CM GOOD NEWS : ఆరు గ్యారెంటీల అమలుకు రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల గుడువు ముంచుకొస్తున్న వేళ ఒక్కటిగా హామీలను నెరవేరుస్తూ వస్తోంది. ఇప్పటికే ఇందిరమ్మ ఇళ్ల సర్వేను చేపట్టింది. అదికూడా పూర్తికావచ్చింది. అలాగే సంక్షేమ పథకాలకు చకచకా నిధులను విడుదల చేస్తోంది. ప్రస్తుతం చేనేత కార్మికులపై సర్కారు నజర్ పెట్టింది. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న కార్మికులకు అండగా నిలిచేందుకు రెడీ అయింది. ఇందులో భాగంగా కార్మికుల రుణాన్ని మాఫీ చేసేందుకు సన్నాలు చేస్తోంది. ఇప్పటికే జిల్లాల వారీగా రుణాలు పొందినవారి వివరాలు సేకరిస్తోంది. అంతేకాదు… ఏ జిల్లాలో ఎంతెంత రుణం బాకీ ఉందో తెలుసుకేందుకు సమాయత్తమైంది. రుణాలను మాఫీ సేందుకు ప్రణాళిక రూపొందిస్తున్నట్టు సమాచారం.
బీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేయగా..
CM GOOD NEWS : 2017లో గత బీఆర్ఎస్ ప్రభుత్వం మాఫీ చేయగా తాజాగా 2017 తర్వాత తీసుకున్న రుణాలను కూడా సైతం మాఫీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం భావిస్తోంది. ఎన్నికల ముందు కూడా రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఆ హామీలో భాగంగా ప్రక్రియను అధికారులు పూర్తి చేస్తున్నారు. సీఎం రేవంత్రెడ్డి ఆదేశాలతో చేనేత, జౌళి శాఖ అధికారులు జిల్లాల వారీగా రుణాలు పొందిన చేనేత కార్మికులు, రుణ మొత్తం ఎంత అన్న వివరాలను సేకరించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గతంలో 2010 నుంచి 2017 మార్చి వరకు తీసుకున్న చేనేత రుణాలను మాఫీ చేసింది. కాగా.. ప్రస్తుత ప్రభుత్వం 2017 ఏప్రిల్ నుంచి 2024 మార్చి వరకు తీసుకున్న రుణాలను మాఫీ చేయాలని నిర్ణయించింది.
చేనేత కార్మికుల్లో ఆనందం..
CM GOOD NEWS : రాష్ట్రవ్యాప్తంగా చేనేత కార్మికుల రుణమాఫీని చేస్తామని సీఎం రేవంత్రెడ్డి ఇటీవల ప్రకటించారు. జాతీయ చేనేత సాంకేతిక సంస్థ(ఎన్ఐహెచ్టీ) ప్రారంభోత్సవం సందర్భంగా సెప్టెంబరు 9న ఈ ప్రకటన చేశారు. కాగా.. సీఎం ప్రకటనతో అధికారులు రుణమాఫీపై కసరత్తును ప్రారంభించారు. ఫకొరవడిన అస్పష్టత
చేనేత రుణమాఫీపై నేత కార్మికుల్లో కొంత అస్పష్టత నెలకొంది. ప్రభుత్వం నుంచి ఇంకా ఎలాంటి మార్గదర్శకాలు మరియు జీవోలు విడుదల కాలేదు. దీంతో మాఫీకి ఎవరు అర్హులు, ఏ ప్రాతిపదికన మాఫీ చేస్తారన్న దానిపై చేనేత కార్మికుల్లో ఆందోళన నెలకొంది. సీఎం ప్రకటించిన మాఫీ నేపథ్యంలో మరమగ్గాల కార్మికుల రుణం కూడా మాఫీ అవుతుందా చూడాలి. 2017 ఏప్రిల్ తర్వాత రుణాలను తీసుకున్నవారిలో చాలామంది తిరిగి చెల్లించారు. దాంతో వారికి తిరిగి ఖాతాల్లో మాఫీ మొత్తాన్ని చెల్లిస్తుందా..లేదా చూడాలి.