AI T-SHIRT HEART STORKE RELIF

AI T-Shirt : వయసుతో సంబంధం లేకుండా చాలా మంది గుండెజబ్బు బారిన పడుతున్నారు. మరియు ఉన్నఫలంగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీనికి చెక్‌ పెట్టేందుకు ప్రపంచ వ్యాప్తంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఇప్పుడిప్పుడే సత్ఫలితాలు వస్తున్నాయి. ఇటీవల బ్రిటిష్‌ శాస్త్రవేత్తలు దీనికి ప్రత్యామ్నాయ మార్గాన్ని కనుగొన్నారు. అంతేకాదు ప్రాణాలను కాపాడేందుకు ఏఐ(ఆర్టిఫిషియల్‌ ఇంటలీజెన్స్‌)తో టీ–షర్టును రూపొందించారు. ఇది సక్సెస్‌ అవ్వడంతో   బాధితుల్లో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి.

ప్రమాదాన్ని ముందే హెచ్చరించే టీ–షర్టు

AI T-Shirt : పుట్టుకతో మరియు జన్యుపరంగా గుండె జబ్బువారి ఈ ఏఐ టీ–షర్టు ఎంతోఉపయోగంగా ఉంటుంది. బ్రిటెన్‌లోని నేషనల్‌ హార్ట్‌ అండ్‌ లంగ్‌ ఇన్‌స్టిట్యూట్‌, బ్రిటిష్‌ హార్ట్‌ ఫౌండేషన్‌ సాయంతో ఈ వినూత్న ఆవిష్కరణ చేశారు. దీనిని సాధారణ టీ షర్టులాగే ధరించవచ్చు. పరుగెత్తడమేకాక పడుకోవడం మరియు రోజువారి పనులు యథావిధిగా చేసుకోవచ్చు. ఈ టీ షర్టులోని ఎలక్ర్టానిక్‌ పరికరాలు సదరు వ్యక్తి తాలూకు గుండె పనితీరును ప్రతీ క్షణం పర్యవేక్షిస్తుంది. ఒకవేళ గుండె వేగం పెరిగినా, తగ్గినా, లయ బద్ధంగా లేకపోయిన వెంటనే అప్రమత్తం చేస్తుంది. సమస్యను ముందుగానే పసిగట్టి ఏఐ వెంటనే సదరు ఆప్‌కు హెచ్చరికలు జారీ చేస్తుంది. దాంతో సమయానికి ఆస్పత్రికి చేరుకుని ప్రాణాలు కాపాడుకోవచ్చు.

బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ …

AI T-Shirt : బ్రిటీష్ హార్ట్ ఫౌండేషన్ మంజూరు చేసిన టీష‌ర్టు, ఆకస్మిక మరణానికి గురయ్యే ప్రమాదం ఉన్న రోగులకు ఈ సాంకేతికత ముందుగానే చికిత్సను అందించగలదని పరిశోధకులు భావిస్తున్నారు. నేషనల్ హార్ట్ అండ్ లంగ్ ఇన్‌స్టిట్యూట్‌లో ప్రొఫెసర్ జాచరీ విన్నెట్ నేతృత్వంలోని దీన్ని త‌యారు చేశారు. ఈ టీ-షర్టు మార్పును తీసుకురాగలదని విన్నెట్ పేర్కొంటున్నారు. వెయ్యి మందికి పైగా వ్యక్తుల నుంచి ఎలక్ట్రో కార్డియోగ్రామ్ (ECG) డేటాను ఉపయోగించి పరిశోధకులు AIకి శిక్షణ ఇస్తారు. ఇది ఎలక్ట్రికల్ సిగ్నల్‌లను కొలవడానికి ఫాబ్రిక్ లోపల వైర్లను కలిగి ఉంటుంది. దాదాపు ఐదేళ్లలో వైద్యులకు ఈ సాంకేతికత అందుబాటులోకి వస్తుందని పరిశోధకులు భావిస్తున్నారు. టీ-షర్ట్ మొదట్లో అభివృద్ధి చేయబడింది. పెద్దవారిపై కూడా ట్రయల్ చేస్తున్నారు. భవిష్యత్తులో పిల్లలకు గుండె పర్యవేక్షణను మరింత సౌకర్యవంతంగా చేయడానికి ఇది కొత్త మార్గాన్ని అందిస్తుంది.

భారతదేశంలో…

AI T-Shirt :  భారతదేశంలో హృదయ సంబంధ వ్యాధులు (CVD) మరియు స్ట్రోక్ మరణాల ఏటేటా పెరుగుతున్నాయి. 2022లో భారతదేశంలో 32,457 మంది గుండెపోటుతో మ‌ర‌ణించిన‌ట్టు అధికారిక లెక్క‌లు చెబుతున్నాయి. కానీ, అన‌ధికారికంగా ఆ సంఖ్య మ‌రింత ఎక్కువ‌నే తెలుస్తోంది. ఇది అంతకుముందు సంవత్సరంతో పోలిస్తే 12.5% ​​పెరుగుదల. 2015లో, భారతదేశంలో 0.4 మిలియన్ల మంది 30-69 సంవత్సరాల మధ్య వయస్సు గల వారు స్ట్రోక్‌తో మృత్యువాత ప‌డుతున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లో, స్ట్రోక్ రేట్లు జాతీయ సగటు కంటే మూడు రెట్లు ఎక్కువగా ఉన్నాయి.

 

READ MORE: ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే 312 కి.మీ. 

READ MORE : ఇండియా 6జి విప్లవం

READ MORE: మ‌న మెద‌డు పెరుగుతోంది.. ఇప్పుడెల‌?

మీకు తెలియ‌కుండానే మీ నంబ‌ర్‌ను వాడుతున్నారు..

READ MORE భారత్‌కు సొంత స్పేస్‌ స్టేషన్‌

2 thought on “AI T-Shirt : టీ–షర్టుతో గుండెపోటుకు చెక్‌”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *