THAMMAREDDY BHARADWAJ: తెలుగు ఇండస్ట్రీపై సీనియర్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రతీసారి ఎందుకు ముఖ్యమంత్రుల ముందు సాగిలపడాల్సి వస్తుందని సూటిగా ప్రశ్నించారు. ఒకరికోసం ఇండస్ట్రీ మొత్తం తలవంచుకునే పరిస్థితి ఎందుకు దాపురిస్తోందని పేర్కొంటున్నారు. పుష్పా–2 తొక్కిసలాట ఘటన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఇక నుంచి బెనిఫిట్ షోలు, ధరల పెంపు ఉండదని తేల్చి చెప్పిన నేపథ్యంలో తాజాగా తెలుగు ఇండస్ర్టీ పెద్దలు ముఖ్యమంత్రిని కలిసి సమస్యను సర్ధిమనిగేలా చూడాలని కోరారు. ఈ విషయంపై తమ్మారెడ్డి భరద్వాజ స్పందించారు. ఈ మేరకు ఆయన నా ఆలోచన పేరుతో ఓ వీడియో బైట్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఆయన పలు అంశాలను లేవనెత్తారు. ముఖ్యమంత్రి అల్లు అర్జున్‌ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు.
READ MORE: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ?
THAMMAREDDY BHARADWAJ: ఆయనకు సరైన సలహాలు ఇచ్చేవారు లేకపోవడంతో తొక్కిసలాట జరిగేందుకు కారణమైందని పేర్కొన్నారు. ఇది ఒక్క అల్లు అర్జున్ తప్పు మాత్రమేనా ఆయన కోటరి బాధ్యత లేదా అంటూ ప్రశ్నించారు. ఆయన చుట్టూ ఉన్నవారు తప్పుడు సలహాలతోనే ఈ దుర్ఘటన చోటుచేసుకుందని స్పష్టం చేశారు. కొందరు హీరోలు నిజంగానే దేవుడిలా ఫీలవుతున్నారని వెల్లడించారు. నిజంగా సినిమా చూడాలి అనుకునేవారు సమస్యను దృష్టిలో పెట్టుకుని సింగిల్‌గా వచ్చి వెళ్లిపోవాని గానీ, అభిమానులకు ముందస్తు సమాచారమిచ్చి హల్‌చల్ చేయడం ఏంటని ఆరోపించారు. ఇన్ని తెలిసి, ఇంత స్థాయికి వచ్చిన హీరోలకు ఇవేవీ తెలియవా అంటూ అసహనం వ్యక్తం చేశారు. నటనతో గర్వకారణం కావాలి గానీ, రేట్లు పెంచేసి కలెక్షన్లతో కాకూడని హితవు పలికారు. మీ కోసం సినిమాలు తీసి, దేశం కోసం అన్నట్టుగా పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. సినిమాల్లో పోలీసులను మరీ అధ్వానంగా చూపించడం ఏంటని అసహనం వ్యక్తం చేశారు.
read more: సినిమా వాళ్లకు సీఎం వార్నింగ్..
THAMMAREDDY BHARADWAJ: డబ్బుల కోసం సినిమా తీసి జానాన్ని ఉద్దరించడానికి చేశామనే బిల్డప్ ఇవ్వడం సరైంద కాదన్నారు. ఒక్క మనిషి కోసం ఇండస్ర్టీ మొత్తం సీఎం ముందు తలవంచడం దురదృష్టకరమన్నారు. ఎవరి ఈగోలు వారికి అయ్యాయన్నారు. ఒకరి ఈగో కోసం ఇంతమంది పెద్దలు వెల్లడం ఇండస్ర్టీకి మంచిది కాదన్నారు. అలాగే, హీరోలు బౌన్సర్లను ఏర్పాటు చేసుకోవడంపై కూడా తీవ్రంగా మండిపడ్డారు. బాడీ ఉన్నవాళ్లంతా బౌనర్లు కాదని, అభిమానుల్ని ప్రైవేటు బౌన్సర్లు కంట్రోల్ చేయడం ఏంటని, దీనిపై ప్రభుత్వం కూడా కఠినంగా వ్యవహరించాలంటూ సూచించారు. ప్రస్తుతం భరద్వాజ వ్యాఖ్యలు టాలీవుడ్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. మరి ఎవరు ఎలా రియాక్ట్ అవుతారో వేచి చూడాలి. కానీ పుష్పా–2 మంటలు టాలీవుడ్‌లో ఇప్పుడప్పుడే చల్లారేలా కనిపించడం లేదు.