CHINA NEW VIRUS: కరోనా మహమ్మారి మిగిల్చిన విధ్వంసం నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న ప్రపంచానికి మరో ఉపద్రవం ముంచుకొస్తుందని తెలిసి జంకుతున్నారు. చైనాలో పుట్టిన కోవిడ్ వైరస్ ప్రపంచాన్ని గడగడలాడించని విషయం అందరికీ తెలిసిందే. వేలాదిమందిని పొట్టనపెట్టుకుంది. కరోనా పుట్టిన చైనాలోనే మరో వైరస్ పుట్టిందంటూ వస్తున్న ప్రచారం కలరవపెడుతోంది. చైనాలోని షోల్ మీడియాలో ఇదే విషయం చెక్కర్లు కొడుతుండడంతో ఆందోళన మొదలైంది. హ్యూమన్ మెటానిమో వైరస్(హెచ్‌ఎంపీవీ) శరవేగంగా విస్తరిస్తోందని అక్కడి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం సాగుతోంది. ఇప్పటికే ఈ వైరస్ బారినపడిన ఎంతో మంది జనం ఆస్పత్రుల పాలయ్యారని తెలుస్తోంది. హ్యూమన్‌మెటానిమో వైరస్‌తోపాటు నిమోనియ, కొవిడ్–19 వైరస్‌లు ఇన్‌ప్లూయెంజా ఏ, మైకోప్లాస్మా వంటివి కూడా వ్యాప్తి చెందుతున్నట్టు పోస్టులు ప్రపంచాన్ని భయపెడుతున్నాయి. అంతేకాదు చైనాలో ఇప్పటికే ఎమర్జన్సీ ప్రకటించిందనే ప్రచారమూ సాగుతుతోంది. దీనిపై ఇంకా ఎలాంటి స్పష్టత లేదు.
ఐదేళ్ల క్రితం..
ఐదేళ్ల క్రితం కొవిడ్–19వ్యాప్తి తొలిరోజుల్లో రోగ నిరోధక చర్యలు చేపట్టకపోవడంతో చైనా భారీ మూల్యం చెల్లించుకుంది. ఆ అనుభవాలను దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. ఈ కొత్త వైరస్ కూడా దాదాపుగా కోవిడ్‌ను పోలి ఉన్నట్టు అక్కడ జరుగుతున్న ప్రచారం బట్టి తెలుస్తోంది. గుర్తు తెలియని నిమోనియా వైరస్ మూలాలను కనుగొనేందుకు వ్యాధి నియంత్రణ అథారిటీ వైరస్ విస్తరణపై పర్యవేక్షిస్తున్నట్టు తెలుస్తోంది. డిసెంబరులో అంటువ్యాధులతో బాధపడుతున్న వారి సంఖ్య భారీగా పెరిగిందని, కేసుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండడంతో ఆందోళన కలిగిస్తోంది.
మళ్లీ లాక్‌డౌన్ తప్పదా…
CHINA NEW VIRUS: చైనాలో మరో వైరస్ పుట్టిందంటూ ప్రపంచ వ్యాప్తంగా ప్రచారం సాగుతుండడంతో త్వరలో మళ్లీ లాక్ డౌన్ తప్పదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త వైరస్ ఎలాంటి ఉపద్రవాన్ని మిగిల్చితుందోనని జంకుతున్నారు. వైరస్ వ్యాప్తిపై ప్రపంచ దేశాలు ఓ కన్నేశాయి. పరిస్థితిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్నాయి.
వైరస్ లక్షణాలు
CHINA NEW VIRUS: చైనాలో కొత్త వైరస్ విస్తరించడంతో దాని లక్షణాలు ఎలా ఉంటాయోనని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా ఈ వైరస్ సోకినవారు తీవ్రంగా జలుబు, తీవ్ర జరంతో బాధపడతారు. నిరంతరంగా ముక్కు కారుతుంటుంది. ఐదేళ్లలోపు చిన్నారు, వృద్ధుల్లో వైరస్ ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశముంది. శ్వాస తీసుకోవడంతో తీవ్ర ఇబ్బందులు తలెత్తే అవకాశముంది. ఇది ప్రాణాంతకం కాకపోయినా, దీని ప్రభావం తీవ్రంగానే ఉంటుందనే ప్రచారం అక్కడి సోషల్ మీడియాలో జరిగినదాన్ని బట్టి తెలుస్తోంది. ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యుడిని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
[…] READ MORE: చైనాలో మరో కొత్త వైరస్ […]
[…] READ MORE: చైనాలో మరో కొత్త వైరస్ […]
[…] READ MORE: చైనాలో మరో కొత్త వైరస్ […]
[…] READ MORE: చైనాలో మరో కొత్త వైరస్ […]
[…] READ MORE: చైనాలో మరో కొత్త వైరస్ […]