siria

Syria / Israel : పాలస్తీనాపై యుద్ధం ప్రకటించి కొద్ది రోజులుగా ఆ దేశంపై బాంబులతో విరుచుకుపడుతున్న ఇజ్రాయిల్‌ తాజాగా సిరియాపై ముప్పెట దాడులకు పాల్పడుతోంది. ఇప్పటికే తిరుగుబాటు దారులతో అంతర్యుద్ధం నెలకొన్న సిరియాలో ఇటీవల ఆపధర్మ ప్రభుత్వం కొలువైన వేళ.. అనూహ్యంగా పొరుగుదేశం ఇజ్రాయిల్‌ బాంబులతో విరుచుకుపడడంతో సిరియా అల్లకల్లోలం అవుతోంది. సిరియా కొన్నేళ్ల నుంచి దేశం తీవ్ర నష్టంలో కూరుకుపోగా.. తాజాగా దేశ పునరుద్ధరణ పనిలో పడింది. ఈ క్రమంలో అనూహ్యంగా ఇజ్రాయిల్‌ దాడులతో ఆదేశం ఖంగుతింటోంది. ఇప్పుడు ఏం చేయాలలో తెలియక ఆపధర్మ ప్రభుత్వం తల పట్టుకుంటోంది. సిరియా అధ్యక్షుడు అసద్‌ పలాయనం చిత్తగించగానే ఇదే అదునుగా భావించిన ఇజ్రాయిల్‌ తన సైన్యంతో ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఇజ్రాయిల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) దాడులను ముమ్మరం చేసి, మూడు రోజుల్లోనే సిరియాలోని కామిష్టీ, షిన్షార్‌ వైమానిక స్థావరాలపైనే కాకుండా, అక్బరా ఎయిర్‌పోర్టుపై దాడులు జరిపింది. ఈ దాడిలో సిరియాలోని బెయిర్‌ బేస్‌లోని యుద్ధ విమానాలు, ఆయుధాగారాలు, రాడార్‌ సెంటర్లు, క్షిపణి కేంద్రాలను ధ్వంసం చేసింది. ఈ దాడిలో సిరియా తీవ్రంగా నష్టపోయింది. ఇంతకు ఇజ్రాయిల్‌, సిరియాకు ఉన్న విభేదాలు ఏమిటీ.. సిరియాపై ఇప్పుడు ఎందుకు దాడులకు పాల్పడుతోంది.. తెలుసుకుందాం..

READ MORE: చ‌లో శుక్రయాన్ !

లాన్ హైట్స్ వివాదం:

Syria / Israel : గోలాన్ హైట్స్ ఒక భూభాగం. 1967లో జరిగిన యుద్ధంలో ఇజ్రాయిల్ సిరియా నుంచి ఆక్రమించుకుంది.
1981లో ఇజ్రాయిల్ తన భూభాగంగా చేర్చుకున్నప్పటికీ, అంతర్జాతీయ సమాజం దీనిని ఒప్పుకోలేదు. యునైటెడ్ నేషన్స్ దీన్ని సిరియా భూభాగంనే ఇంకా భావిస్తోంది. గోలాన్ హైట్స్ వ్యూహాత్మకంగా ముఖ్యమైనది, ఎందుకంటే అక్కడి నుంచి సిరియా, ఇజ్రాయిల్ మధ్య సులభంగా రక్షణా చర్యలు చేపట్టవచ్చు. నీటి వనరులూ వివాదానికి కార‌ణ‌మ‌వుతున్నాయి.

SILKSMITHA: మ‌ళ్లీ రాబోతున్న సిల్క్‌స్మిత

సైనిక ఉద్రిక్తతలు:

Syria / Israel : ఇరాన్ మద్దతు పొందిన హిజ్బుల్లా మిలిటెంట్ గ్రూప్‌లు ఇక్క‌డ పెద్ద సంఖ్య‌లో ఉన్నాయి. ఈ కార‌ణంగానే ఇజ్రాయిల్ తరచుగా సిరియా పై వైమానిక దాడులకు పాల్పడుతోంది. ఇజ్రాయిల్ ఈ దాడులను ఆత్మరక్షణ చర్యగా సమర్థించుకుంటోంది.

ఆరబు-ఇజ్రాయిల్ విరోధం:

ఇజ్రాయిల్‌ను 1948లో రాష్ట్రంగా ఆరబు దేశాలు గుర్తించలేదు. సిరియా కూడా గుర్తించ‌క‌పోవ‌డంతో స‌మ‌స్య మ‌రింత ముదిరింది.

ప్రస్తుత పరిస్థితి:

Syria / Israel : 2011లో సిరియాలో గృహయుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి ఈ వివాదం మరింత సంక్లిష్టమైంది. సిరియా ప్రభుత్వం, రెబల్స్, ఇతర విదేశీ శక్తుల మధ్య అంతర్గత పోరాటం కొనసాగుతోంది. సిరియాలో అంత‌ర్గ‌త క‌ల‌హాల‌ను ఇజ్రాయిల్ త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకుంటోంది. 1990లో గోలాన్ హైట్స్ తిరిగి అప్పగించడానికి ఇజ్రాయిల్ ఆసక్తి చూపలేదు. ఈ వివాదానికి పరిష్కారం కనిపించడం చాలా క్లిష్టంగా ఉంది, ఇప్ప‌టికీ ఆందోళనలు, రాజకీయ విభేదాలు, ప్రాంతీయ పోరాటాలు కొనసాగుతున్నాయి.

 

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *