Cococa: సంప్రదాయ సాగు విధానానికి స్వస్తి పలికి.. కొత్త తరహా పంటలతో కొందరు రైతులు లాభాల పంట పండిస్తున్నారు. ఇండియాలో ఎక్కువగా పండేవి వరి, గోధుమ, మొక్కజొన్న, పత్తి, మిర్చి.. ఇలా అనాదిగా వస్తున్న సాగు పంటలే అధికం. ప్రపంచంలో డిమాండ్‌ ఉన్న పంటలు పండించడం తక్కువే. ఈక్రమంలో ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్‌ ఉన్న పంటల్ని సాగు చేస్తూ తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి ఖమ్మం జిల్లా కోకో పంటను పండిస్తూ అధిక ఆదాయం పొందుతున్నారు. ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఎక్కువగా కొబ్బరితోటలు, ఆయిల్‌పామ్‌లో అంతరపంటగా సాగుచేస్తున్నారు. చాక్లెట్ల తయారీలో విరివిగా ఉపయోగించే కోకో గింజలకు అంతర్జాతీయంగా డిమాండ్‌ రైతులు అంతర పంటగా సాగుచేస్తూ అదనపు ఆదాయం పొందుతున్నారు. భద్రాద్రి జిల్లా దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో సుమారు రూ.8వేల ఎకరాల్లో సాగవుతున్నట్టు అధికారులు అంచనా వేశారు. పంట ఐదేళ్లకు చేతికి వస్తే.. వందేళ్ల వరకు దాని ఫలాలు పొందవచ్చని సాగుదారులంటున్నారు.

కిలో రూ.750 పైమాటే..

లాభాల రుచి చూపించిన కోకో పంట వేసేందుకు రైతులు ఇప్పుడు ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. గడిచిన పదేళ్లలో ఎప్పడూ లేనట్టుగా కోకో(Cocoa) గింజలు ధర కిలో ఏకంగా రూ.750 పైనే పలుకుతోంది. గతంలో కిలో రూ.15 మాత్రమే ఉండేదని, గత ఏడాది కిలో రూ.500వరకు ఉంటే ఈసారి ఏకంగా రూ.750 చేరిందని కోకో సాగు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రానున్న రోజుల్లో కోకో గింజల ధర మరింత పెరిగే అవకాశముందని అధికారులు ఆశిస్తున్నారు. ఇప్పుడిప్పుడే కోకో సాగుపై అవగాహన పెరుతుండడంతో రానున్న రోజుల్లో మరింత డిమాండ్‌ ఉండే అవకాశముందని తెలుస్తోంది. వీటికి క్రయవిక్రయాలకు సంబంధించి రాష్ట్రంలో మార్కెట్‌ సదుపాయంలో లేకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటే ఈ ధర మరింత పెరిగే అవకాశముందని భావిస్తున్నారు. గతంలో కిలో కోకో గింజలకు రూ.150 మాత్రమే చెల్లించేవారు.

  • ఎందుకీ డిమాండ్‌..

కోకో చెట్లు ఎక్కువగా అమెజాన్‌ రెయిన్‌ ఫారెస్టు ప్రాంతాల్లో ఉన్నాయి. మెక్సికన్లు తేజాట్‌ అనే పానయంలో, మెసోఅమెరికన్‌ ఆహార పదార్థంగా తీసుకుంటారు. ప్రపంచవ్యాప్తంగా పండిన కోకో పంటలో ఒక్క పశ్చిమా ఆఫ్రికాలోనే 80శాతం పంట సాగడుతుండడం గమనార్హం. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఈ సాగుపై ఆసక్తి చూపుతున్నాయి. కోకో గింజలతో పౌడర్‌, బటర్‌కు కూడా చాలా డిమాండ్‌ ఉంది.

ఎక్కువ‌గా చ‌దివిన వారు:

దేశంలో కచ్చాతీవు దుమారం.. రగడ 

కేజ్రివాల్‌పై అవినీతి మ‌ర‌క‌..

బీజేపీ 400 ఎంసీ సీట్లు సాధిస్తుందా..

వంద రోజులో బీఆర్ ఎస్ సీన్ రివ‌ర్్స

అబ్బుర ప‌రిచే వేయిస్తంభాల గుడి

 

 

2 thought on “Cocoa/వామ్మో.. కోకో.. శభాష్‌ ఖమ్మం రైతులు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *