NO NIGHT: సూర్యుడు, చంద్రుడు. ఒకరు పగలు వస్తే మరొకరు రాత్రికి వస్తారు. ఇది నిత్యం అన్ని దేశాల్లో జరిగే ప్రక్రియే. కానీ కొన్నిదేశాల్లో మాత్రం చంద్రుడు రాడు.. సూర్యుడే ఎక్కువ కాలం ఉంటాడు. దీంతో అక్కడ చీకటే పడదు. ఇంకో దేశంలో సూర్యుడు రాడు, అక్కడ చీకటి పడదు. ఈ చిత్ర విచిత్రాల జాబితాలో నార్వే, ఫిన్‌లాండ్‌, స్వీడన్‌, ఐలాండ్‌, అలస్కా తదితర దేశాలున్నాయి. ఈ వింత వాతావరణం, ఆ దేశ విశేషాలు తెలుసుకుందామా.

నార్వే…

ఉత్తర ఐరోపాకు చెందిన దేశం నార్వే. దీనిని కింగ్‌డమ్‌ ఆఫ్‌ నార్వే, యూనిటరీ, మొనార్చీ అని కూడా పిలుస్తారు. అతితక్కువ జనాభా గల దేశాల్లో ఇది ఒకటి. ఇది ఎత్తైన, మంచు పర్వతాలతో కూడుకున్న దేశం. అందుకే వాతావరణం చాలా చల్లగా ఉంటుంది. కానీ, మే చివర నుంచి జూలై వరకు సూర్యుడు ఎక్కువ సమయం ఉంటాడు. ఆ సమయంలో పగటిపూట ఏకంగా 20గంటల వరకు ఉంటుంది. అందుకే దీనిని మిడ్‌నైట్‌ సన్‌ ల్యాండ్‌ అని కూడా పిలుస్తుంటారు. దీంతో రాత్రి అనేది లేకుండా పోతుంది. అర్ధరాత్రి వరకు సూర్యుడు ప్రకాశిస్తూనే ఉంటాడు. ఈ సమయంలో ప్రజలు తమ వాచ్‌లను చూసుకుని నిద్రపోతుంటారు. ఆఫీసు వేళలను, పనులు చేసుకోవడం చేస్తుంటారు.

ఫిన్‌లాండ్

ఉత్తర ఐరోపా సార్వభౌమాధికారం కలిగిన దేశాల్లో ఫిన్‌లాండ్‌ ఒకటి(NIGHT). ఇక్కడ సుమారు 6మిలియన్ల జనాభా ఉంది. స్వతంత్ర ఐలాండ్‌ ద్వీపాలలో ఇది ఒకటి. స్వీడన్‌ నుంచి వేరుపడిన దేశమిది. ఇక్కడ 1.70లక్షల వరకు సరస్సులు, 1.80లక్షల వరకు ద్వీపాలు ఉండడం గమనార్హం. ఎక్కువ మంచు పర్వతాలు కలిగిన దేశం. అంతేకాదండోయ్‌ ఇక్కడి భూమి ఏటా సెంటిమీటర్‌ పెరుగుతుంది. బౌన్‌ ఎలుగుబంట్లు ఉండేది ఇక్కడే. ఉత్తర, దక్షిణ సముద్ర తీరాల్లో పెను వాతావరణ మార్పులు సంభవిస్తాయి. ఉత్తర దిశలో సూర్యుడు వేసవిలో 73 వరుసగా రోజులు అస్తమించడం. అలాగే 51 రోజులు ఉదయించడు.

స్వీడన్‌

ఉత్తర యూరప్‌ దేశాలకు చెందినవాటిలో స్వీడన్‌ ఒకటి. మెట్రోపాలిటన్‌ సిటీల్లో మినహా మిగతా ప్రాంతాల్లో జనసాంద్రత చాలా తక్కువగా ఉంటుంది. ఇక్కడి జనాభా 10మిలియన్ల వరకు ఉంటుంది. ఆధునిక జీవనం గడుపుతున్న ఆదేశాల్లో స్వీడన్‌కు ప్రత్యేక స్థానం ఉంది. ఇది ఉత్తర అక్షాంశంలో ఉంది. అధిక అక్షాంశం కావడంతో ఇక్కడ వేసవికాలంలో సూర్యుడు అస్తమించడు. మే నుంచి జూన్ వరకు ఇక్కడ పగటి సమయం ఏకంగా 18గంటల వరకు ఉంటుంది. అదే డిసెంబర్‌లో సూర్యుడు ఆరు గంటలు మాత్రమే ఉంటాడు.

అలస్కా..

ఉత్త అమెరికా ఖండానికి అత్యంత సమీపంగా ఉన్న దేశం అలస్కా. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఒకటి. భూభాగంలో అమెరికా అన్ని రాష్ట్రాల కంటే పెద్దది. అమెరికాలో అతిపెద్ద సముద్ర తీర ప్రాంతం ఇదే కావడం విశేషం. అడవులు, పర్వతాలకు పెట్టింది పేరు. ఇక్కడ సూర్యడే ఎక్కువ కాలం ఉంటాడు. మే నుంచి జూన్ వరకు అర్ధరాత్రి వరకు సూర్యుడు అస్తమించ డు.

ఐలాండ్..

మంచు, అగ్నిపర్వతాలకు ప్రసిద్ధి. మే రెండో వారం నుంచి ఇక్కడ చీకటి పడదు. ప్రజలు తమ పనులకు విభజించు కు టైం ప్రకారం చేసుకుంటారు.

 

––ఎక్కవగా చదివినవి––

మహేష్‌ బాబు కోసం రాజమౌళి వెతుకులాట

రికార్డు సృష్టించిన అయోధ్య

న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్‌

దొరికిన కుంభకర్ణుడి ఖడ్గం

రామగుండం కొత్త చరిత్ర

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *