ACTRESS KASTURI MISSING: తెలుగు వారిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలుగు, తమిళ నటి, బీజేపీ నాయకులు కస్తూరి పరారీలో ఉన్నారు. ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ తెలుగువారిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. దాంతో తెలుగు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. నెటిజన్లు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. పరిస్థితి చేదాటిపోవడంతో కస్తూరి శంకర్ తెలుగు వారికి క్షమాపణలు చెప్పారు. అయినా ఫలితం లేకుండా పోయింది. మూడురోజుల క్రితం చెన్నైలో కేసులు నమోదయ్యాయి. దాంతో అక్కడి పోలీసులు కస్తూరికి సమన్లు జారీ చేసేందుకు ఆమె ఇంటికి వెళ్లారు. అప్పటికే ఆమె ఇంటికి తాళం వేసి ఉండడంతో పోలీసులు ఫోన్ చేశారు. అయితే ఆమె ఫోన్ స్వచాఫ్ రావడంతో కస్తూరి అజ్ఞాతంలో ఉన్న విషయం బయటపడింది. ఆమె ఎక్కడ ఉందో కొనుగొనే పనులు పోలీసులు ఉన్నారు. తమిళనాడు నటి కస్తూరి శంకర్ ఇటీవల చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు తెలుగు ప్రేక్షకులలో తీవ్ర విమర్శలను రేకెత్తించాయి. ఆమె తమిళనాడులోని బ్రాహ్మణ సంఘాల ఒక సమావేశంలో తెలుగు ప్రజల చరిత్ర, తమిళనాడులో వారి స్థానం గురించి వ్యాఖ్యానించడం వివాదానికి కారణమైంది. కస్తూరి చేసిన వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య ఉద్రిక్తతలను రేపే విధంగా ఉన్నాయంటూ ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. చెన్నై పోలీసులు కేసు నమోదు చేసి ఆమె అరెస్టు అవకాశాలను పరిశీలిస్తున్నారు.
వివాదానికి కారణం..
తమిళనాడులో కస్తూరి(ACTRESS KASTURI MISSING:)మాట్లాడుతూ బ్రాహ్మణులకు మద్దతు తెలిపే విషయంలో ద్రావిడ సిద్ధాంతాలపై ఆమె విమర్శలు గుప్పించే క్రమంలో తెలుగువారి ప్రస్తావన తీసుకువచ్చారు. తమిళనాడులో ఓ వివాదం ఏళ్ల నుంచి రగులుతోంది. అదే బ్రాహ్మణులు తమిళులు కాదనే వాదన తరచూ వివాదస్పదంగా మారుతోంది. ఈ అంశంపై ఆమె వివరించే క్రమంలో 300ఏళ్ల క్రితం ఒక రాజు వద్ద అంతఃపుర స్ర్తీలకు సేవ చేసేందుకు తెలుగువారు వచ్చారని, రాజుల కాలంలో అంతఃపుర మహిళలకు సేవ చేసేందుకు వచ్చినవారు తమది తెలుగు జాతి అంటూ ఘంటాపథంగా చెబుతుంటే.. మరి ఎప్పుడో వచ్చి.. ఇక్కడ స్థిరపడిన బ్రాహ్మణులను తమిళులు కాదని చెప్పడం ఏంటని ప్రశ్నించారు. అయితే బ్రాహ్మణులు తమిళులు కాదని చెప్పడానికి మీరెవరంటూ నిలదీశారు. ఆస్తులు లూటీ ఈచేయకుండా, ఇతరుల భార్యలపై మోజు పడకుండా, బహు భార్యత్వాన్ని వీడాలని చెబుతుండడంతోనే బ్రాహ్మణులపై తమిళనాడులో వారికి వ్యతిరేక ప్రచారం సాగుతోంది అంటూ కస్తూరి శంకర్ వ్యాఖ్యానించారు. ఇదే తెగులు ప్రజల ఆగ్రహానికి కారణమైంది. బ్రాహ్మణులను కాపాడేందుకు, తమిళలను విమర్శించేందుకు తమకు అభ్యంతరం లేదని, మధ్యలో తెలుగు ఆడపడుచులను చులకన చేసి మాట్లాడడం ఏంటంటూ నెటిజన్స్ అగ్గిమీదగుగ్గిలం అవుతున్నారు. కస్తూరి ఇకనైనా తెగులు వారికి క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ కూడా వస్తోంది. మరి ఈ విషయంపై కస్తూరి ఎలా రియాక్ట్ అవుతుందోవేచి చూడాలి.
గతంలోనూ వివాదస్పద వ్యాఖ్యలు..
కస్తూరి (ACTRESS KASTURI MISSING)నోరు పారేసుకోవడం ఇదేం కొత్తకాదు. గతంలోనూ సోషల్ మీడియాలో ఓ ట్వీట్ చేసి కాంట్రవర్సికీ తెరలేపారు. సరోగతి పద్ధతిపై మాట్లాడుతూ చర్చకు తెరలేపారు. అప్పట్లో నటి నయనతార, విఘ్నేశ్‌శివన్ సరోగతి పద్ధతిలో తల్లిదండ్రులు అయ్యారు. వారిని ఉద్దేశించి ఓ ట్వీట్ చేశారు. 2022లో దేశంలో సరోగసి పద్ధతి అమల్లోకి వచ్చిందని, ఆరోగ్య, క్లిష్ట పరిస్థితిలో తప్ప ఈ పద్ధతి సరైంది కాదనంటూ ట్వీట్ చేశారు. దీంతో నయనతారు అభిమానులు కస్తూరిపై గరంగరం అయ్యారు.
టాప్‌లెస్ ఫొటో షూట్‌తో మరో కాంట్రవర్సీ..
కస్తూరి ఓ ఫొటో షూట్ దేశ వ్యాప్తంగా కాంట్రవర్సికి దారితీసింది. 2014లో జెడ్ బెల్ పుస్తకం బాడీస్ ఆఫ్ మదర్స్: ఏ బ్యూటిఫుల్ బాడీ ప్రాజెక్టులో భాగం ఆమె అర్ధనగ్న ఫోటో షూట్ చేయడం అప్పట్లో వివాదాస్పదమైంది.
కస్తూరి కెరీర్..
కస్తూరి 1970లో జన్మించగా, 2000లో డాక్టర్ రవికుమార్‌ను వివాహం చేసుకుంది. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. తమిళం, తెలుగు, మళయలం, కన్నడ భాషా చిత్రాల్లో నటిస్తోంది. పలు భాషల్లో సీరియల్స్‌లో కూడా లీడ్‌రోల్ చేస్తోంది. ప్రస్తుతం బీజేపీలో చేరి ప్రజా సేవ చేస్తున్నారు. కస్తూరి మద్రాసులో ఉన్నత పాఠశాలలో చదువుతుండగానే మోడల్లో అడుగుపెట్టారు. అంతేకాదు 1992లో మిస్ మద్రాస్ టైటిల్ గెలుచుకొంది. 1991లో ఆతా ఉన్ కోయిలిలే తమిళ చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయం అయ్యారు. అంతేకాదు రాష్ట్రస్థాయి హాకీ చాంపియన్, మైమానిక దళ విభాగంలో ఆర్డీ క్యాడెట్‌గా పనిచేయవడం విశేషం.
–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్ చేసి చదవండి–
కేసీఆర్ ఏం చేశారు.. కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు..: సీఎం ఘాటు వ్యాఖ్యలు
తెలుగు వారిని అంత మాటంటావా.. నటి కస్తూరిపై ఫైర్
మిస్త్ ఎర్త్ 2024 విజేతగా జెస్సికా లేన్
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
విషాదంలో సినీ ఇండస్ట్రీ.. ప్రముఖ నటుడు కన్నుమూత
వంద రేప్‌లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
నేడే బిగ్ ఫైల్.. ఇండియ బిగ్ ప్లాన్.. సౌతాఫ్రికాతో రెండో టీ20..
ఎలాన్ ముస్క్ కు ట్రంప్ బిగ్ ఆఫర్..
సర్వే డేటా భద్రమేనా.. ప్రజలకు అనుమానాలు.. ముప్పు ఇదేనా..
వాటిని.. డ్రీమ్ గర్ల్ హేమామాలిని బుగ్గలుగా మారుస్తా..
టీడీపీ- జనసేన మధ్య ముదిరిన వార్
మన మెదడు పెరుగుతోంది.. లాభమా .. నష్టమా..
మబ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారణం
ఇంటింటి సర్వే డేటా భద్రమేనా.. అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తే..
కేదార్నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..
బీజేపీలో ముసలం.. నెక్ట్స్ బాస్ ఎవరంటే..?
మెడికల్ వార్: ఆయుర్వేదం వర్సెస్ అలోపతి
పడిపోతున్న ఇండియా గ్రాఫ్.. కానీ..