CRIKET: న్యూజిలాండ్ చరిత్ర లిఖించింది. టీమిండియాపై వైట్‌వాష్ చేసి రికార్డు సృష్టించింది. ఇండియాను ఇండియాలో మూడు టెస్టు సీరిస్‌ను క్లీన్ చీట్ చేయడం కొత్త చరిత్రను తిరగరాసింది. మూడు టెస్టుల్లో ఎక్కడా ఇండియా పైచేసి సాధించలేదు. మొత్తం ఆరు ఇన్నింగ్స్‌లలో న్యూజిలాండ్ చేతిలో ఆలౌట్ అయింది. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ నవంబర్ 22న ప్రారంభమవుతుంది. అలాగే వరల్డ్ టెస్ట్ క్రికెట్ ఫైనల్‌కు చేరే అవకాశాలను మరింత క్లిస్ట తరం చేసుకుంది. ప్లేయర్ ఆఫ్ మ్యాచ్ అజిజ్ పటేల్, ప్లేయర్ ఆఫ్ ది సిరిస్ విల్ యంగ్ సొంతం చేసుకున్నారు.
మూడో టెస్టుఇలా..
నవంబరు ఒకటిన మూడో టెస్టు(CRIKET) ముంబాయిలోని వాంఖడే స్టేడియంలో ప్రారంభమైంది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ 235పరుగులు చేసింది. విల్ యంగ్ 138 బంతుల్లో 71 (4X4, 6X2)పనుగులు చేయగా, డారియల్ మిచెల్ 129 బంతుల్లో 82 (4X3, 6X3) పరుగులతో రాణించడంతో తొలిఇన్నింగ్‌లో 235కి ఆల్ ఔట్ అయంది.రవీంద్ర జడేజా ఐదు వికెట్లు, వాషింగ్టన్ సుందర్ 4 వికెట్లతో రాణించారు. అనంతరం బరిలోకి దిగిన ఇండియా 263 పరుగులకు ఆల్ ఔట్ అయింది. శుబ్‌మన్‌గిల్ 146 బంతుల్లో 90(4X7, 6X1)తో రిషబ్‌పంత్ 60(4X8, 6X2) పరుగులతో ఆకట్టుకున్నాడు. ముగ్గురు(సిరాజ్, సర్ఫాజ్ఖాన్, ఆకాష్ దీప్) డకౌట్ అయ్యారు. మరోసారి రోహిత్ శర్మ, విరాట్ కోహి స్వల్ప స్కోర్‌కే పెవిలియం చేరి నిరాశపర్చారు. న్యూజిలాండ్ బౌలర్ అజిజ్ పటేల్ 105 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టి ఇండియా నడ్డి విరిచాడు. 263 పరుగులకు ఇండియా ఇన్నింగ్‌కు తెరపడింది. రెండో ఇన్నింగ్‌లో న్యూజిలాండ్ 174 పరుగులకు ఆల్ ఔట్ అయింది. విల్‌యంగ్ 51పరుగులతో ఆకట్టుకున్నాడు. జడేజా స్పిన్ తో మాచే స్తూ 55 పరుగులిచ్చి ఐదు వికెట్లుపడొట్టాడు. అశ్విన్ 63 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టడంతో 174 వద్ద న్యూజిలాండ్ సెకండ్ ఇన్నింగ్‌కు తెరపడింది.
కుప్పకూలిన టిమిండియా..
రెండో ఇన్నింగ్‌లో టీమిండియా పేకమేడలా కుప్పకూలింది. 146 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఇండియా కేవలం 121 పరుగులకే ఆల్ ఔట్ అయింది. రిషబ్ పంత్ 57 బంతుల్లో 64 పరుగులు చేసి విజయంపై ఆశలు కల్పించినా అజాజ్ పటేల్ బౌటింగ్‌లో రచిన్ రవింద్రకు క్యాచ్ ఇచ్చి విజయం పై నీళ్లు చల్లాడు. రెండో బ్యాటర్లంతా అలా వచ్చి ఇలా వెళ్లారు. జైశ్వాల్-5, రోహిత్-11, గిల్-1 విరాట్-1, సర్ఫరాజ్-1, జడేజా-6, సుందర్-12, అశ్విన్-8, ఆకాష్-0 తో ఓటమిని మూటగట్టుకున్నారు.
రోహిత్, కోహ్లీ లకు ఏమైంది.. ఇదేం ఆట..
మొదటి రెండు టెస్టులో విఫలమైన క్యాప్టన్ రోహిత్ శర్మ, విరాట్ మూడో టెస్టులోనూ పూర్తిగా విఫలమయ్యారు. దీంతో వారి ఏమైంది..ఇదేం అట అంటూ ఫ్యాన్ ఫైర్ అయ్యారు. న్యూజిలాండ్ బౌలర్లను ఎదుర్కోవడంతో మొదటినుంచి తడబాటు పడడంతో ఇక వారి ఆట ముగిసిన ట్టేనా అన్న ప్రచారం సాగింది. అందివచ్చిన అవకాశాన్న యంగ్‌స్టర్ సర్ఫరాజ్ ఖాన్ సద్వినియోగం చేసుకోలేకపోయాడు. బౌటింగ్‌లో హైదరాబాదీ సిరాజ్ మాయ ఏ మాత్రం పనిచేయలేదు.
టెస్టులో 200లోపు లక్ష్యాన్ని ఛేదించడంలో భారత్ విఫలం..
– 120 vs WI బ్రిడ్జ్‌టౌన్ 1997
– 147 vs NZ వాంఖడే 2024
– 176 vs SL గాలె 2015
– 194 vs ఇంగ్ ఎడ్జ్‌బాస్టన్ 2018
అత్యల్ప స్కోరును కాపాడుకున్న కివీ
– 137 vs ఇంగ్ వెల్లింగ్టన్ 1978
– 147 vs ఇండ్ వాంఖడే 2024 (అజాజ్ 6/57)
– 176 vs పాక్ అబుదాబి 2018 (అరంగేట్రంలో అజాజ్ 5/59)
– 241 vs ఆస్ హోబర్ట్ 2011
– 246 vs ఇంగ్ ది ఓవల్ 1999
– క్లిక్ చేసి ఇవి కూడా చదవండి-
మబ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారణం
ఇంటింటి సర్వే డేటా భద్రమేనా.. అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తే..
కేదార్నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
బీజేపీలో ముసలం.. నెక్ట్స్ బాస్ ఎవరంటే..?