PRINCE-JAKKANA MOVIE : ప్రపంచం మెచ్చిన దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి, ప్రిన్స్ మహేశ్‌బాబు సినిమా అప్డేట్ వచ్చేసింది. చాలా రోజుల నుంచి కొత్త మూవీ ముచ్చట్ల కోసం ఎదురుచూస్తున్న మహేష్ ఫ్యాన్స్‌కు తాజా అప్డేట్ ఫిదా చేస్తోంది. ఎస్ఎస్ఎంబీ–29 పేరుతో తెరకెక్కుతున్న సినిమా అధికారిక షూటింగ్ తాజాగా పూజా కార్యక్రమం హైదరాబాద్‌లో అట్టహాసంగా ఆరంభమైనట్టు తెలుస్తోంది. ప్రారంభోత్సవం కేవలం యూనిట్ సమక్షంలో చాలా గోప్యంగా జరిగినట్టు టాలీవుడ్లో ప్రచారం సాగుతోంది. నగర శివారులోని ఓ అల్యూమినియం కంపెనీలో షూటింగ్ వేడుక ఆరంభమైనట్టు వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మూవీ మేకర్స్ అధికారికంగా ఈ విషయం వెల్లడించకపోయినా ఆవిషయాలు మాత్రం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. జూన్‌లో ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్టు తెలుస్తోంది.
1200కోట్లు.. రెండు పార్టులు?
PRINCE-JAKKANA MOVIE: మహేష్ ఈ మూవీ రెండు పార్టులుగా సుమారు 12వందల కోట్లతో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా, సినిమాని శ్రీదెర్గా ఆర్ట్స్ బ్యానర్‌పై కె.ఎల్.నారాయణ నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మహేష్‌ను కొత్త లుక్‌లో చూపించనున్నట్టు తెలుస్తోంది. ఇటీవల ప్రిన్స్ లుక్స్ అదుర్స్ అనిపించడంలో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. రెండేళ్లపాటు మూసీ షూటింగ్ జరగనున్నట్టు అంచనా వేస్తున్నారు. ఈ సినిమాలో బాలీవుడ్, హాలీవుడ్ నటులు నటించనున్నారు. అమెజాన్ అడవుల బ్యాక్‌గ్రౌండ్‌లో అడ్వెంచర్ నేపథ్యంలో నిధి వేట నేపథ్యంలో సినిమా తెరకెక్కనున్నట్టు ప్రచారం సాగుతోంది. గతంలో టక్కరిదొంగ సినిమాలో మహేష్ నిధి వేట నేపథ్యంలో కౌబాయ్ సినిమా వచ్చిన విషయం తెలిసింది. ఇదిలాఉంటే భారతీయ చలన చిత్ర చరిత్రలో సరికొత్త ప్రపంచాన్ని దర్శకుడు రాజమౌళి వెండి తెరపై ఆవిష్కరించనున్నట్టు గతంలో ఓ ఇంటర్వ్యూలో రచయిత విజయేంద్రప్రసాద్ పేర్కొన్న విషయం గుర్తు చేసుకుంటూ అభిమానులు ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ టాప్ టెక్నీషియన్స్ పనిచేస్తున్నట్టు సమాచారం. కొద్దిరోజులుగా రాజమౌళి లొకేషన్ కోసం ఒడిశా, ఆఫ్రికా అడవుల్లో పర్యటించారు. అధికారికంగా చిత్ర యూనిట్ మూవీ ముచ్చట్ల కోసం మహేష్, జక్కన్న ఫ్యాన్స్ ఆశగా ఎదురుచూస్తున్నారు. పరిస్థితి చూస్తుంటే త్వరలోనే ఆ గుడ్ న్యూస్ వచ్చే అవకాశం లేక పోలేదు.
సెంటిమెంట్‌ను వీడిన ప్రిన్స్..
PRINCE-JAKKANA MOVIE: రాజమౌళి తాజా చిత్ర కోసం ప్రిన్స్ మహేష్‌బాబు తన సెంటిమెంట్‌ను కూడా పక్కనబెట్టినట్టు తెలుస్తోంది. సహజంగానే తన సినిమా పూజా కార్యక్రమాలకు ఆయన హాజరుకారు. అయితే జక్కన్న సినిమా కావడంతో ఆ నమ్మకాన్ని వీడి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నట్టు తెలిసింది. చిత్ర షూటింగ్ మొదలవగానే ప్రతీ మూడు నెలలకోసారి మూవీ అప్డేట్స్ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది.
-
ఇవి కూడా చదవండి