BRS PRESIDENT: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ కుటుంబాన్ని టార్గెట్‌ చేస్తూ ఇటీవల మాటల దాడి పెంచిన విషయం తెలిసిందే. ఇందుకోసం అందివచ్చిన ప్రతీ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేపనిలో సీఎం ఉన్నారు. తాజాగా ఫార్ములా ఈ రేస్‌ కేసును అస్త్రంగా వాడుకునే అవకాశమూ లేకపోలేదు. ఈ కేసులో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి, కేటీఆర్‌ ఏ–1గా చేరుస్తూ తెలంగాణ ఏసీబీ కేసు నమోదు చేసింది. కేటీఆర్‌ పురపాలక శాఖా మంత్రిగా ఉన్న సమయంలో కార్‌ రేస్‌ను నిబంధనలు విరుద్ధంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ పురపాలకశాఖ ముఖ్యకార్యదర్శి దానకిశోర్‌ ఏసీబీకి ఈ ఏడాది అక్టోబరులో ఫిర్యాదు చేశారు. ఇందులో రూ.54.88కోట్ల వరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ కేసులో కేటీఆర్‌నుఏ–1గా చేరుస్తూ కేసు నమోదు చేశారు. కేసు పూర్వాపరాలు పక్కనబెడితే కేటీఆర్‌ అరెస్టు ఏ క్షణమైనా ఉండవచ్చనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. కేటీఆర్‌ కూడా ఇటీవల కాలంలో తరచూ తనను అరెస్టు చేస్తారంటూ పేర్కొంటుండడంతో అనుమానాలకు మరింత బలం చేకూర్చుతోంది. కేటీఆర్‌ అరెస్టు అయితే పార్టీ పగ్గాలు ఎవరికి అప్పజెప్తారనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా హాట్‌ టాపిక్‌గా మారింది.

READ MORE: క‌విత రాక కోసం ఎదురుచూపు.. లేదంటే..

కేసీఆర్‌ వ్యూహం ఏమిటీ..

BRS PRESIDENT:  రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పార్టీ వ్యవహారాలకు దూరంగా ఉంటున్నారు. ప్రస్తుత అసెంబ్లీ సమావేశాలకు కూడా ఆయన హాజరుకావడం లేదు. కారణం ఏమిటో తెలియదు కానీ, ఇంటికే పరిమితం అవడంతో అప్పటి నుంచి పార్టీ వ్యవహారాలను మొత్తం కేటీఆరే చూసుకుంటున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ఎండగడుతున్నారు. ఆయనకు తోడుగా హరీష్‌రావు నిలుస్తూ వస్తున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నిసార్లు సవాళ్లు విసిరినా కేసీఆర్‌ బయటకు వచ్చిన దాఖలాలు లేవు. పరిస్థితి చూస్తుంటే ఆయన రాజకీయ అస్త్ర సన్యాసం చేశారా అన్న అనుమానాలు అటు పార్టీ క్యాడర్‌లో.. ఇటు ప్రజల్లో నెలకొన్నాయి. ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అన్నది తెలియదు. కేటీఆర్‌ అరెస్టు అయితే పార్టీ పగ్గాలు ఎవరికైనా అప్పగిస్తారా.. లేక తానే చేపడతారా అన్న సందేహం వ్యక్తమవుతోంది. లేదంటే తన కూతురు కవితకు ఏమైనా అప్పస్తారా చూడాలి. కేసీఆర్‌ మాత్రం కవితకే పగ్గాలు అప్పగించేందుకు సుముఖంగా ఉంటారనే ప్రచారం సాగుతోంది.

READ MORE: టార్గెట్ కేసీఆర్‌.. నోరు మెదప‌ని కేసీఆర్‌.. క్యాడ‌ర్ లో అయోమ‌యం

కవితకు అప్పగిస్తారా…

BRS PRESIDENT: ఒకవేళ కేటీఆర్‌ అరెస్టయితే పార్టీ పగ్గాలు కల్వకుంట్ల కవిత చేపడతారనే ప్రచారమూ లేకపోలేదు. ఇది ఎంతవరకు సాధ్యమనే చర్చ అప్పడే సాగుతోంది. లిక్కర్‌ కేసులో ఇరుక్కున్న ఆమెకు పార్టీ పగ్గాలు అప్పగిస్తే జనం నుంచి ఎలాంటి రియాక్షన్‌ వస్తుందో అన్న చర్చకూడా సాగుతోంది. అయితే కవిత బాధ్యతలు తీసుకునేందుకు సుముఖంగా ఉన్నారనే గుసగుసలు పార్టీలో వినిపిస్తున్నాయి. ఇటీవల కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజా క్షేత్రంలోకి వస్తుండడం తెలిసిందే.

ట్రబుల్‌ షూటర్‌కు దక్కేనా..

కేటీఆర్‌ అరెస్టయితే నెక్ట్‌ పార్టీ పగ్గాలు చేపట్టేది మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావేనని ఆయన మద్దతుదారులు పేర్కొంటున్నారు. అటు క్యాడర్‌లో, ఇటు జనాల్లో ఆయనకు బాధ్యతలు అప్పగిస్తే పార్టీకి సానుకూలత పెరుగుతుందని భావిస్తున్నారు. ట్రబుల్‌ షూటర్‌గా పేరున్న హరీష్‌రావు పార్టీని లీడ్‌ చేసే సత్తా ఉంది. తాజాగా అసెంబ్లీ సమావేశంలో ప్రభుత్వానికి ధీటుగా సమాధానాలిస్తూ పార్టీకి తాను ఎంత కీలకమో చెప్పకనే చెబుతున్నారు. మరి ఈ విషయంలో ఎవరికి మద్దతు ఇస్తారో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *