FATHIMA SHIAK

FIRST INDIAN MUSLIM TEACHER:  నాటి కట్టుబాట్లను ఎదురించి, అనేక ఆర్థిక సమస్యల్ని ఎదుర్కొని పేదల, బడుగు, బలహీన వర్గాలకు విద్యాబోధన అందించిన మహనీయురాలు ఫాతిమా షేక్‌. ఆమె తొలి ముస్లిం ఉపాధ్యాయురాలు కావడం గమనార్హం. 19వ శతాబ్దంలో సంప్రదాయ అడ్డుగోడల్ని కూలగొట్టి బాలికల విద్య కోసం అహర్నిశలు కృషి చేశారు. భౌతిక దాడులు ఎన్ని జరిగినా వెన్నుచూపని వీరవనిత ఫాతిమా. సావిత్రీబాయి ఫూలే స్థాపించిన విద్యాయాల్లో తొలి విద్యార్థి ఫాతిమా కావడం విశేషం. సావిత్రిబాయి మరణంతో ఆమె విద్యాలయాలను ఫాతిమానే నిర్వహించారు. ఆధునిక భారతావనిలో ఆమె శ్రమకు తగిన గుర్తింపు దక్కలేదనే చెప్పారు. నేడు(జనవరి 9) ఫాతిమా జయంతి సందర్భంగా ఆమె సేవల్ని గుర్తు చేసుకుంటూ. ఆమె 191వ జయంతి సందర్భంగా 9 జనవరి 2022న, గూగుల్ ప్రత్యేకమైన డూడుల్(doodle)తో సన్మానించింది.

కుటుంబ నేపథ్యం..

FIRST INDIAN MUSLIM TEACHER:  ఫాతిమా షేక్‌ తల్లిదండ్రులు ఉత్తర ప్రదేశ్‌లో చేనేత వస్త్ర వ్యాపారం చేసేవారు. నిరుపేద కుటుంబానికి చెందిన వీరికి ఫాతిమా షేక్‌, ఉస్మాన్‌ షేక్‌ సంతానం. తర్వాత బతుకుదెరువు కోసం పొట్ట చేతపట్టుకుని పూణేకు వలస వెళ్లారు. ఫాతిమాషేక్‌ 1831లో ఉత్తరప్రదేశ్‌లో జనవరి 9న జన్మించారు. షాతిమా చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతిచెందారు. దాంతో షాతిమా, ఉస్మాన్‌లు పూణేలోని గంజిపేట్‌ ప్రాంతంలో ఉండే బంధువు మున్నిగఫార్‌ సంరక్షణలో వీరు పెరిగారు. కాగా, ఫాతిమా షేక్‌ 1900 అక్టోబరు 9న తుదిశ్వాస విడిచారు.

ఫూలే దంపతులకే ఆశ్రయం..

FIRST INDIAN MUSLIM TEACHER:  జ్యోతిరావుఫూలే, సావిత్రాబాయి ఫూలే దంపతులకు ఆశ్రయించిన మహనీయురాలు ఫాతిమ. మహారాష్ట్రలో బాలికలు, దళితులు, ఇతర కులాల వారికి విద్యాబోధన చేస్తున్నందుకు కక్ష కట్టిన స్థానికులు ఫూలే దంపతులను ఊరి నుంచి వెళ్ల గొట్టారు. ఆ సమయంలో ఫాతిమా బంధువు మున్ని గఫార్‌బేగ్‌ సాయంతో ఫాతిమను ఆశ్రయించారు. ఈక్రమంలో ఫాతిమా పూణేలోని తన నివాసంలో ఫాతిమా, ఉస్మాన్‌లు ఆశ్రయం కల్పించారు. అనంతరం వారు విద్యా సంస్థలను ఏర్పాటు చేసి నిరుపేదలకు విద్యాబోధన చేయడం గమనార్హం.

ఇంటినే బడిని చేసి…

FIRST INDIAN MUSLIM TEACHER:  ఫూణేలోని తన ఇంటినే ఫాతిమా, ఆమె సోదరుడు ఉస్మాన్‌లు బడిగా మార్చారు. తర్వాత పరిసర ప్రాంతాల్లో పలు పాఠశాలలు, వసతి గృహాలను ఏర్పాటు చేసి విద్యాబోధన సాగించారు. సావిత్రీబాయి ఫూలేతో మమేకమై అక్షర ఉద్యమంలో భాగస్వామ్యం అయ్యారు. బడుగు, బలహీన వర్గాలకు విద్యాబోధన చేశారు.

మరాఠీ నేర్చుకుని..
ఫాతిమాషేక్‌ మాతృ భాష హిందీ కాగా, తర్వాత ఉర్ధూను నేర్చుకున్నారు. అయితే మహారాష్ట్రలో చిన్నారులంతా మాఠాఠీ భాష మాత్రమే రావడంతో వారికి కోసం ఫాతిమా మరాఠీ నేర్చుకున్నారు. కాగా, మహారాష్ట్రలోని ఉర్దూ మీడియంలో ఫాతిమా షేక్‌ జీవిత చరిత్ర పాఠ్యాంశంగా చేర్చడం ఆమె సేవలకు దక్కిన గుర్తింపు.

ఉపాధ్యాయ శిక్షణ పొందిన తొలి ముస్లిం మహిళ

ఇండియాలో ప్రభుత్వ ఉపాధ్యాయ శిక్షణ పొందిన తొలి ముస్లిం మహిళగా ఫాతిమా షేక్‌ గుర్తింపు పొందారు. అహ్మద్‌ నగర్‌లోని మేడం సింధియా ఫెరారే మిషనర్‌ స్కూల్‌లో ఉపాధ్యాయ శిక్షణ తీసుకున్నారు. తర్వాత ప్రభుత్వ అధికారిక ఉపాధ్యాయ శిక్షణాలో ఉపాధ్యాయ వృత్తి విద్యా శిక్షణ పొందారు. తర్వాత ఉపాధ్యాయ వృత్తిని కొనసాస్తూ సావిత్రిబాయి ఫూలే మరణం తర్వాత ఆయా పాఠశాలల వ్యవహారాలను ఫాతిమానే చూసుకోవడం విశేషం. కాగా, 1856లో సావిత్రీ బాయి ఫూలే తన భర్తకు ఫాతిమా సేవల్ని వివరించారు. తర్వాతి కాలంలో ఆమె సేవల్ని కవులు, చరిత్రకారులు బ్యాహ్య ప్రపంచానికి చాటిచెప్పారు.

READ MORE: సావిత్రిబాయి ఫూలేకు భారతరత్న ఇవ్వాలి..

READ MORE: భారీ స్కాంలో టాప్‌ క్రికెటర్లు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *