ALLU ARJUN: పుష్ప అంటే వైల్డ్‌ ఫైర్‌ అంటూ తనదైన డైలాగ్‌తో పుష్పా–2లో సందడి చేసిన అల్లు అర్జున్‌ ప్రపంచ వ్యాప్తంగా వసూళ్ల సునామితో గత రికార్డులన్నింటినీ బ్రేక్‌ చేస్తున్నాడు. పుష్పా–2 బెనిషిట్‌ షో నేపథ్యంలో సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో ఓ మహిళ చనిపోవడం, ఆమె కుమారుడు మృత్యువుతో పోరాడుతున్న విషయం తెలిసిందే. ఇదిలాఉంటే శనివారం అసెంబ్లీలో ఈ ఘటనపై సినీ ఇండస్ట్రీపై ఫైర్‌ అయిన సీఎం రేవంత్‌ రెడ్డి.. అదే రోజు సాయంత్రం అల్లు అర్జున్‌ ప్రెస్‌మీట్‌ పెట్టి ప్రభుత్వం తనను అనవసరంగా టార్గెట్‌ చేసిందంటూ, తన తప్పులేకున్నా బాధ్యున్ని చేస్తోందని ఒకింత అసహనానికి గురయ్యారు. ఆయన ప్రభుత్వంతో నేరుగా ఢీకొనేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. ఈక్రమంలోనే అల్లు అర్జున్‌ పోలిటికల్‌ ఎంట్రీ ఇస్తారనే అంశం ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చెక్కర్లు కొడుతోంది.

తాజా పరిణామాలతో విసుగు చెందిన ఆయన రాజకీయాల్లోకి రావడం ఖాయమనే ప్రచారం సాగుతోంది. కొద్ది రోజులుగా జరుగుతున్న ఘటనలు ఇందుకు ఆద్యం పోస్తున్నాయనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆయన అభిమానులు సైతం అల్లు అర్జున్‌ పొలిటికల్‌ ఎంట్రీని స్వాగతిస్తారనే చర్చ సాగుతోంది. కానీ, ఇప్పటి వరకు అల్లు అర్జున్‌ మాత్రం ఎక్కడా రాజకీయ ఎంట్రీపై ఎలాంటి క్లూ ఇవ్వలేదు.

read more: సినిమా వాళ్లకు సీఎం వార్నింగ్‌..

గత ఎన్నికల నుంచి పుష్పరాజ్‌లో మార్పు..

ALLU ARJUN: కొద్ది రోజుల నుంచి మెగా ఫ్యామిలీ, అల్లు అర్జున్‌ ఫ్యామిలీకి మధ్య దూరం పెరుగుతూ వస్తోంది. పలు సంఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. పుష్పా–2లో మెగా ఫ్యామిలీని టార్గెట్‌ చేస్తూ డైలాగ్‌లు ఉండడంతో వారి మధ్య వైరం చెప్పకనే చెప్పినట్టయింది. ఇదిలాఉంటే గత ఎన్నికల సమయంలో మెగా ఫ్యామిలీ జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ వెంట నడిస్తే.. అల్లు అర్జున్‌ మాత్రం అందుకు విరుద్ధంగా వైఎస్‌ఆర్‌ సీపీకి మద్దతు తెలపడం పెనుదుమారం రేపిన విషయం తెలిసిందే. తాజాగా అల్లు అర్జున్‌ జైలుకు వెళ్లి రావడంతో సినీ ఇండస్ట్రీ మొత్తం అల్లు పరామర్శించింది. కానీ పవన్‌ కల్యాణ్‌ మాత్రం పరామర్శించకపోవడం కొత్త చర్చకు దారి తీసింది.

వరుస పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్‌ నిజంగానే రాజకీయాల వైపు మొగ్గుతారా అన్న చర్చ కూడా సాగుతోంది. ఫ్యాన్స్‌ కూడా సైతం అంటున్నారుగా… ఇటీవల కాలంలో మెగా ఫ్యాన్స్‌ తాము డిప్యూటీ సీఎం తాలూకూ అంటూ అల్లు అర్జున్‌ ఫ్యాన్‌ను ట్రోల్‌ చేశారు. సోషల్‌ మీడియా వేదికగా బహిరంగంగానే అల్లు అర్జున్‌, అతడి ఫ్యాన్స్‌ను టార్గెట్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల కొందరు అభిమానులు నెక్స్ట్‌ సీఎం అల్లు అంటూ సోషల్‌ మీడియా, సినీ రివ్యూ టాక్‌ సమయంలో చెప్పడం విదితమే. అభిమానులంటే తనకు ప్రాణమని, వారికోసం ఏమైనా చేస్తామని ఎప్పుడూ చెప్పే అల్లు అర్జున్‌ వారి కోసం నిజంగా రాజకీయాల్లో వచ్చినా ఆశ్చర్యం లేదని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. పుష్పా సినిమాలతో దేశ వ్యాప్తంగా ఆయనకు అభిమానుల సంఖ్య భారీగానే పెరిగింది. సొంత పార్టీ పెట్టినా, ఏదైనా జాతీయ పార్టీలో చేరినా అతడికి పెద్దపీట వేస్తారనే ప్రచారమవుతోంది.

read more: సంధ్య థియేటర్‌కు పోలీసుల షాక్‌

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *