-
రేపటి నుంచి ‘ఇందిరమ్మ ఇల్లు’ అమలు
-
భద్రాచలంలో ప్రారంభించనున్న సీఎం
ఎన్నికల వేళ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం దూకుడు పెంచుతోంది. ఆరు గ్యారెంటీలను ప్రకటించిన ప్రభుత్వంటి ఇప్పటికే మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, రూ.500 గ్యాస్ సిలిండర్ అమలు చేసింది. తాజాగా సోమవారం నుంచి మరో పథకాన్ని అమలు చేసేందుకు రంగం సిద్ధం చేసింది. సోమవారం నుంచి ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అమలు చేసేందుకు రెడీ అయింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భద్రాచలంలో అట్టహాసంగా ప్రారంభించనున్నారు.
ఎన్నికలు వేళ దూకుడు..
పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో తెలంగాణలో రేవంత్ రెడ్డి (Revanth Reddy:)ప్రభుత్వం మరింత దూకుడు పెంచింది. ఎన్నికల కోడ్ వచ్చే లోగా ఇందిరమ్మ ఇల్లు స్కీంను అమలు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. ఫలింతంగా ఎంపీ ఎన్నికల్లో లబ్ధిపొందవచ్చని భావిస్తోంది. ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే ఇప్పటికే పలు స్కీంలను ప్రభుత్వం అమలు చేస్తోంది.
===================
ఎక్కువగా చదివినవి:
* కేజ్రివాల్‌పై మరక.. ఎందుకు దారి తప్పాడో?
*వరంగల్ ఎంపీ సీటుపై కాంగ్రెస్ – సీపీఐ మల్లగుల్లాలు
* తెలంగాణ మాజీ గవర్నర్ పోటీపై ఆసక్తి
* బీజేపీ దేశంలో 400 సీట్లు సాధించడం సాధ్యమేనా?
* ఐపీఎల్ లో ఒక్కసారి కూడా టైటిల్ సాధించని జట్లు ఇన్నా..