Cabinet expansion: తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన సందర్భంగా మంత్రి వర్గ విస్తరణ ఆశవహుల్లో ఆందోళన నెలకొంది. రేపుమాపు అంటూ ఏడాదికాలంగా వినిపిస్తున్నా.. ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటనా లేకపోవడంపై సీఎం రేవంత్‌పై వారు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంక్రాంతి లోపు మంత్రివర్గ విస్తరణ ఉంటుందని భావించినా ఇప్పట్లో జరిగేలా కనిపించడం లేదు. ఢిల్లీకి ఎన్ని చక్కర్లు కొట్టినా సిఎం రేవంత్‌కు అధిష్టానం మోక్షం కలగడం లేదు. ఆయన అభ్యర్థనలను అధినేతలు కూడా పట్టించుకోవడం లేదు. ఇదిలా ఉంటే మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నవారి జాబితా భారీగానే ఉంది. ఎమ్మెల్యేలు చాలామందే ఆశగా ఎదురు చూస్తున్నారు. రేసులో నేనున్నానంటూ రోజుకో పేరుకు తెరపైకి వస్తుండడం సీఎంకు తలనొప్పిగా మారింది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత తొలిసారి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నేతలు తీవ్రంగా ఎవరికి వారు ప్రయత్నాలు చేస్తున్నారు. ఏడాదిగా ఇదే విషయమై ఢిల్లీలోని తమ గాఢ్‌ఫాదర్ల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తొలి జాబితాలోనే పేరున్న వారిలో టెన్షన్ నెలకొంది.
Cabinet expansion: 2024 సంక్రాంతి నుంచి మొదలైన ఈ పోటీ 2025 సంక్రాంతి వస్తున్నా కార్యరూపం దాల్చలేదు. 2023, డిసెంబరు 7న పది మంది మంత్రులతో కలిసి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. అప్పటి నుంచి మంత్రి వర్గ విస్తరణ అప్పడు..ఇప్పుడు అంటూ లీకులు తప్ప ఒరిగింది లేమీ లేదు. మంత్రివర్గంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి ఎవరికీ అమాత్యయోగం కలుగలేదు. నలుగురు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు స్థానం లభించలేదు. విస్తరణ జరిగితే తమకు అవకాశం దక్కుతుందని ఆశపడుతున్నారు. సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పి.సుదర్శన్ రెడ్డికే మంత్రి యోగం తథ్యమన్న సంకేతాలు పార్టీలో ఉన్నాయి. అలాగే పీసీసీ చీఫ్‌గా పార్టీ పదవిని దక్కించుకున్న మహేశ్‌కుమార్ గౌడ్ సైతం బీసీ కోటాలో మంత్రి పదవి అడిగినట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. మైనార్టీ కోటాలో షబ్బీర్ అలీ మంత్రి పదవిపై ఆశగా ఉన్నారు.
స్థానిక ఎన్నికల తర్వాతేనా?
Cabinet expansion: త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి వర్గ విస్తరణ హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పుడు విస్తరిస్తే మంత్రి యోగం దక్కని వారి నుంచి అసంతృప్తి వ్యక్తమయ్యే ప్రమాదముందని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తోంది. లోకల్ వార్ తర్వాతే విస్తరిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచన చేస్తుందన్న ప్రచారం సాగుతోంది. అలాగే ప్రస్తుత మంత్రి వర్గం నుంచి ఒకరిద్దరిని మంత్రి పదవి నుంచి ఉద్వాసన పలికే అవకాశం ఉందని ఓ వర్గంలో చర్చ సాగుతోంది. మరి అధిష్ఠానం ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచిచూడాలి.
READ MORE: బన్నీదే తప్పు.. అల్లుపై పీకే ఫైర్..
READ MORE: అల్లు అర్జున్ పొలిటికల్ ఎంట్రీ?
READ MORE: ఇండస్ట్రీకి తలవంపులు.. తమ్మారెడ్డి తీవ్ర వ్యాఖ్యలు
[…] READ MORE: మంత్రి వర్గ విస్తరణ లేనట్టేనా? […]