TILAK VARMA: యువ క్రికెట‌ర్ నంబూరి ఠాకూర్‌ తిల‌క్ వ‌ర్మ బ్యాక్ టూ బ్యాక్ టీట-20లో సెంచ‌రీ సాధించి సంచ‌ల‌న సృష్టించిన విష‌యం తెలిసింది. ద‌క్షిణాఫ్రికాలో స‌ఫారీల‌పై వ‌రుస‌గా రెండు సెంచ‌రీలు కొట్ట‌డం అంతా ఆషామాషి కాదు. దాని వెన‌క ఆయ‌న క‌ఠోర‌శ్ర‌మ దాగిఉంది. ఈ రికార్డుతో అత‌డి గ్రాఫ్ అమాంతం పెరిగింది. నిల‌క‌డ ఆట‌తో రాణిస్తున్న ఈ హైద‌రాబాదీ కుర్రాడి గురించి నెటిజ‌న్లు తెగ వెతుకున్నారు. అత‌డి జీవిత చ‌రిత్ర‌పై ఆరా తీస్తున్నారు. ఇటీవ‌ల మ‌రో యువ బ్యాట‌ర్ సంజుశాంస‌న్ వ‌రుస‌గా రెండో సెంచ‌రీ సాధించి రికార్డు సృష్టిస్తే.. రెండు రోజుల వ్య‌వ‌ధిలోనే తిల‌క్ వ‌ర్మ ఆ రికార్డును స‌మ‌యం చేయ‌డంతో ఇండియ‌న్ క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ప్ర‌జెంట్ నెట్టింట ట్రెండింగ్‌గా మారాడు. ఉన్న తిల‌క్ వ‌ర్మ గురించి ఆస్త‌క్తిక‌ర అంశాలు మీకోసం..

ఎల‌క్ట్రీషియ‌న్ కుమారుడే ఈ తిల‌క్..

తిల‌క్ వ‌ర్మ(TILAK VARMA) హైదరాబాద్‌లో 2002 నవంబర్ 8న జన్మించారు. తండ్రి నంబూరి నాగరాజు, గాయత్రీదేవి దంపతుల కుమారుడు. తండ్రి ఓ ఎలక్ట్రిషియన్, త‌ల్లి గృహిణి. చిన్న త‌నం నుంచి తిల‌క్‌కు క్రికెట్ పై అమిత ఆస‌క్తి చూపేవాడు. ఆవిష‌యాన్ని చిన్న త‌నంలోనే గుర్తించిన తండ్రి అత‌డిన అన్ని విధాల ప్రోత్స‌హించాడు. తన కోచ్ సలీం బాయ్ మార్గదర్శకత్వంలో తిలక్ ప‌రిపూర్ణ ఆట‌గాడిగా ఎదిగారు. సామాన్య కుటుంబం కావ‌డంతో ఆర్థిక ఇబ్బందులు కూడా ఎక్కువ‌గానే ఉండేవి. అయినా తండ్రి అత‌డిపై ఓ న‌మ్మ‌కం పెంచుకోగా, ఆ న‌మ్మ‌క‌మే ఇప్పుడు ఇండియాకు ఓ ఆణిముత్యాన్ని అందించింది. తిల‌క్ త‌మ్ముడు త‌రుణ్

ఐపీఎల్‌పై న‌జ‌ర్‌.. ఫ్యాన్్స ఖుష్‌..

భారీ షాట్ల‌తో విరుచుకు ప‌డుతున్న తిల‌క్ వ‌ర్మ కు ఫ్యాన్స్ ఫాలోయింగ్ అమాంతం పెరుగుతోంది. ఐపీఎల్ స్పెష‌లిస్టుగా మారుతున్న తిల‌క్‌పై ఆట ను పూర్తి స్థాయిలో చూడాలంటే ఈసారి ఐపీఎల్ వ‌ర‌కు ఆగాలంటూ అత‌డి ఫ్యాన్స్ పేర్కొంటున్నారు. ఈసారి ముంబాయి నుంచి అత‌డు వీర‌విహారం చేయ‌డం ఖాయ‌మంటున్నారు. దాంతో ఇప్పుడు అంద‌రి దృష్టి ఐపీఎల్‌వైపు మ‌ళ్లింది.ఈసారి తిల‌క్ మానియా ఉండ‌బోతుంద‌ని చెబుతున్నారు. అత‌డి రాణింపుతో అటు ముంబాయి ప్రాంచైజీ కూడా ఖుష్ అవుతోంది.

క్రికెట్ కెరీర్ ప్రారంభం

తిలక్ వర్మ 2019లో, అండర్-19 భారత జట్టుకు ఎంపికయ్యాడు. అక్క‌డ రాణించ‌డంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ సెలెక్ట‌ర్ల దృష్టిలో ప‌డ్డాడు. 2018-19 రంజీ సీజన్‌లో హైదరాబాద్ తరపున తన ఆట‌ను ఆరంభించాడు. లిస్ట్-ఏ క్రికెట్‌లో, టీ20 క్రికెట్‌లో రాణిస్తూ రికార్డులు సృష్టిస్తున్నాడు.

ఐపీఎల్‌లో రాణింపు..

రంజీలో రాణించిన తిల‌క్ త‌ర్వాత ఐపీఎల్‌తో త‌న దిశ మారింది. ముంబై ఇండియన్స్ (MI) ఫ్రాంచైజీ 2022 సీజన్ లో ₹1.7 కోట్లకు కొనుగోలు చేసింది. ఆ సీజన్‌లో నిల‌క‌డ‌గా రాణించి, అంద‌రి దృష్టిని ఆక‌ర్షించాడు. మిడిల్ ఆర్డ‌ర్‌లో కీల‌క ఆట‌గాడిగా మారాడు. అతని ఆట శైలి సాఫీ, దూకుడు మిశ్రితమై ఉంటుంది. అతను స్పిన్నర్లను సమర్థంగా ఆడగలడు, అలాగే ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడంలో కూడా నైపుణ్యాన్ని కనబరుస్తాడు. తిలక్ వర్మ లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్‌మన్ మాత్ర‌మే కాదు, ఆఫ్-స్పిన్న‌ర్ కూడా.

 

– క్లిక్‌ చేసి చదవండి–

మిస్త్‌ ఎర్త్‌ 2024 విజేతగా జెస్సికా లేన్‌ 

విస్త‌రిస్తున్న షుగ‌ర్ డాడీ.. ఆ ప‌నికోస‌మేనా..

నేడే బిగ్ ఫైల్‌.. ఇండియ బిగ్ ప్లాన్‌.. సౌతాఫ్రికాతో రెండో టీ20..

రెచ్చిపోయిన సంజు శాంస‌న్‌..

నిట్‌లో ఫుల్ జోష్‌..

ఒలింపిక్ కు ఇండియా స‌న్నాహాలు

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *