Earthquake: తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర, చత్తీష్‌ఘడ్ రాష్ట్రాల్లో చాలా ప్రాంతాల్లో బుధవారం ఉదయం భూకంపం సంభవించడంతో స్థానికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. ఆయా ప్రాంతాల్లో సుమారు 2 నుంచి 7 నిమిషాల వరకు భూకంపం సంభవించింది. ఉదయం 7 నుంచి 7.16 గంటల ప్రాంతంలో కంపించింది. హైదరాబాద్ లాంటి పెద్ద పట్టణ వాసులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా అపార్ట్‌మెంట్ వాసులు ఏం జరుగుతుందోనని జంకుతున్నారు. పద్ద్దపెద్ద బిల్డింగ్‌లు ఉండడంతో ఏదైనా ప్రమాదం జరిగితే ఎలా అని భయపడుతున్నారు. 20ఏళ్ల తర్వాత రిక్కర్ స్కేల్‌పై 5.3గా రికార్డవడంతో ఆందోళన చెందుతున్నారు.
READ MORE: WARANGAL HILL: అద్భుతమైన దుర్గం.. ప్రత్యేకతలూ అనేకమే..
ములుగు జిల్లా కేంద్రంగా…
బుధవారం జరిగిన భూపంకం వరంగల్ ఉమ్మడి జిల్లాలోని ములుగు జిల్లా మేడారం కేంద్రంగా భూమి కంపించింది. ఇక్కడి రిక్కర్ స్కేల్‌పై 5.3గా నమోదైంది. భూమి కంపించిన ప్రాంతం నుంచి 225 కిలోమీటర్ల విస్తీర్ణం వరకు కంపించింది. ముఖ్యంగా గోదావరి పరీవాహక ప్రాంతంలో ఎక్కువగా దీని ప్రభావం ఏర్పడింది. సుమారు 40 కిలోమీటర్ల లోతు భూమిలో ప్రకంపనలు చోటుచేసుకున్నట్టు అధికారులు గుర్తించారు.
స్వల్పమే.. కానీ..
Earthquake: భూకంపం స్వల్పమే కంపించినా ప్రజల్లో మాత్రంలో జనం భయాందోళనలో ఉన్నారు. ఉదయమే భూమి కంపించడంతో చాలా మంది ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. అయితే మనది జోన్ 3 పరిధిలో ఉండడంతో పెద్దఎత్తున ప్రమాదం జరిగే అవకాశాలు తక్కువనేనని పేర్కొంటున్నారు. సాధారణంగా రిక్టర్ స్కేల్‌పై సాధారణంగా 2నుంచి 3 సెకండ్ల వరకు కంపించడం సహజనంగా జరుగుతుందని, గతంలోనూ ఇలా జరిగాయని పేర్కొంటున్నారు. అయితే ఇప్పడు 5.3 రిక్టర్‌స్కేల్‌పై నమోదవడం ప్రమాద సంకేతంగా భావిస్తున్నారు.
READ MORE: తిరుమల రహస్యాలు ఇవిగో.. స్వామి వారి మహిమ.. లేక..
నాడు వేలసంఖ్యలో చెట్లు ఊలినచోటే..
Earthquake: ములుగు జిల్లా మేడారం సమీపలో గత సెప్టెంబరు 4న ప్రకృతి విపత్తులో ఒకేసారి 70,000(70వేల) చెట్లు కుప్పకూలాయి. దీనికి అధికారులు ఇంకా పరిశోధనలు సాగుతున్నారు. ఒక్కసారిగా వేల సంఖ్యలో చెట్లు కూలడం మిస్టరీ వీడకముందే.. అదే ప్రాంతంలో బుధవారం ఉదయం గతంలో 2 నుంచి 3 సెకండ్లు కంపిస్తే ఇప్పడు 5.3గా నమోదవడంపై అధికారులు గుట్టువిప్పే పనిలో పడ్డారు. అదేప్రాంతలో భూకంపం రావడంపై ఆ ప్రాంతం గ్రామీణ ప్రాంతాల వాసులు జంకుతున్నారు. ముఖ్యంగా సింగరేణి పరీవాహక ప్రాంతంలో కంపించడంతో వారిలో మరింత భయం రేపుతోంది. ప్రస్తుతం సింగరేణి బ్లాసింగ్‌లు లేకపోయినా కంపించడం ఏంటని, ఇది అంత ఈజీగా తీసుకోదగినది కాదంటున్నారు. సింగరేణి బ్లాస్టింగ్ సమయంలో భూమి కంపించడం చూశామని, ఇప్పుడు మామూలు సమయంలో సంభవించడంతో భయపడుతున్నారు.
ప్రకృతికి ప్రకోపమా…
Earthquake: ప్రకృతి ప్రకోపం అంటూ గ్రామీణ ప్రాంతవాసులు జంకుతున్నారు. ఇటీవల కేరళలో కుంభవృష్టి, కొండ చెరియలు విరిగిపడడంతో వందలాది మంది మృతిచెందిన విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఇష్టారాజ్యంగా గుట్టల బ్లాస్లింగ్‌లు, సింగరేణి ఓపెన్ కాస్ట్ పేలుళ్లు, అలాగే మూడు నెలల క్రితం వేల సంఖ్యలో చెట్లు కూలిన చోటే మళ్లీ భూమి కంపించడం వారి భయానికి కారణవుతోంది. అకాల కుంభవృష్టి వర్షాలు, ఇటీవల కాలంలో గోదావరి ఉగ్రరూపం దాల్చడంతో ప్రకృతి ప్రకోపానికి కారణమంటూ పేర్కొంటున్నారు.
READ MOREA; మబ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారం..
READ MORE : షుగర్ డాడీ.. పల్లెలకు విస్తరించిన విష సంస్కృతి
[…] READ MORE: భూకంప కలకలం […]