BIG SCAME: ఇండియా టాప్ క్రికెటర్లు భారీ కుంభకోణంలో ఇరుక్కునట్టు తెలుస్తోంది. తాజాగా అధికారులు ఈ విషయాన్ని గుర్తించడంతో చర్చనీయాంశంగా మారింది. ఈ స్కాంలో ఇరుక్కున్న వారిలో టాప్ క్రికెటర్లు శుభ్‌మన్ గిల్, రాహుల్ తెవాటియా, మోహిత్, సాయి సుదర్శన్ ఉన్నట్టు తెలుస్తోంది. వారికి కేసు విచారణ జరుపుతున్న సీఐడీ ఇప్పటికే వారికి సమాన్లు జారీ చేసినట్టు ప్రచారం సాగుతోంది. అయితే గిల్ ప్రస్తుతం ఆస్ర్టేలియాలో జరుగుతున్న బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో పర్యటనలో ఉన్నారు. గిల్ ఇండియాకు తిరిగి రాగానే సీఐడీ విచారణకు జరిపే అవకాశముంది.
రూ.450కోట్ట భారీ కుంభకోణం..
BIG SCAME : గుజరాత్‌లో సంచలనం సృష్టించిన పోంజీ కుంభకోణంలో ఇండియాకు చెందిన ఐపీఎల్, ఇంటర్నేషనల్ యువ క్రికెటర్లు గిల్, మోహిత్, సాయి సుదర్శన్, రాహుల్‌లో బీజ్ కంపెనీలో పెట్టుబడి పెట్టారు. గిల్ రూ.1.95కోట్లు పెట్టుబడి పెడితే, మిగతా ప్లేయర్లు రూ.10లక్షలు పెట్టినట్టు సీబీఐ గుర్తించింది. ఈమేరకు వారికి సమాన్లు అందించినట్టు తెలుస్తోంది. ఈ విషయాన్ని అహ్మదాబాద్ మిర్రర్ తన కథనం పేర్కొంది. బీజెడ్ ఫైనాన్షియల్ సర్వీస్ కంపెనీ బ్యాంకుల కంటే ఎక్కువ వడ్డీ ఇస్తామంటూ ప్రజలను నుంచి సుమారు రూ.6వేల కోట్లు నిధులు సేకరించినట్టు బయటపడింది. తర్వాత విచారణలో రూ.450 కోట్లు కుంభకోణం జరిగినట్టు అధికారులు గుర్తించారు. విచారణ వెలుగుచూస్తున్న అంశాలను బట్టి ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశముందని సమాచారం. కాగా, ఆ సంస్థ పనితీరుపై అనుమానం రావడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించగా, ఈ ఉదంతం వెలుగులోకి వచ్చింది. సదరు బీజెడ్ గ్రూప్ సీఈవో భూపేంద్ర సింగ్ జలాలను ఇప్పటికే సీబీఐ అరెస్టు చేసి విచారణ ఆరంభించింది. విచారణలో యువ క్రికెటర్లు పెట్టుబడి పెట్టినట్టు అధికారులు గుర్తించారు. ఈ విషయం బయటపడడంతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. క్రికెటర్లను విచారించాక మరిన్ని అంశాలు వెలుగులోకి రానున్నట్టు ప్రచారం సాగుతోంది. కొందరు విదేశీ పర్యటన, ఒకరు అనారోగ్యంతో చికిత్స పొందుతున్న నేపథ్యంలో త్వరలోనే వారిని సీబీఐ విచారించన్నట్టు తెలిసింది. మరి ఈ కేసు నుంచి క్రికెటర్లు ఎలా బయపడతారో వేచి చూడాలి.
విచారణ ముమ్మరం…
BIG SCAME : సీఐడీ క్రైం విభాగం ఇటీవల భూపేంద్ర సింగ్ జలాలకు చెందిన చార్టర్డ్ అకౌంటెంట్ రుషిక్ మెహతాను విచారించింది. సబర్‌కాంత జిల్లాకు చెందిన మహతా భూపేంద్ర సింగ్ ఖాతాను నిర్వహించేవాడని అధికారులు గుర్తించారు. ఇందులో అతడి పాత్ర ఉన్నట్టు తేలితే తగిన చర్యలు తీసుకునే అవకాశముందని తెలుస్తోంది.
READ MORE: జక్కన్న–ప్రిన్స్ మూవీ అప్డేట్స్