ktr-highcourt

KTR ARREST : తెలంగాణ ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కె.తారకరామారావు అరెస్టుకు ఏసీబీ రంగం సిద్ధం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఈ కార్‌ రేస్‌లో అవకతవకల కేసులో కేటీఆర్‌ క్వాష్‌ పిటీషన్‌ వేశారు. డిసెంబరు 31(2024) ఇరువైపులా వాదనలు హైకోర్టు ముగించిన విషయం తెలిసిందే. కాగా, మంగళవారం (జనవరి7)న పిటిషన్‌ను హైకోర్టు కొట్టివేసింది. దాంతో మధ్యంతర ఉత్తర్వులు ముగిసినట్టేనని తెలుస్తోంది. కేటీఆర్‌ సుప్రీంకోర్టుకు అప్పీలు చేసుకునే అవకాశముంది. ఈలోగా ఏసీబీ అధికారులకు అరెస్టు చేసే అధికారం కూడా ఉండడంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఎప్పుడు ఏం జరుగుతోందని టెన్షన్‌ రాష్ట్ర వ్యాప్తంగా కనిపిస్తోంది.

అయితే ఈనెల 9న విచారణకు ఆదేశించిన ఏసీబీ అధికారులు దూకుడు పెంచారు. హైకోర్టు తీర్పు రాగానే ఈ కార్‌ రేస్‌ నిర్వహించిన జెన్‌కో కంపెనీలో సోదాలు ముమ్మరం చేశారు. ఈ మేరకు గ్రీన్‌కో దాని అనుబంధ సంస్థల్లో సోదాలు చేపట్టారు. మాదాపూర్‌లోని ఏస్‌ జెన్‌ నెక్ట్స్‌, ఏస్‌ అర్బన్‌ రేస్‌, మచిలీపట్నంలోని ఏస్‌ అర్బన్‌ డెవలపర్స్‌లో ఉదయం నుంచి సాదాలు జరుపుతున్నారు. హైదరాబాద్‌, విజయవాడ, మచిలీపట్నంలోని ఆయా ఆఫీసుల్లో రికార్డులను తనిఖీ చేస్తున్నారు. ఈమేరకు వారు పలుకీలకపమైన రికార్డులను స్వాధీనం చేసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. పరిస్థితులు శరవేగంగా మారుతుండడంతో ఏసీబీ అధికారులు కేటీఆర్‌కు రంగం సిద్ధం చేస్తున్నారనే ప్రచారమూ సాగుతోంది.

  • ఏసీబీ ప్లాన్‌ ఏంటి?

  • ఈ కేసులో ఇప్పటికే కేటీఆర్‌ను ఈనెల 9న విచారణకు రావాల్సిందిగా నోటీసులు జారీ చేశారు. హైకోర్టు తీర్పు నేపథ్యంలో ఈ రెండు రోజులు అధికారులు పూర్తి ఆధారాలు సేకరించే అవకాశముంది. లేదంటే ఈలోగానే అతడిని అరెస్టు చేసే అవకాశమూ లేకపోలేదు.

కేటీఆర్‌ ఇంటికి నేతల క్యూ…

KTR ARREST: హైకోర్టులో కేటీఆర్‌కు చెక్కెదురవడంతో హైదరాబాద్‌లోని నందినగర్‌లోని ఆయన ఇంటికి మాజీ మంత్రులు, ప్రజా ప్రతినిధులు క్యూ కట్టారు. హరీష్‌రావు, జగదీష్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌ రెడ్డి, కవిత, మధుసూదనాచారి తదితరులు ఆయన ఇంటికి చేరుకున్నారు. తర్వాత తీసుకునే చర్యలపై చర్చించారు. ముఖ్యంగా హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీం కోర్టును ఆశ్రయించే విషయంలో సమాలోచనలు చేసినట్టు తెలుస్తోంది. ఈమేరకు ఆయన లీగల్‌ టీమ్‌తో చర్చలు జరుపుతున్నారు.హైకోర్టు ఫుల్‌ బెంచ్‌కు వెళ్లాలా, లేక సుప్రీంను ఆశ్రయించాలా అన్నకోణంలో చర్చలు జరుపుతున్నట్టు సమాచారం.

కేటీఆర్‌ను ఏ1గా..

ఫార్ములా ఈ కార్ రేస్ కేసు (Formula E car Race ) తెలంగాణలో సంచలనంగా మారింది. 2022 అక్టోబరు 25న హైదరాబాద్‌లోని హుస్సేన్ సాగ‌ర్ వ‌ద్ద ఫార్ములా ఈ కార్ రేస్ నిర్వ‌హించారు. ఈ పోటీల అనుమతులు ఇచ్చిన సమయంలో అవినీతి జరిగిందని ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసులో కేటీఆర్‌ను ఏ1గా, మున్సిపల్‌ అడ్మినిస్ట్రేషన్‌ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ అరవింద్‌ కుమార్‌ను ఏ2గా, హెచ్ఎండీఏ చీఫ్‌ ఇంజనీర్‌ బీఎల్ఎన్‌ రెడ్డిని ఏ3గా ఏసీబీ అధికారులు చేర్చారు. కాగా, కేటీఆర్‌ తనపై ఉన్న ఆరోపణలను కొట్టివేయాలని హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేశారు.

రాజకీయ దుమారం…

కేటీఆర్‌ అరెస్టు ఖాయమంటూ ప్రచారం సాగుతుండడంతో రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. బీఆర్‌ఎస్‌ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది. ఒకవేళ కేటీఆర్‌ను అరెస్టు చేస్తే తమ పరిస్థితి ఏమిటనే డైలమాలో పడ్డారు. కొద్ది రోజుల నుంచి తనను అరెస్టు చేస్తారనే వ్యాఖ్యలు బహిరంగంగానే చేస్తున్నారు. కేసు నమోదైన నాటి నుంచి కేటీఆర్‌ ప్రభుత్వం తనపై కక్ష సాధింపులకు పూనుకుంటోందని ఆరోపించారు. ఈ క్రమంలో కోర్టు తీర్పుకు ఉత్కంఠ రేపుతోంది.

READ MORE: త్వ‌ర‌లోనే ఇండియాలో బుల్లెట్ ట్రైన్‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *