CHIRANJEEVI :మెగాస్టార్ చిరంజీవికి చేతికి రక్తపు మరక… అవును మీరు చదివింది నిజమే. ఏమైందో ఏమో తెలియదు.. మోచేతి నుంచి ధారలా రక్తం కారుతోంది.. చేతి ఐదు వేళ్ల మీదుగా కింద పడుతోంది.. వెనకాల మొత్తం ఎరుపెక్కిన దృశ్యం… మెగాస్టార్ కచ్చితంగా ఏదో హత్య చేసి ఉంటాడు.. లేదా రౌడీలను చితకబాది ఉంటాడు.. అదీ కాకపోతే మరి చిరు చేయి రుధిరంతో ఎందుకు ఎరుపెక్కింది.. తర్వాత పరిస్థితి ఏంటి.. అసలు ఏం జరిగింది.. ఎందుకు ఆ రక్తం చిరు చేయి నుంచి కారుతోంది..
తెలియాలంటే బాస్ రాబోయే నెక్ట్స్ మూవీ వరకు ఆగాల్సిందే. మెగా ఫాన్స్‌కు బిగ్ గుడ్‌న్యూస్ చెబుతూ మూవీ మేకర్స్ మెగాస్టార్ కొత్త చిత్రం కొత్త కబర్లు చెప్పారు. ఓ వైపు చిరంజీవి విశ్వంభర విడుదల కాకముందే మరో చిత్రం విశేషాలను వెల్లడించడంలో మెగా ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. కొత్త చిత్రం విశేషాలు తెలియాలంటే..
SILKSMITHA: మళ్లీ రాబోతున్న సిల్క్‌స్మిత
చిరు నయా మూవీ ..
CHIRANJEEVI : పద్మవి భూషణ్ మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర మూవీ షూటింగ్ కంప్లీట్ చేసుకుని విడుదలకు ముస్తాబుతోంది. ఆ సినిమా కోసం ఫ్యాన్స్ కళ్లుకాయలు కాచేలా ఎదురుచూస్తున్న నేపథ్యంలో అభిమానులను ఫిదా చేస్తూ కొత్త సినిమా కబర్లును చెప్పడంతో వారు ఉబ్బితబ్బిబ్బి అవుతున్నారు. బాస్ తర్వాతి సినిమా ఏం చేస్తారా అన్న సందిగ్ధంలో ఉన్నవారికి ఆ ఆలోచనలకు బ్రేక్ వేస్తూ కొత్త సినిమా విషయం మూవీ మేకర్స్ అనౌన్స్ చేయడంతో ఖుష్ అవుతున్నారు. విశ్వంభర సోషియో ఫాంటసీ నేపథ్యంలో సాగే చిత్రం కావడంతో తర్వాతి మూవీ రాజకీయ నేపథ్యంలో ఉంటుందని, లేదంటే అడ్వెంచర్ బ్యాక్‌గ్రౌండ్ మూవీ ఉంటుందని భావించారు.
దసరా దర్శకుడికి మెగా ఆఫర్…
CHIRANJEEVI : చిరు కొత్త చిత్రం ఎవరితో చేస్తారన్న ఆశతో ఉన్న ఫ్యాన్స్‌కు చిరు షాక్ ఇస్తూ అప్ కమింగ్ యంగ్ డైరెక్టర్‌కు చాన్స్ ఇవ్వడంతో షాక్ అవుతున్నారు. నేచురల్ స్టార్ నాని నటించిన దసరా మూవీతో సక్సెస్ అందుకున్న యంగ్ దర్శకుడు శ్రీకాంత్ ఓదేలకు మెగాస్టార్‌ను డైరెక్షన్ చేసే చాన్స్ దక్కడంతో టాలీవుడ్ ఇండస్ట్రీ నెవ్వెరపోయింది. శ్రీకాంత్ చేసింది ఒక్క సినిమానే అయినా అతడిపై నమ్మకంతో దర్శకత్వ బాధ్యతలు అప్పగించారంటే కొత్త సినిమా ఏ రేంజ్లో ఉండి ఉంటుందోనని అప్పుడే చర్చలు సాగుతున్నాయి.
కొత్త మూవీ విశేషాలు..
దసరా ఫేం డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేల దర్శకత్వంలో వస్తున్న సినిమాకు నేచురల్ స్టార్ నాని సమర్పకులుగా వ్యవహరిస్తుండడం ఆసక్తిరేపుపోతోంది. ఎస్ఎల్వీ సినిమాస్ బ్యానర్‌పై చెరుకూరి సుధాకర్ నిర్మిస్తున్నారు. యునానమస్ ప్రొడక్షన్ పతాకంపై నాని సమర్పణలో యంగ్ డైరెక్టర్ శ్రీకాంత్ సినిమాని తెరకెక్కిస్తున్నాడు. చిరు కెరీర్లో మోస్ట్ వైలెంట్ మూవీగా తెరకెక్కిస్తున్నట్టు మేకర్స్ విడుదల చేసిన పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. ుహింసలోనే అతను శాంతిని వెతుక్కుంటాడు్ అంటూ ట్యాగ్‌లైన్ ఫాన్స్‌ను తెగ ఆకట్టుకుంటోంది. ఎస్ఎల్వీ సినిమాస్ సంస్థ ప్రస్తుతం నాని హీరోగా ఓ సినిమా తెరకెక్కుతుండగా, ఆ సినిమా పూర్తయ్యాక చిరు మూవీ పట్టాలు ఎక్కనుందని సినీ వర్గాల ద్వారా తెలిసింది.
నాని ఆసక్తికర వ్యాఖ్యలు…
తన సమర్పణలో చిరు(CHIRANJEEVI )సినిమా రావడం వరంలా భావిస్తున్నానంటూ సినీ హీరో నాని ఆనందం వ్యక్తం చేశారు. చిరంజీవి సినిమా కోసం గంటల తరబడి క్యూ లైన్లో నిలబడ్డానని అదే సమయంలో తన సైకిల్‌ను పోగొట్టుకున్నానని, అలాంటిది చిరూ సినిమాకే ఇలాంటి అవకాశం దక్కడం ఆనందంగా ఉందని పేర్కొన్నారు. భూమి గుండ్రంగా ఉంటుందంటారు. ఇదే అది ఏమో(సైకిల్‌ను గుర్తు చేస్తూ) అంటూ వెల్లండిచారు. చిరును ఈ మూవీలో సరికొత్తగా, కొత్త బాస్‌ను చూస్తారంటూ ఊరించారు.
ఇది చదవండి: భూకంప కలకలం
Warangal Danger Zone: వరంగల్‌కు పొంచి ఉన్న ముప్పు