hmvp virus

HMPV VIRUS JAPAN:  భయపడినట్టే చైనాలో పుట్టుకొచ్చిన కొత్త వైరస్‌ శరవేగంగా విస్తరిస్తోంది. హ్యూమన్‌ మెటానిమో వైరస్‌(హెచ్‌ఎంపీవీ) చైనాకే పరిమితమైనా తాజాగా జపాన్‌కు తాకడంతో కలకలం రేపుతోంది. పరిస్థితి చూస్తుంటే ఇండియాకు చేరుకోవడానికి పెద్దగా సమయం పట్టకపోవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. భారత ప్రభుత్వం అప్రమత్తమై వైరస్‌ వ్యాప్తిపై దృష్టిసారించింది. ప్రజలకు కూడా అప్రమత్తంగా ఉండాలంటూ సూచించింది. ఉత్తర చైనాలో వైరస్‌ బారినపడిన చైనీయులు పెద్ద సంఖ్యలో ఆస్పత్రుల బాటపడుతున్నారు.

జపాన్‌లో కలకలం…

HMPV VIRUS : చైనా నుంచి విస్తరించిన హ్యూమన్‌ మెటానిమో వైరస్‌(హెచ్‌ఎంపీవీ) ఇప్పుడు జపాన్‌ను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కరోనా వేళ అతలాకుతలమైన జపాన్‌ ఆ దుర్ఘటన నుంచి ఇంకా తేరుకోకముందే కొత్త వైరస్‌ బారినపడి విలవిల్లాడుతోంది. ఇప్పటికే జపాన్‌ వ్యాప్తంగా 7,01,800 హ్యూమన్‌ మెటానిమో వైరస్‌(హెచ్‌ఎంపీవీ) కేసులు నమోదైనట్టు బ్రాడ్‌ కాస్టింగ్‌ కార్పొరేషన్‌ స్వయంగా పేర్కొనడంతో అక్కడి ప్రస్తుత పరిస్థితికి అద్దం పడుతోంది. గత డిసెంబరు(2024)లోనే 94,259 కొత్త కేసులు నమోదైనట్టు పేర్కొంది. జపాన్‌ దేశం మొత్తంగా సుమారు ఐదువేల ఆస్పత్రుల్లో ప్రత్యేక వార్డులను ఏర్పాటు చేసినట్టు వెల్లడించింది. ఈ వైరస్‌ బారిన పడిన వారిలో అన్ని వయసుల వారు ఉండడంతో వారిని మరింత ఆందోళన గురిచేస్తోంది. అయితే పిల్లలు, వృద్ధులు పెద్ద సంఖ్యలో ఉన్నట్టు తెలుస్తోంది. హాంగన్‌లో ఎక్కవ కేసులు నమోదైనట్టు ప్రచారం సాగుతోంది

READ MORE: చైనాలో మ‌రో కొత్త వైర‌స్‌

వణికిపోతున్న ఆసియా దేశాలు..

హ్యూమన్‌ మెటానిమో వైరస్‌(హెచ్‌ఎంపీవీ) విస్తరణతో ఆసియా దేశాలు వణికిపోతున్నాయి. ఇప్పటికే చైనా తన మిత్ర దేశాలు, చైనా ప్రజలతో తత్సంబంధాలు కలిగిన దేశాలకు ముందస్తు హెచ్చరికలు జారీ చేసినట్టు తెలుస్తోంది. చైనా నుంచి జపాన్‌, హాంకాంగ్‌ వంటి దేశాలకు వైరస్‌ ఈపాటికే విస్తరించింది. చైనాలో ప్రస్తుతం హెల్త్‌ ఎమర్జన్సీ ప్రకటించినట్టు తెలుస్తోంది. అయితే వైరస్‌పై చైనా నిజాలు దాస్తోందని, కొవిడ్‌ సమయంలో అదే చేసిందే ఆరోపణలు ప్రపంచ వ్యాప్తంగా వినిపిస్తున్నాయి.

వచ్చే నెలలో ఇండియాలోకి…

వేగంగా విస్తరిస్తున్న హ్యూమన్‌ మెటానిమో వైరస్‌(హెచ్‌ఎంపీవీ) త్వరలోనే ఇండియాకు చేరే అవకాశముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈనెలారు లేదంటే ఫిబ్రవరిలో రావచ్చొనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. పరిస్థితిని అంచనా వేస్తూ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌(ఎంన్‌సీడీసీ) అంతర్జాతీయ సంస్థలతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరుపుతోంది.

ఎన్నో వైరస్‌ల మిళితం…

హ్యూమన్‌ మెటానిమో వైరస్‌(హెచ్‌ఎంపీవీ) అనేక వైరస్‌ల మిళితమని, అన్ని వైరస్‌ల లక్షణాలు ఒకేలా ఉండడంతో సమస్యలు వస్తున్నాయని వైద్యులు పేర్కొంటున్నారు. రినో వైరస్‌, రెస్పిరేటర్‌ సింస్టికల్‌ వైరస్‌, సీజనల్‌ ఇన్‌ఫ్లూయెంజీ, ఎంహెచ్‌పీవీ కేసులు పెరుగుతున్నాయి. పాలిమరి చేంజ్‌ రియాక్షన్‌ టెస్టు ద్వారా వైరస్‌ నిర్ధారణ చేసుకోవచ్చని వైద్యులు పేర్కొంటున్నారు.

 

 

2 thought on “HMPV : జ‌పాన్ లో వైర‌స్”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *