AYUSHMANBHAVA SCEAME: ‘ఆయుష్మాన్ భవ’ పథకాన్నికేంద్ర ప్రభుత్వం కొత్తగా శ్రీకారం చుట్టింది. వయోవృద్ధుల ఆరోగ్య పరిరక్షణ కోసం ఈ పథకాన్ని అట్టహాసంగా ప్రారంభించింది. ఆయుష్మాన్ భారత్ కార్డుల మాదిరిగానే ‘ఆయుష్మాన్ భవ’ కార్డులను అందించనుంది. 70ఏళ్లు పైబడిన వారికి ఈ కార్డులను ఇచ్చేందకు రెడీ అయింది. ఈ స్కీం కింద నిరుపేదలకు వృద్ధులకు ఉచితంగా వైద్య సేవలు పొందవచ్చు. ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశవ్యాప్తంగా ఈ పథకాన్ని ప్రారంభించారు. 70ఏళ్లు పైబడిన వారు రూ.5లక్షల వరకు ఉచిత ఆరోగ్య పథకాన్ని ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన (ఏబీపీఎంజేఏవై) అందుబాటులోకి తీసుకొచ్చారు.
READ MORE: వరమే.. కానీ షరతులు.. పేద విద్యార్థుల ఉన్నత విద్యకు కేంద్రం రుణం..
రూ.5లక్షల వరకు వైద్యం ఫ్రీ
పథకం కింద రూ.5లక్షల వరకు వృద్ధులు ఉచిత వైద్యం పొందవచ్చు. తెలంగాణ ప్రభుత్వం రాజీవ్ ఆరోగ్య శ్రీ ద్వారా ఉచితంగా అందిస్తున్న విషయం తెలిసిందే. రూ.10 లక్షల వరకు ఉచితంగా 1,835 రకాల వ్యాధులకు చికిత్స అందిస్తోంది. ‘ఆయుష్మాన్ భవ’ కింద చికిత్స, వైద్య పరీక్షలు, ఇంటెన్సివ్‌కేర్ తదితర, ఉచిత మందులు, పోషకాహారం అందజేస్తారు. వృద్ధులు వెబ్‌సైట్‌లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది.
హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారూ అర్హులే..
AYUSHMANBHAVA SCEAME: ఆయుష్మాన్ కార్డు ఉన్న వృద్ధులు ఆయుష్మాన్ పోర్టల్‌లో లేదంటే యాప్‌లో మరోసారి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త కార్డు కోసం ఈకేవైసీ పూర్తి ఇవ్వాల్సి ఉంది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ స్కీమ్‌ను ఉన్నవారు, అలాగే, ప్రైవేటు హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కలిగిన సీనియర్ సిటిజన్లు సైతం ఆయుష్మాన్ భవ కింద ప్రయోజనాలు పొందేందుకు అర్హులని కేంద్ర ప్రకటించింది. కేంద్ర ప్రభుత్వ ఆరోగ్య పథకం (సీజీహెచ్‌ఎస్), ఎక్స్ సర్వీస్‌మెన్ కాంట్రిబ్యూటరీ హెల్త్ స్కీం (ఈసీహెచ్ ఎ స్), ఆయుష్మాన్ సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీసు ఫోర్సు (సీఏపీఎఫ్) వంటి ఇతర పబ్లిక్ హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్‌లను ఉపయోగిస్తున్న సీనియర్ సిటిజన్లు ప్రస్తుత పథకం లేదా ఆయుష్మాన్ భారత్ స్కీంలలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
ఇంటి వద్దనే వైద్య పరీక్షలు
ఒక్కసారి ఆయష్మాన్ భవ(AYUSHMANBHAVA SCEAME) కింద నమోదైన వయోవృద్ధులు వైద్య సేవలకు అర్హులు. వైద్యసేవలను వృద్ధుల ఇంటి వద్దకే వైద్య సిబ్బంది చేరుకుని ఆరోగ్య పరీక్షలు చేస్తారు. తర్వాత పరీక్షల వివరాలను ఎప్పటికప్పుడు ఆయుష్మాన్ భవ ఖాతాలో నమోదు చేస్తారు. ఆస్పత్రికి వెళితే వాటిని పరిశీలించి డాక్టర్లు వైద్యం అందిస్తారు. ఏదైనా సందర్భంలో వేరే ఆసుపత్రులకు వెళ్తే రోగుల వద్ద పాత వైద్య రిపోర్టులు లేకపోయినా ఆయుష్మాన్‌భవ హెల్త్ ఖాతా సంఖ్య ఆధారం గా వైద్యులు చికిత్స అందజేస్తారు. ఆధార్ కార్డు, ఆరోగ్య శ్రీ లాగానే ఆరోగ్య గుర్తింపు కార్డు పనిచేయనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ఆరోగ్య వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేసి గుర్తింపు కార్డులను కేటాయించింది.