ACTOR GANESHAN: సినీ ఇండస్ట్రీ మరో నటుడిని కోల్పోయింది. విలక్షణ నటుడిని కోల్పోయి శోకసంద్రంలో మునిగింది. సుదీర్ఘకాలం ఇండస్ట్రీలో పనిచేసిన మహా నటుడు లేడని కన్నీరుమున్నీరయింది. నటుడు, నిర్మాణ, డబ్బింగ్ ఆర్టిస్టు, రంగస్థల కళాకారుడు, సీనియర్ నటుడు డిల్లీ గణేశన్ (80) శనివారం(నవంబరు 9)న కన్నుమూశారు. గత కొంతకాలంగా గణేష్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో సుమారు 400కుపైగా చిత్రాలో గణేశన్ విభిన్న పాత్రల్లో ప్రేక్షకులను అలరించారు. గణేశన్ 1 ఆగస్టు 1944లో తమిళనాడు రాష్ట్రం తిరునల్వేలి జిల్లా పట్టమడైలో జన్మించారు. గణేషన్‌కు భార్య థంకోమ్, కుమారుడు మహాదేవ్ ఉన్నారు.
నాటక సభ సభ్యుడి…
సినిమాల్లోకి రాకముందు గణేశన్ ఢిల్లీకి చెందిన నాటక బృందం, దక్షిణ భారత నాటక సభ సభ్యుడి ఆయన పనిచేశారు. అంతేకాదు 1964 నుంచి 1974 వరకు గణేశన్ భారత వైమానిక దళంలో పనిచేశారు. ఆయన రంగస్థల పేరును గుర్తు చేస్తూ ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ ఆయనకు ఢిల్లీ గణేశన్ అనే పేరు పెట్టారు. అంతేకాదు పలు సీరియళ్లలో గణేశన్ నటించారు.
వెండితెరకు పరిచయం చేసిన బాలచందర్
గణేశన్(ACTOR GANESHAN: )ను ప్రముఖ దర్శకుడు కె.బాలచందర్ వెండి తెరకు పరిచయం చేశారు. 1976లో వచ్చిన పట్టిన ప్రవేశం చిత్రంతో తమిళ చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యారు. ఆ తర్వాతపలు పాత్రల్లో నటించారు. 1981లో ఎంగమ్మ మహారాణి చిత్రంతో గణేశన్ హీరోగా పరిచయం అయ్యారు. ఆయన సహాయక నటుడిగా, విలన్‌గా పలు చిత్రాల్లో నటించారు. సింధుబైరవి, నాయకన్, మైఖెలల్‌మదన కామరాజన్, తెనాలి, ఆహా(తెలుగు), వంటి విజయవంతమైన చిత్రాల్లో గణేశన్ నటించారు. 2015లో నిర్మాతగా మారారు. తన కుమారుడు మహాను ప్రధాన పాత్రలో పరిచయం చేస్తూ ఎన్నుల్ అయిరామ్‌ను నిర్మించారు. హిందీలోల దస్, అజబ్ ప్రేమ్‌కీ గజబ్‌కహానీ, చెన్సై ఎక్స్ ప్రెస్ చిత్రాల్లో నటించి అలరించారు. తెలుగు చిత్రాలోనూ గణేశన్ నటించారు.
1994లో వచ్చిన పోలీస్ బ్రదర్, నాయుడమ్మ, పున్నమినాగు, బాక్ వంటి చిత్రాల్లో విలక్షణ పాత్ర పోషించారు. కాగా గణేషన్ మృతి(ACTOR GANESHAN) నటులు నివాళులర్పించారు.
–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్ చేసి చదవండి–
నేడే బిగ్ ఫైల్.. ఇండియ బిగ్ ప్లాన్.. సౌతాఫ్రికాతో రెండో టీ20..
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
వంద రేప్‌లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..
తెలుగు వారిని అంత మాటంటావా.. నటి కస్తూరిపై ఫైర్
ఎలాన్ ముస్క్ కు ట్రంప్ బిగ్ ఆఫర్..
సర్వే డేటా భద్రమేనా.. ప్రజలకు అనుమానాలు.. ముప్పు ఇదేనా..
వాటిని.. డ్రీమ్ గర్ల్ హేమామాలిని బుగ్గలుగా మారుస్తా..
టీడీపీ- జనసేన మధ్య ముదిరిన వార్
మన మెదడు పెరుగుతోంది.. లాభమా .. నష్టమా..
మబ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారణం
ఇంటింటి సర్వే డేటా భద్రమేనా.. అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తే..
కేదార్‌నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
బీజేపీలో ముసలం.. నెక్ట్స్ బాస్ ఎవరంటే..?
మెడికల్ వార్: ఆయుర్వేదం వర్సెస్ అలోపతి
పడిపోతున్న ఇండియా గ్రాఫ్.. కానీ..