HEMAMALINY: డ్రీమ్‌ గర్ల్‌, ఎంపీ హేమ మాలినీపై ఆమ్‌ ఆద్మీ పార్టీకి చెందిన ఎమ్మెల్యే నరేష్‌ బల్యాన్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తమ్‌ నగర్‌ రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా చేస్తానంటూ వ్యాఖ్యానించారు. ‘ఉత్తమ్‌ నగర్‌ రోడ్లను హేమ మాలినీ బుగ్గల్లా సన్నగా చేస్తాను’ అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దుమారం రేపుతున్నాయి. ఆప్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై బీజేపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ఢల్లీి బీజేపీ అధికార ప్రతినిధి ప్రవీణ్‌ శంకర్‌ కపూర్‌ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఆయన వ్యాఖ్యలు మహిళలను అగౌరవపరిచేలా, స్థానిక సమాజాన్ని అవమానించేలా ఉన్నాయన్నారు. ఓ మహిళను అగౌరవపరిచేలా మాట్లాడిన ఎమ్మెల్యేపై తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆప్‌ సుప్రిమో అరవింద్‌ కేజ్రీవాల్‌ను డిమాండ్‌ చేశారు. మరోవైపు ఆప్‌ ఎమ్మెల్యే వ్యాఖ్యలపై పలువురు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. కాగా, రాజకీయ నేతలు హేమ మాలినీపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇదేమీ తొలిసారి కాదు. గతంలో మహారాష్ట్ర మంత్రి ఒకరు ఇలాంటి వ్యాఖ్యలే చేశారు. జల్గావ్‌ జిల్లాలోని తన నియోజకవర్గంలో రోడ్లను ప్రముఖ నటి హేమ మాలినీ బుగ్గలతో పోల్చారు. ఆ రోడ్లను ఎంత బాగా అభివృద్ధి చేశానో విపక్ష నేతలు వచ్చి చూడాలని సవాల్‌ విసిరారు. అవి హేమ మాలినీ బుగ్గల్లా నున్నగా ఉన్నాయంటూ వ్యాఖ్యానించారు.

 

–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్‌ చేసి చదవండి–

ఒలింపిక్ కు ఇండియా స‌న్నాహాలు

వంద రేప్‌లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..

టీడీపీ- జ‌న‌సేన మ‌ధ్య ముదిరిన వార్‌

మ‌న మెద‌డు పెరుగుతోంది.. లాభ‌మా .. న‌ష్ట‌మా..

తెలుగు వారిని అంత మాటంటావా.. న‌టి కస్తూరిపై ఫైర్‌

మ‌బ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచార‌ణం

ఇంటింటి స‌ర్వే డేటా భ‌ద్ర‌మేనా.. అసాంఘిక శ‌క్తుల చేతిలోకి వెళ్తే..

కేదార్‌నాథ్ ఆల‌యం మూసివేత‌..ఎప్పుడు.. ఎందుకంటే..

విస్త‌రిస్తున్న షుగ‌ర్ డాడీ.. ఆ ప‌నికోస‌మేనా..

మహేష్‌ బాబు కోసం రాజమౌళి వెతుకులాట

రికార్డు సృష్టించిన అయోధ్య

న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్‌

దొరికిన కుంభకర్ణుడి ఖడ్గం

రామగుండం కొత్త చరిత్ర

బీజేపీలో ముస‌లం.. నెక్ట్స్ బాస్ ఎవ‌రంటే..?

మెడిక‌ల్ వార్‌: ఆయుర్వేదం వ‌ర్సెస్ అలోప‌తి

ప‌డిపోతున్న ఇండియా గ్రాఫ్‌.. కానీ..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *