dilhi

DILHI BJP LIST: ఢిల్లీలో ఎన్నికల వేడి రాజుకుంది. త్వరలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల కోసం అటు ఆప్‌(ఆమ్‌ ఆద్మీ పార్టీ) ఇటు బీజేపీ (భారతీయ జనతా పార్టీ) ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. ఇప్పటికే ఢిల్లీలో ఎన్నికల సందడి హీటెక్కింది. పోరులో భాగంగా బీజేపీ మరో అడుగు ముందుకు వేసి తొలి జాబితాను ప్రకటించింది. 29మంది అభ్యర్థులను ప్రకటించి ఎన్నికల సమర శంఖం పూరించింది. న్యూఢిల్లీలో మాజీ సీఎం, ఆప్‌ అధినేత అరవింద్‌ కేజ్రీవాల్‌తో బీజేపీ అభ్యర్థి పర్వేశ్‌వర్మ తలపడనున్నారు. మరో ముఖ్యమైన స్థానం కాల్‌కాజీ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రస్తుత ముఖ్యమత్రి ఆతిశీనితో రమేశ్‌బిధూరి ఢీకొననున్నారు. అనూహ్యంగా ఇటీవల బీజేపీలో చేరిన ఆప్‌ పార్టీ అభ్యర్థి కైలాష్‌ గెహ్లాట్‌కు బిజ్వాసన్‌ నుంచి బరిలో ఉన్నారు. ఆయనకు పోటీగా ఆప్‌ నుంచి సురేందర్‌ భరద్వాజ్‌ ఉన్నారు. కాగా, ఇప్పటికే ఆప్‌ అన్ని నియోజకవర్గాలకు తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే.

బీజేపీ-ఆప్‌కు ప్ర‌తిష్ఠాత్మ‌కం..

DILHI BJP LIST: ఢిల్లీ ఎన్నిక‌లు అటు ఆప్ కు ఇటు బీజేపీకి ప్ర‌తిష్ఠాత్మ‌కంగా మారాయి. రాష్ట్రంలో 70 అసెంబ్లీ స్థానాలు ఉండ‌గా 62 చోట్ల ఆప్, కేవ‌లం 8చోట్ల బీజేపీ గెలుపొందాయి. ఎప్ప‌టి నుంచో ఢిల్లీ పీఠంపై క‌న్నేసిన బీజేపీకి ఆ అవ‌కాశం ద‌క్క‌లేదు. లిక్క‌ర్ స్కాంలో ఇరుక్కొని జైలుపాలై, సీఎం పీటం నుంచి త‌ప్పుకుని ఆప్ అధినేత అర‌వింద్ కేజ్రీవాల్‌కూ ఈ ఎన్నిక‌లు ప్రెస్టేజ్‌గా మారింది. కేజ్రీవాల్‌పై లిక్క‌ర్ కేసును ఎన్నిక‌ల అస్త్రంగా బీజేపీ వాడుకోనుంది.

  •  బీజేపీ తొలి జాబితా

  1. ఆదర్శ్ నగర్ : రాజ్ కుమార్ భాటియా
  2. బద్లీ: దీపక్ చౌదరి
  3. రితాలా: కుల్వంత్ రాణా –
  4. నంగ్లోయ్ జాట్: మనోజ్ షోకీన్
  5. మంగోల్‌పురి (SC): రాజ్‌కుమార్ చౌహాన్
  6. రోహిణి: విజేందర్ గుప్తా
  7. షాలిమార్ బాగ్: రేఖా గుప్తా –
  8. మోడల్ టౌన్: అశోక్ గోయెల్క
  9. క‌రోల్ బాగ్ (SC): దుష్యంత్ కుమార్ గౌతమ్
  10. పటేల్ నగర్ (SC): రాజ్ కుమార్ ఆనంద్రా
  11. జౌరి గార్డెన్: సర్దార్ మంజిందర్ సింగ్ సిస్రా
  12. జనక్‌పురి: ఆశిష్ సూద్బి
  13. బిజ్వాసన్‌: కైలాష్ గెహ్లాట్‌
  14. న్యూఢిల్లీ: పర్వేష్ సాహిబ్ సింగ్ వర్మ
  15. జంగ్‌పురా: సర్దార్ తర్విందర్ సింగ్ మార్వా
  16. మెహ్రాలి : గ‌జేంద‌ర్ యాద‌వ్‌
  17. మాల్వియా నగర్: సతీష్ ఉపాధ్యాయ్
  18. అర్కే పురం: అనిల్ శర్మమెహ్రౌలీ: గజైందర్ యాదవ్
  19. ఛతర్పూర్: కర్తార్ సింగ్ తన్వర్
  20. అంబేద్కర్ నగర్ (SC): ఖుషీరామ్ చునార్
  21. కల్కాజీ: రమేష్ బిధూరి
  22. బదర్‌పూర్: నారాయణ్ దత్ శర్మ
  23. పట్పర్‌గంజ్: రవీందర్ సింగ్ నేగి
  24. విశ్వాస్ నగర్: ఓం ప్రకాష్ శర్మ
  25. కృష్ణా నగర్: డాక్టర్ అనిల్ గోయల్గాం
  26. ధీ నగర్: సర్దార్ అరవిందర్ సింగ్ లవ్లీ –
  27. సీమాపురి (SC): కుమారి రింకు
  28. రోహ్తాస్ నగర్: జితేంద్ర మహాజన్ –
  29. అజయ్ మహావార్ – ఘోండా

READ MORE : భారత్‌కు సొంత స్పేస్‌ స్టేషన్‌

READ MORE : ఇండియాలో అందుబాటులోకి హైస్పీడ్ రైళ్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *