BJP/కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ తీవ్రంగా ప్రయత్నిస్తోంది. ఎన్డీఏ (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) కూటమి మరోసారి తమ సత్తా చాటాలని ఉవ్విళ్లూతోంది. ఇదిలాఉంటే ఈసారి మిత్ర పక్షాల మద్దతులో 400 పార్లమెంట్ సీట్లను సాధించడమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీ పావులు కదుపుతున్నారు. దేశంలో 543 లోక్‌సభ సీట్లు ఉండగా మెజారిటీ సీట్లను సాధించమే లక్ష్యంగా బీజేపీ ముందుకుసాగుతోంది. ఈసారి మిత్రపక్షాల అవసరం పడకుండానే అధికారానికి కావాల్సిన సీట్లను సాధించేలా ఎత్తులు వేస్తోంది. అయితే బీజేపీ కి ఉత్తరాదిన మంచి పట్టు ఉన్నా.. దక్షిణాది తమ పట్టును నిలుపుకునేందుకు ఏళ్ల నుంచి ప్రయత్నాలు సాగిస్తూనే ఉంది. దక్షిణాది రాష్ట్రాలైనా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్నాటక, తమిళనాడుతోపాటు కేంద్ర పాలిత ప్రాంతాలైన పాండిచ్చేరి, లక్షదీప్‌లలో బీజేపీకి అంతాగా పట్టున్న ప్రాంతాలు కొన్నే. ఇదిలా ఉంటే దక్షిణాదిన మొత్తం 131 సీట్లు ఉన్నయి. ఎందుకు కనీసం సగం కూడా ఆ పార్టీ సాధించిన దాఖలాలు లేవు. గత ఎన్నికల్లో ఒక్క కర్ణాటక మినహా ఎక్కడా కనీసం సగం సీట్లు సాధించిన దాఖలాలు లేవు. మరి 400 స్థానాలు ఎలా సాధిస్తుందో.. చూడాలి.
ఆంధ్రప్రదేశ్‌లో కలిసొచ్చేనా..
దక్షిణాది రాష్ట్రాల్లో ఒకటి ఆంధ్రప్రదేశ్. ఇక్కడ 25 ఎంపీ స్థానాలు ఉన్నాయి. 2019లో జరిగిన ఎంపీ ఎన్నికల్లో వైసీపీ ఏకంగా 22 స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ (తెలుగుదేశం పార్టీ) కేవలం 3 స్థానాలతో సరిపుచ్చుకుంది. జనసేన పార్టీకి ఒక్కసీటు దక్కలేదు. ఈనేపథ్యంలో ఈసారి ఏపీలో ఎలాగైనా పాగావేయాలని బీజేపీ పావులుకదిపింది. ఇందులో భాగంగా వైసీపీని దెబ్బతీసేందుకు టీడీపీ, జనసేన పార్టీలతో పొత్తుపెట్టుకుంది. అంతేకాదు ఆరు స్థానాల్లో బీజేపీ పోటీకి దిగుతోంది. మరి మిత్రపక్షాలతో ఏస్థాయిలో ముందుకు పోతుందో.. ఎన్ని సీట్లు సాధిస్తుందో చూడాలి. ఈసారి కూడా తమ సత్తా చాటి ఎలాగైనా సిటింగ్ స్థానాలను పదిలపర్చుకోవాలని వైసీపీ చూస్తోంది. ఇదిలాఉండగా, ఏపీలో మెజారిటీ స్థానాలను సాధించేందుకు కాంగ్రెస్ కూడా ఎత్తులు వేస్తోంది.
తమిళనాడులో పార్టీకి గడ్డుకాలం..
దక్షిణాది రాష్ట్రంలో అత్యంత ముఖ్యమైనది తమిళనాడు. ఇక్కడ ఆదినుంచి ప్రాంతీయ పార్టీలదే హవా. ముఖ్యంగా డీఎంకే(ద్రవిడ మున్నెట్ర కజగం), ఏఐఏడీఎంకే( అఖిల భారత ద్రవిడ మున్నెట్ర కజగం) పార్టీలదే హవా సాగుతోంది. 1976 నుంచి ఈ రెండు పార్టీలే అధికారంలోకి వస్తున్నాయంటే ఏ స్థాయిలో బలంగా ఉందో ఇట్టే అర్థమవుతుంది. ఇక్కడ, కాంగ్రెస్, బీజేపీల పార్టీలు సాధించే సీట్లు అంతంత మాత్రమే. హిందీ భాషపై, ఉత్తరాది పార్టీలపై ఆసక్తి చూపని తమిళుల నాడిని బీజేపీ ఈసారైనా పట్టుకుంటుందా.. లేక ఎప్పటిలాగే డీలా పడుతుందా చూడాలి. కనీసం ఇక్కడ 10 సీట్లు బీజేపీ సాధించినా గొప్ప విషయమేనని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. తమిళనాడులో 39ఎంపీ స్థానాలుండగా ప్రస్తుతం డీఎంకే 24 స్థానాలు సాధించడం విశేషం. బీజేపీ (BJP)ఒక్కసీటు కూడా లేకుండా పోయింది. మరి ఈసారి బీజేపీ పాచికలు ఏమేరకు పారుతాయో చూడాలి.
కేరళలో కథ మారేనా..
కేరళ రాష్ట్రంలో 2019లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వయనాడు నుంచి పోటీ చేసిన రాహుల్ గాంధీ విజయం సాధించారు. మొత్తం 20 ఎంపీసీట్లు ఉండగా కాంగ్రెస్ 15 సీట్లు సాధించగా, దాని మిత్రపక్షాలు మరో నాలుగు సీట్లు దక్కించుకుని తిరుగులేని ఆధిపత్యాన్ని సాధించాయి. కేరళలో మెజారిటీ స్థానాలు సాధించడం బీజేపీకి ఇప్పుడు అనివార్యమైంది. లేదంటే భవిష్యత్తులో రాష్ట్రంలో పార్టీ మనుగడకే ముప్పువాటిల్లే ప్రమాదముంది. ఈనేపథ్యంల బీజేపీ ఏస్థాయిలో వ్యూహం పన్నుతుందో విశ్లేషకులు ఎదురుచూస్తున్నారు. అయితే గత ఎన్నికల్లో నోట్ల రద్దు, శబరిమల నిరసనలు, రాష్ట్రం నుంచి రాహుల్ గాంధీ పోటీ చేయడం, వస్తు సేవల పన్ను తీవ్ర ప్రభావం చూపాయి. ఇప్పుడా పరిస్థితుల ప్రభావం పెద్దగా లేకపోవడంతో బీజేపీకి ఏమైనా కలిస్తొస్తుందా చూడాలి.
తెలంగాణలో పట్టు నిలుపుకోవడమే లక్ష్యం..
- బీజేపీ శరవేగంగా పుంజుకుంటున్న రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి. గతంలో ఒకటి అరా ఎంపీ సీట్లను మాత్రమే గెలుపొందే బీజేపి.. నరేంద్రం మోదీ ప్రధానమంత్రి అయ్యాక ఓటింగ్ శాతం క్రమక్రమంగా పెరుగుతూ వస్తోంది. రాష్ట్రంలో మొత్తం 17 ఎంపీ స్థానాలు ఉండగా బీజేపీ నాలుగు స్థానాలకు కైవసం చేసుకుంది. బీఆర్‌ఎస్ పార్టీ 9 స్థానాలతో ముందంజలో ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం పోవడం, కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో పరిస్థితులు పూర్తిగా మారాయి. బీజేపీ శ్రమిస్తే రానున్న ఎన్నికల్లో బీఆర్‌ఎస్ స్థానాల్లో కనీసం ఐదింటినైనా గెలుచుకునే అవకాశముంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ(కేంద్రంలో రావడానికి)కి సానుకూల పవనాలు వీస్తుండడంతో ఏమేరకు సద్వినియోగం చేసుకుంటుందో వేచిచూడాలి. ఈసారి బీజేపీకి ప్రధానంగా కాంగ్రెస్ నుంచే పోటీ ఉండే అవకాశముంది. రాష్ట్రంలో అధికారం ఉండడంతో సాధ్యమైనన్ని సీట్లు సాధించేందుకు కాంగ్రెస్ కూడా తీవ్రంగానే కృషి చేస్తోంది.
కర్నాటకలో సానుకూల పవనాలు..
దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పట్టిష్టంగా ఉన్న ఏకైక రాష్ట్రం కర్నాటక. ఐటి రంగం, ఉద్యోగులు, అక్షరాస్యులు ఎక్కువగా ఉండే ప్రాంతంలో బీజేపీ ఈసారి కూడా పట్టు నిలుపుకునేందుకు ఎత్తులు వేస్తోంది. 28ఎంపీ స్థానాలు ఉండగా ఏకంగా 25 స్థానాలతోపాటు ఒక మిత్రపక్షంతో కలిసి 26 స్థానాలతో పటిష్టంగా ఉంది. బీజేపీ కీలక నేత ఎడ్యూరప్ప చరిష్మా, ప్రధాని మోదీ ఎత్తుగడలతో వచ్చే ఎన్నికల్లో కూడా అదే ఫలితాలు రాబట్టేందుకు యత్నిస్తోంది. మరి ఉద్యోగులను ఈసారి కూడా ఎలా ఆకట్టుకుంటుందో వేచిచూడాలి.
లక్షదీప్‌పై కన్ను.. పాండిచ్చేరిపై గురి..
కేంద్రపాలిత ప్రాంతాలైన లక్షదీప్, పాండిచ్చేరిపై బీజేపీ అధిష్ఠాన దృష్టిసారించింది. భారత్‌పై అనుచితంగా ప్రవర్తిస్తున్న మల్దీవుల అధ్యక్షుడు మహ్మద్ ముయుజ్జు తీరు నచ్చక ఆదేశానికి వెళ్లే భారత పర్యాటకులు లక్షదీప్‌కు రావాలంటూ స్వయంగా ప్రధాని మోదీ లక్షదీప్‌కు వెళ్లి పిలుపునిచ్చారు. దీంతో బాయ్‌కాటు మల్దీవుల నినాదం దేశవ్యాప్తంగా ఊపందుకుంది. దీంతో ఆ దేశానికి ప్రధాన ఆదాయ వనరులు భారత పర్యాటకులే కావడం పర్యాటకులు లేక ఆర్థిక వ్యవస్థపైనే తీవ్ర ప్రభావం చూపింది. ఈ ఘటన తర్వాత లక్షదీప్‌కు వచ్చే పర్యాటకులు సంఖ్య గణనీయంగా పెరిగింది. ఈ సానుకూలంశం బీజేపీ కలిసివచ్చేలా ఉంది. మరి ఏమేరకు సద్వినియోగం చేసుకుంటుందో చూడాలి. అలాగే పాండిచ్చేరిలో ప్రస్తుతం కాంగ్రెస్ వశమైంది. ఈ ప్రాంతాలు ఒక్కో ఎంపీ సీటును మాత్రమే కలిగి ఉన్నాయి.
[…] […]
[…] బీజేపీ 400 ఎంసీ సీట్లు సాధిస్తుందా.. […]