CYBER CRIME: ఏహే.. ఏమైతది.. ఇలాంటివి ఎన్ని కాల్స్ రాలేదు.. ఏమైనా అయిందా.. అలాగే అంటారు.. అలానే మెసెజ్‌లు చేస్తారు.. అని ఈ నంబర్లు ఏమరపాటులో నిర్లక్ష్యంతో ఫోన్ ఎత్తారో ఇక మీ పని ఐపోయినట్టే. అపరిచిత నంబర్ల నుంచి ఫోన్ వస్తే అది ఎత్తితే మీరు చిక్కుల్లో పడినట్టేనని హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు హెచ్చరిస్తున్నారు. వివిఽధ కోడ్ నంబర్లతో వచ్చే కాల్స్‌ను ఎత్తవద్దని సూచిస్తున్నారు. అపరిచితుల నంబర్ల నుంచి ఫోన్ వస్తే ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోవాలని హితవు పలుకుతున్నారు. ముఖ్యంగా ఇంట్లో ఉండే మహిళలు, నిరక్ష్యరాస్యులు, వృద్ధులు, చిన్నారులు తెలియక ఫోన్ ఎత్తినా సైబర్(CYBER CRIME) నేరగాళ్ల ఉచ్చులో పడినట్టేనని పేర్కొంటున్నారు. ప్రతీ మొబైల్ దారులు అప్రమత్తంగా ఉండాలంటూ స్పష్టం చేస్తున్నారు. మేరకు కొన్న ఫోన్, కోడ్ నంబర్లను వారు విడుదల చేశారు. ముఖ్యంగా +56322553736, +37127913091, +255901130460, +94777455913, +3705252959 తదితర నంబర్లతో వచ్చే కాల్స్‌ను ఎట్టి పరిస్థితుల్లో ఎత్త వద్దని సైబర్ క్రైం పోలీసులు పేర్కొంటున్నారు. అలాగే +371(లాట్వియా) +381(సెర్బియా), +375(బలారస్), +370(లితువేనియా), +563(లోవా), +255(టాంజానియా) వంటి కోడ్ నంబర్లతో వచ్చే ఏ నంబరును కూడా రిసీవ్ చేసుకోవద్దని హెచ్చరిస్తున్నారు.
CYBER CRIME: ఒకవేళ ఈ నంబర్లను ఎత్తితే సైబర్ నేరగాళ్లు మొత్తం హ్యాంగ్ చేస్తారని చెబుతున్నారు. ఫోన్ రిసీవ్ చేసుకున్న సెన్లలోనే మీ బ్యాంక్ ఎకౌంట్, క్రెడిట్ కార్డు విరాలను తెలుసుకుని ఆన్ ద స్పాట్‌లోనే డబ్బులు గుంజేస్తారని పేర్కొంటున్నారు.
READ MORE: మీ సిమ్ కార్డు ఎవరెవరు వాడుతున్నారో చూసుకోండి.. లేదంటేనా..
# 90, #09 వంటి నంబర్లను నొక్కితే వెంటనే మీ సిమ్ కార్డు ను ఇతర యాక్సెస్ చేయడానికి అవకాశం ఇచ్చినట్టు అవుతుందని, దాంతో మీ ఖర్చులతో ఇతరు కాల్స్ చేసుకునే ప్రమాదముందని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఆ నంబర్లను వెరైనా నొక్కమని చెప్పినా వెంటనే అప్రమత్తమవ్వాలని హెచ్చరిస్తున్నారు. అలాగే అసాంఘిక శక్తులు తమపై కుట్రలు పన్నే అవకాశముందని స్పష్టం చేస్తున్నారు. ప్రతీ ఒక్కరు జాగ్రత్తలు వహిస్తూ సైబర్ నేరగాళ్లకు దూరంగా ఉండాలని, ఇటీవల సైబర్ నేరాలు భారీగా పెరిగాయని సూచిస్తున్నారు. వినియోగదారుల్లో సరైన అవగాహన లేకనే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని చెబుతున్నారు.
READ MORE: కచ్చతీవు దీవి పెనుదుమారం .. ఇండియా.. శ్రీలంక మధ్య రగడ
READ MORE : సీఎం ప్లాన్‌కు విపక్షాలు షాక్
CLICK : లేటెస్ట్ సమాచారం, రివ్యూస్, సినిమా, కాంట్రవర్సీల అప్డేట్ కావాలి..