ACTOR AKHIL: అక్కినేని ఇంట్లో డబుల్‌ పెళ్లి బాజా మోగనుంది. ఇప్పటికే అక్కినేని నాగచైతన్య –శోభిత ధూలిపాళల పెళ్లి వచ్చేనెలలో జరగనున్న నేపథ్యంలో అక్కినేని నాగార్జున మరో శుభవార్త చెప్పారు. తన చిన్న కుమారుడు అక్కనేని అఖిల్‌ పెళ్లి ముచ్చటను సోషల్‌ మీడియా(ఎక్స్‌) వేదికగా పంచుకున్నారు. కాబోయే కోడలికి వెల్‌కం చెబుతూ సంతోషాన్ని వెలిబుచ్చారు. జైనాబ్‌ రవడ్జీని తమ కోడలిగా తమ కుటుంబంలోకి ఆనందంగా ఆహ్వానిస్తున్నామంటూ… వారు జీవితాంతం ప్రేమ, ఆనందంగా ఉండాలని దీవించారు. నాగచైతన్య, అఖిల్‌ పెళ్లి ఒకేరోజు జరుగుతుందా.. లేక సమయం తీసుకుంటారా అన్నది వేచి చూడాలి. ఇప్పటికే నాగచైతన్య, శోభిత ధూలిపాళ పెళ్లికి అన్ని ఏర్పాట్లు చకచకా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలాఉంటే కొత్త జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ నెటిజన్లు తమ అభిమానం చాటుకున్నారు. ప్రస్తుతం అఖిల్‌–బైనాబ్‌ ఫొటోలు సోషల్‌ మీడియాలో జోరుగా చక్కర్లు కొడుతున్నాయి.

READ MORE:

జైౖనాబ్‌ కోసం వెతుకులా..

ACTOR AKHIL: అక్కినేని నాగార్జున ఎక్స్‌లో తనకు కాబోయే కోడలి పేరును చెబుతూ.. అఖిల్‌, బైనాబ్‌ కలిసి కపుల్‌ ఫోటోను షేర్‌ చేశారు. దాంతో ఎవరీ బైనాబ్‌ అంటూ సోషల్‌ మీడియాల వెతుకులాట ఎక్కువైంది. ఆమె జీవిత విశేషాలు తెలుసుకునేందుకు నెటిజన్లు పెద్ద సంఖ్యలో వెతుకులాట మొదలుపెట్టారు. కానీ, అమెకు సంబంధించిన వివరాలేమీ సోషల్‌ మీడియాలో కానరాకపోవడం విశేషం. అంటే ఆమె సింప్లిసిటీ కోరుకునే యువతిగా తెలుస్తోంది. అలాగే, ఆమె తమ సోషల్‌ మీడియా ఎకౌంట్లను ప్రైవేటు మోడ్‌లో ఉంచడం విశేషం.

ఎవరీ జైనాబ్‌

జైనాబ్‌ రవడ్జీ పుట్టింది హైదరాబాద్‌లోనే. తండ్రి పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవడ్జీ. ఈయన ఆంధ్ర ప్రదేశ్‌ ప్రభుత్వంలో జగన్‌ సలహాదారుడిగా పనిచేశారు. జైనాబ్‌ ఎక్కువ శాతం పెరిగింది దుబాయ్‌, లండన్‌లోనే. జైనాబ్‌ మంచి థియేటర్‌ కళాకారిణి అని తెలుస్తోంది. ప్రస్తుతం జైనాబ్‌ కుటుంబం హైదరాబాద్‌లో ఉంటోందని సమాచారం. మరిన్ని విషయాలు త్వరలోనే వెలుగులోకి వస్తాయని తెలుస్తోంది.

READ MORE: యాంక‌ర్‌కు ఆట విడుపు.. పొలం పాటలో సుమ‌క్క‌

ఫస్ట్‌ ఎంగేజ్‌మెంట్‌ బ్రేక్‌..

ACTOR AKHIL: అక్కినేని అఖిల్‌కు 2016లో శ్రియా భూపాల్‌తో నిశ్చితార్థం జరిగింది. ఏడాది వరకు అంతాసవ్యంగానే సాగినా 2017లో ఎంగేజ్‌మెంట్‌ రద్దు చేసుకున్నట్టు అక్కనేని ఫ్యామిలీ ప్రకటించింది. రద్దుకు కారణాలు మాత్రం తెలియరాలేదు. అఖిల్‌ 1994 ఏప్రిల్‌8న శాన్‌ ఓస్‌, కాలిఫోర్నియా, అమెరికాలో జన్మించారు. సిసింద్రీ సినిమాతో బాలనటుడిగా సంచలనం సృష్టించాడు.

READ MORE: విస్త‌రిస్తున్న షుగ‌ర్ డాడీ.. ఆ ప‌నికోస‌మేనా..

READ MORE:  ఇండియా గేట్ వ‌ద్ద ట‌వ‌ల్‌లో.. హాట్ హాట్ గా అలా..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *