద, మధ్య తరగతి యువతులు షుగర్‌ డాడీ డేటింగ్‌కు ముందుకు వస్తున్నారు. దీనికి అర్థికపరమైన కారణాలు చెబుతున్నా జరిగేది వేరే అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

ఆ పని కూడా..

షుగర్‌డాడీ వ్యవహారం ఆర్థికపరమైన అంశాలకే ఆగిపోవడం లేదు. ఇద్దరూ ఇష్టపడి అగ్రిమెంట్‌ చేసుకుని షుగర్‌ డాడీకి అంగీకరిస్తుండడతో శృంగారం భాగమైపోయింది. దీంతో వావివరసలు మాయమవుతున్నాయి. చిన్నాపెద్దా అంతరం తెగిపోతోంది. ఒకరకంగా చెప్పాలంటే ఇదే కొత్తరకం వ్యభిచారంలా మారింది.

 

––ఎక్కవగా చదివినవి––

మహేష్‌ బాబు కోసం రాజమౌళి వెతుకులాట

రికార్డు సృష్టించిన అయోధ్య

న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్‌

దొరికిన కుంభకర్ణుడి ఖడ్గం

రామగుండం కొత్త చరిత్ర

One thought on “షుగర్‌ డాడీ.. పల్లెలకు విస్తరించిన విష సంస్కృతి”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *