KUMBHAMELA

MAHAKUMBHAMELA: మహా కుంభమేళకు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌ ముస్తాబవుతోంది. 12ఏళ్ల కోసారి జరిగే మేళాకు లక్షల్లో తరలివచ్చే అశేష భక్తజనానికి వసతుల కల్పించేందుకు అక్కడి సర్కారు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తోంది. సుమారు 400 మిలియ‌న్స్ అంటే 40కోట్ల  మంది ఈ మహా కుంభ మేళాకు తరలివస్తారని అంచనా వేస్తున్నారు. నాలుగు వేల హెక్టార్ల‌లో భక్తుల కోసం స్థాయిలో మౌలిక వసతులు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే 1.60 లక్షల తాత్కాలిక టెంట్లను ఏర్పాటు చేయగా, 1.50లక్షల మరుగుదొడ్లను అందుబాటులోకి తెచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనంగా ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. రోజుకు 50వేల మందికి భోజ‌నం అందించేలా కిచెన్‌ల‌ను ఏర్పాటు చేశారు.

ఈ పనులన్నీ జనవరి10 (2025) పూర్తి చేయడమే లక్ష్యంగా యుద్ధ ప్రాతిపదిక ముందుకు సాగుతున్నారు. కాగా, జనవరి 13 నుంచి ఈ మహాకుంభ మేళ ఆరంభమై ఫిబ్రవరి 26 (మహా శివరాత్రి)వరకు అట్టహాసంగా సాగనుంది. ఒక మతపరమైన వేడుకల్లో ప్రపంచంలోనే అతిపెద్దది ఈ మహా కుంభమేళం. ప్రయాగ్‌ను తీర్థరాజ్ అని పిలుస్తారు. ఇది గంగా, యమునా, సరస్వతి నదుల సంగమం. ఈ సంగమం ఎంతో ప‌విత్ర‌మైన‌దిగా హిందువులు భావిస్తారు. గంగా సంగ‌మంలో పుణ్య‌స్నానం చేస్తే పాప విమోచనం పొందుతారని నమ్మకం. వివిధ అఖాడాలు (సాధువుల సమూహాలు) మహా కుంభమేళలో పెద్ద సంఖ్య‌లో పాల్గొంటారు.

సాంకేతిక ఏర్పాట్లు..

MAHAKUMBHAMELA: అండర్‌వాటర్ డ్రోన్లు ఉప‌యోగిస్తున్నారు. ఇవి నీటిలో ప్రమాదాలను గుర్తించి, భద్రతా చర్యలను వేగంగా చేపట్టడానికి సహాయపడతాయి. ప్రయాగ్‌రాజ్‌లోని విమానాశ్రయం నుంచి 23 నగరాలకు ప్రతిరోజూ 60కి పైగా విమానాలు అందుబాటులో ఉంచ‌నున్నారు. మహా కుంభమేళా సందర్భంగా భారతీయ సాంస్కృతిక ఐక్యతను ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించబడతాయి. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మహోత్సవాన్ని ప్రపంచ సాంస్కృతిక ఐక్యతకు చిహ్నంగా మార్చడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది.

పురాణ గాథలు:

MAHAKUMBHAMELA:  కుంభమేళ చరిత్రను సముద్ర మథన స‌మ‌యంలో దేవతలు, రాక్షసులు అమృతం కోసం సముద్రాన్ని మథించారు. అమృతం కలిగిన కుంభం (పాత్ర) లభించగానే, అమృతాన్ని స్వాధీనం చేసుకోవడానికి మధ్యలో నాలుగు ప్రదేశాల్లో కొంత అమృతం పడింది. అవే ప్రయాగ్ (ప్రయాగ్‌రాజ్), హరిద్వార్, ఉజ్జయినీ, నాశిక్. అందుకే హిందువులు వాటిని అత్యంత పుణ్య‌క్షేత్రాలుగా భావిస్తారు.

చారిత్రక రుజువులు:

కుంభమేళ ప్రాముఖ్యతను ప్రాచీన గ్రీకు, చైనా ప్రయాణికుల రచనల్లో కూడా గుర్తించారు. గుప్త రాజుల కాలం (4వ శతాబ్దం CE) నుంచి నిర్వహించబడుతోందని నమ్ముతారు. 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యుడు కుంభమేళను మరింత ప్రసిద్ధం చేశారు.

యునెస్కో ప్రపంచ వారసత్వం:

2017లో కుంభమేళను యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చింది. కోట్లాది భక్తుల, పర్యాటకుల ఆకర్షణకు కేంద్రంగా ఉంది.

READ MORE:  పిల్ల‌ల‌కు పాఠాలు బోధించేది ఎవ‌రు?

READ MORE:  మంత్రి వ‌ర్గ విస్త‌ర‌ణ లేన‌ట్టేనా?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *