MAHDEV SATRY టాలీవుడ్‌ యాక్టర్‌ మంచు విష్ణు కాంపౌండ్‌ నుంచి వస్తోన్న చిత్రం కన్నప్ప. బాలీవుడ్‌ డైరెక్టర్‌ ముఖేశ్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో కలెక్షన్‌ కింగ్‌ మోహన్‌ బాబు కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే సినిమాలోని పలు పాత్రలను పరిచయం చేసిన డైరెక్టర్‌ తాజాగా మోహన్‌ బాబు లుక్‌ షేర్‌ చేశాడు. ఇందులో మహదేవ్‌ శాస్త్రిగా కనిపించనున్నట్టు తెలియజేస్తూ ప్రీ లుక్‌ విడుదల చేశారు. ఫుల్‌ లుక్‌ను నవంబర్‌ 22న లాంచ్‌ చేయనున్నట్టు తెలియజేశారు.

READ MORE: మహేష్‌ బాబు కోసం రాజమౌళి వెతుకులాట

క‌న్న‌ప్ప మూవీలో న‌టప్ర‌పూర్ణ హన్‌ బాబు పాత్రను వైవిధ్యంగా, ప్రాధాన్య మున్న‌పాత్ర‌గా పోస్ట‌ర్ లుక్‌ను బ‌ట్టి చూస్తే అర్థ‌మ‌వుతోంది. క‌న్న‌ప్ప‌లో ప్రభాస్‌, శరత్‌కుమార్‌, శివరాజ్‌కుమార్‌, మోహన్‌ లాల్‌, మధుబాల, నయనతార, ఐశ్వర్య, శోభ‌న కీల‌క పాత్ర పోషిస్తున్న‌ట్టు యూనిట్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఇప్పటికే కన్నప్ప నుంచి లాంచ్‌ చేసిన టీజర్‌, పోస్టర్లు నెట్టింట చక్కర్లు కొడుతూ.. సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి. ఇక కన్నప్ప నుంచి తిన్నడు, ముండడు, చండుడు, మారెమ్మ, పిలక-గిలక పాత్రలకు సంబంధించిన పోస్టర్లు విడుదల చేయగా.. స్టిల్స్‌ ఆన్‌లైన్‌లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ఈ చిత్రంలో బాలీవుడ్‌ యాక్టర్‌ అక్షయ్‌కుమార్‌ శివుడిగా కనిపించబోతున్నాడు.

READ MORE: వంద రేప్‌లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..

MAHDEV SATRY: ఈ చిత్రానికి మణిశర్మ సంగీతం అందిస్తున్న విష‌యం తెలిసిందే. స్టీఫెన్‌ దేవసి మ్యూజిక్‌, బ్యాక్‌ గ్రౌండ్‌ స్కోర్‌ అందిస్తున్నారు. 24 ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ, బ్యానర్లపై సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు. పరుచూరి గోపాలకృష్ణ, బుర్రా సాయిమాధవ్‌, తోట ప్రసాద్ లు ప‌వ‌ర్ ఫుల్ స్క్రీన్‌ప్లే అందిచిన‌ట్టు మంచి విష్ణు పేర్కొన్నాడు. ఇది త‌నకు తొలి పాన్ ఇండియా సినిమా అని, ఎక్క‌డ కాంప్ర‌మైజ్‌కాకుండా భారీ బ‌డ్జెట్‌తో నిర్మిస్తున్న‌ట్టు ప‌లుసంద‌ర్భాల్లో ఆయ‌న ఇప్ప‌టికే పేర్కొన్నాడు. కాగా, మోహ‌న్‌బాబు న‌టిస్తున్న మ‌హ‌దేవ్ శాస్త్రి ఫ్రీ లుక్‌ను ఆయ‌న త‌న ఎక్స్‌లో పోస్టు చేశారు. మోహ‌న్‌బాబు (MAHDEV SATRY) లుక్ అదుర్్స అంటూ నెటిజ‌న్స్ ఫిదా అవుతున్నారు.

READ MORE: విస్త‌రిస్తున్న షుగ‌ర్ డాడీ.. ఆ ప‌నికోస‌మేనా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *