BJP Plan : బీజేపీ స్కెచ్ ఏంటి.. జనసేనకు సీట్లు ఎందుకు తగ్గాయి.. సీఎం అభ్యర్థి చంద్రబాబు నాయుడా? పవన్ కల్యాణా? 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్ల పంపకాలు ఏం చూచిస్తున్నాయి.. పంపకాలు బీజేపీ కనుసన్నల్లోనే జరిగాయి.. వైఎస్ జగన్‌తో పన్నిన మ్యూహం ఏమైనా ఉందా.. ఏపీ తాజా రాజకీయాలపై విశ్లేషణ.
ఆంధ్ర రాజకీయాలు రోజురోజుకూ వేడెక్కుతున్నాయి. ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ప్రధాన పార్టీలు తమ వ్యూహాలకు పదునుపెట్టాయి. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండడంతో అగ్రనేతలు ఎత్తుకుపైఎత్తులు వేస్తున్నారు. ఇప్పటికే నేతల మధ్యమాటల యుద్ధం పెరిగింది. ఈసారి ఎన్నికల్లో కొత్త సమీకరణాలు రాజకీయం దుమారం రేపుతున్నారు. ఏపీలో జగన్ సర్కారు అధికారంలోకి వచ్చాక కేంద్రంలోని బీజేపీ సర్కారుతోరి జగన్ సఖ్యతగానే ఉన్నారు. దీనికీ కారణం లేకపోలేదు. జగన్ తండ్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణం తర్వాత కాంగ్రెస్ పార్టీ తనకు తగిన గుర్తింపు ఇవ్వకపోవడంతో తర్వాత కాంగ్రెస్ నుంచి విడిపోయారు. వైఎస్‌ఆర్‌సీపీ పార్టీ ఏర్పాటు చేసి, అధికారంలోకి వచ్చారు. దీంతో కాంగ్రెస్‌పై కోపంతో బీజేపీకి దగ్గరయ్యారు. తర్వాతి కాలంలో పరిస్థితి మారింది. ఏపీకి కేంద్రం ప్రత్యేక హోదా ఇవ్వకపోవడంతో సీఎం జగన్ ఆ పార్టీతో అంటీముట్టనట్టుగా ఉన్నట్టు ప్రచారం జరిగింది. అనంతరం మరింత దూరం పెరిగింది.
టీడీపీ, జనసేన పొత్తుతో…
టీడీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబును స్కిల్ డెవలప్‌మెంట్ స్కాం కేసులో వైఎస్ సర్కారు అరెస్టు చేయడంతో టీడీపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. బాబు జైలులో ఉండడంతో పార్టీకి సారథి లేకుండా పోవడంతో టీడీపీ క్యాడర్‌లో నైరాశ్యం నెలకొంది. ఈనేపథ్యంలో శ్రేణులను కాపాడుకునే క్రమంలో అనూహ్యం చంద్రబాబు నాయుడు జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌తో చేతులు కలిపారు. అప్పటివరకు టీడీపీపై మాటల తూటాలు పేల్చిన జనసేనతో టీడీపీ జతకట్టడంతో రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు ఒక్కసారిగా మారిపోయాయి. తాజాగా టీడీపీ, జనసేనతో బీజేపీ చేతులు కలిపింది. దీంతో మూడు పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి.
బీజేపీ భారీ వ్యూహం..
రాష్ట్రంలో రాజకీయ పరిణామాలను నిశితంగా పరిశీలించిన బీజేపీ అధిష్ఠానం ఇన్నాళ్లు పొత్తులపై ఆచితూచి వ్యవహరించింది. ఒకదశలో వైసీపీతో బీజేపీ పొత్తు ఉంటుందనే ప్రచారమూ సాగింది. కానీ బీజేపీ ఇక్కడే అసలు వ్యూహం పన్నినట్టు తెలుస్తోంది. ఇప్పుడు టీడీపీ, జనసేనతో పొత్తుకు సై అంది. రాష్ట్రంలో బీజేపీకి అంతపట్టు లేదు.. వైఎస్ జగన్ ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతుండడంతో ఆపార్టీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉండకపోవచ్చని భావించి టీడీపీ, జనసేనతో పొత్తుకు సిద్ధమైంది. ఒకవేళ బీజేపీ, టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి వస్తే బీజేపీని రాష్ట్రంలో మరింత పటిష్టం చేసుకునే అవకాశం కలుగుతుంది. ఒకవేళ కాలం కలిసిరాక మళ్లీ వైఎస్ జగన్ ప్రభుత్వ వచ్చినా.. ఈలోకగా పార్టీకి క్యాడర్ ఓటింగ్ శాతం పెంచుకునే అవకాశం ఎలాగూ ఉంటుంది. బీజేపీకి ప్రధానంగా కావాల్సింది ఎంపీ సీట్లే కాబట్టి జగన్ పార్టీతో పొత్తుకు తలుపులు తెరవచ్చొరి భావించి ఉండొచ్చు. అదే జరిగే బీజేపీ తనకుతానుకుగా చేతులు చాపితే జగన్ వచ్చిన అవకాశాన్ని అందిపుచ్చుకుని మద్దతు ఇచ్చేందుకు ముందుకువచ్చే అవకాశమూ లేకపోలేదు. ఒకవేళ బీజేపీ ఓడినా ప్రత్యేకంగా ఆ పార్టీకి జరిగే నష్టం ఏమీ లేదు. ఇదిలా ఉంటే సీట్ల పంపకాలు బీజేపీ కనుసన్నల్లోనే జరిగినట్టుగా కేటాయింపులను బట్టి తెలుస్తోంది.
జనసేన, టీడీపీ శ్రేణుల్లో సఖ్యత?
బీజేపీ వ్యూహం ఏదైనా ఉండొచ్చు. అది పక్కనబెడితే అసలు జనసే, టీడీపీ మధ్య సఖ్యత ఏస్థాయిలో ఉందో తేలాల్సి ఉంది. ఇప్పటివరకు సీఎం అభ్యర్థి ఎవరనేది ఇంకా ప్రకటించడం లేదు. పరిస్థితి చూస్తుంటే కూటమి సీఎం అభ్యర్థిగా నారా చంద్రబాబు నాయుడు ఉండొచ్చు. పొత్తులో కేటాయించిన సీట్ల కేటాయింపు చూస్తే ఇదే అర్థమవుతోంది. రాష్ట్రంలో 175 అసెంబ్లీ, 25 ఎంపీ సీట్లున్నాయి. పొత్తులో భాగంగా టీడీపీ 144 అసెంబ్లీ, 17 ఎంపీ సీట్లు దక్కాయి. జనసేనకు కేవలం 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లు కేటాయించారు. ఇక బీజేపీ మాత్రం 10 అసెంబ్లీ, 6 ఎంపీ సీట్లు పొత్తులో ఖరారు చేయడం విశేషం. ఈ లెక్కలు చూస్తుంటే పవన్ సీఎం రేసులో లేనట్టే. అయితే, సీఎం అభ్యర్థి విషయంలో టీడీపీ, జనసేన నేతల్లో తమ నాయకుడే ఉంటాడని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయంలో రెండు పార్టీ శ్రేణుల మధ్య అక్కడక్కడ విబేధాలు బయటపడ్డ విషయం తెలిసిందే.
[…] […]
[…] మెజారిటీ సీట్లను సాధించమే లక్ష్యంగా బీజేపీ ముందుకుసాగుతోంది. ఈసారి మిత్రపక్షాల […]
[…] నుంచి బరిలో దింపే అవకాశాన్ని అధిష్ఠానం యోచిస్తోంది. తుత్తుకుడి పార్లమెంట్ […]