India: శాస్త్ర, సాంకేతిక రంగంలో దూసుకుపోతున్న భారత్‌ పేరువింటేనే చైనా ఉక్కిరిబిక్కిరి అవుతోంది. అంతరిక్ష రంగంలో విజయబావుటా ఎవరవేస్తుండడంతో చైనాకు మింగుడు పడడం లేదు. ఇప్పటికే చంద్రయాన్‌, ఆదిత్య ఎల్‌–1 తదితర ప్రయోగా సక్సెస్‌ అవడంతో ప్రపంచ వ్యాప్తంగా భారత్‌పై హర్షాతిరేకాలు వ్యక్తమవుతుండగా చైనాకు మాత్రం మింగుడు పడడం లేదు. చైనాకు ధీటుగా ఎదుగుతున్న తీరును చూసి డ్రాగన్‌ కంట్రీ ఖంగుతింటోంది.

 

చైనా మదిలో ఎంఐఆర్వీ గుబులు..

మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీ–ఎంట్రీ వెహికిల్‌(ఎంఐఆర్వీ) సాంకేతికత భారత భారత అమ్ముల పొదిలోకి చేరింది. అగ్ని–5 క్షిపణి ప్రయోగం ఇటీవల విజయవంతమైంది. ఒకే మిసైల్‌తోపాటు పలు వార్‌హెడ్‌లను ప్రయోగించి, వేర్వేరు లక్ష్యాలను ఏకకాలంలో ఛేదించవచ్చు. పూర్తిస్థాయిలో స్వదేశీ పరిజ్ఞానంతో.. ఆత్మ నిర్భర్‌ భారత్‌, ‘మిషన్‌ దివ్యాస్త్ర’లో భాగంగా డీఆర్‌డీవో రూపొందించిన ఈ సాంకేతికతలో వార్‌హెడ్లను గుర్తించడం శత్రుదేశాలకు దాదాపు అసాధ్యమే..! న్యూక్లియర్‌ వార్‌హెడ్స్‌ను మోసుకెళ్లగల అగ్ని–5 ఇంటర్మీడియట్‌ రేంజ్‌ బాలిస్టిక్‌ మిసైల్‌తో భారత్‌ ఇటీవల ఎంఐఆర్వీ సాంకేతికతను విజయవంతంగా పరీక్షించింది. ఈ పరిణామంతో చైనాకు కంటిమీద కునుకులేకుండా చేస్తోంది.

 

అగ్ని–5 క్షిపణి సక్సెస్‌తో..

‘మిషన్‌ దివ్యాస్త్ర’లో భాగంగా భారత్‌ ఎంఐఆర్వీ సాంకేతికతతో.. 5వేల నుంచి 5,800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే అగ్ని–5 క్షిపణి ప్రయోగం విజయవంతమవ్వడం యావత్‌ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది.ఎంఐఆర్వీ టెక్నాలజీ అంటే.. ఏకకాలంలో ఒకే క్షిపణి సాయంతో వేర్వేరు లక్ష్యాలను చేదించడం. బహుళ రీ–ఎంట్రీ వాహనాలను(వార్‌హెడ్‌లు) ప్రయోగించడం. ఇప్పటి వరకు ఎంఐఆర్వీ టెక్నాలజీ ఉన్న దేశాల జాబితాలో అమెరికా, బ్రిటన్‌, రష్యా, ఫ్రాన్స్‌, చైనా, పాకిస్థాన్‌ ఉన్నాయి. అగ్ని–5తో పరీక్షించిన ఎంఐఆర్వీ విజయవంతం అవ్వడంతో.. ఆ దేశాల సరసన భారత్‌ చేరింది. పాకిస్థాన్‌ 2017లో 2,200 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించే ‘అబాబీల్‌’ మీడియం రేంజ్‌ బాలిస్టిక్‌ క్షిపణిని ఎంఐఆర్వీ టెక్నాలజీతో పరీక్షించింది.

 

శత్రువులకు చిక్కడు.. దొరకడు..

ఇటీవల భారత్‌ విజయవంతంగా ప్రయోగించిన అగ్ని–5 క్షిపణి అన్ని క్షిపణులాంటి కాదని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. క్షిపణులను గుర్తించి గాల్లోనే ధ్వంసం చేసే సాంకేతికత చాలా దేశాలకు అందుబాటులో ఉంది. ఇటీవల ఇజ్రాయెల్‌ ఐరన్‌డోమ్‌ వ్యవస్థ ప్రపంచ వ్యప్తంగా చర్చకు దారితీసింది. ఎంఐఆర్వీ సాంకేతికతలో అలా ఇంటర్‌సెప్ట్‌ చేయడం దాదాపు అసాధ్యమే..! బాలిస్టిక్‌ క్షిపణులు లక్ష్యాన్ని చేరేముందు భూ వాతావరణాన్ని దాటి పైకి వెళ్తాయి. లక్ష్యాన్ని చేరడానికి తిరిగి భూ వాతావరణంలోకి రావడాన్ని రీ–ఎంట్రీ అంటారు. భారత్‌ అభివృద్ధి చేసిన ఎంఐఆర్వీలో.. క్షిపణి ప్రయోగం జరిగాక.. టార్గెట్లను నిర్దేశించిన వార్‌హెడ్‌లు భూవాతావరణంలోకి రీ–ఎంట్రీ అయితే.. వాటిని నిరోధించడం శత్రుదేశాలకు సాధ్యమయ్యే పనికాదని రక్షణ రంగ నిపుణులు చెబుతున్నారు. భారత ఎంఐఆర్వీలో అన్ని వార్‌హెడ్లకు గైడెడ్‌, కంట్రోలింగ్‌, ప్రత్యేక ప్రోగ్రామింగ్‌ వ్యవస్థలున్నాయి. కచ్చితత్వంతో లక్ష్యం చేరేలా సెన్సర్లున్నాయని చెబుతున్నారు. వార్‌హెడ్లు ఒక్కసారి రీ–ఎంట్రీ అయితే.. అత్యంత కచ్చితత్వంతో లక్ష్యాన్ని ఛేదిస్తాయి తెలుస్తోంది. ఈ వార్‌హెడ్‌లు ఏకకాలంలో వేర్వేరు లక్ష్యాలను ఛేదిస్తాయి. ఇందుకోసం అగ్ని–5లో బహుళ వార్‌హెడ్‌లను అమర్చేందుకు వీలుంటుంది. న్యూక్లియర్‌ వార్‌హెడ్లను కూడా ఎంఐఆర్వీలో తరలించవచ్చు.

 

చైనాకు ధీటుగా..

చైనాకు ధీటుగా భారత మరిన్ని ప్రయోగాలకు సిద్ధమవుతుందా అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి దీనికి కారణం లేకపోలేదు. బంగాళాఖాతం తీర ప్రాంతాల్లో నో ఫ్లైజోన్‌ను ప్రకటించడం దీనికి బలపరుస్తోంది. నోటీస్‌ టు ఎయిర్‌మెన్‌(నోటమ్‌) ప్రకటన చేసింది. ఓ ప్రాంతాన్ని నోటమ్‌గా ప్రకటిస్తే.. ఏక్షణంలోనైనా క్షిపణి ప్రయోగాలు జరపవచ్చని దాని అర్థమని నిపుణులు పేర్కొంటున్నారు. అగ్ని–5 ద్వారా ఎంఐఆర్వీని విజయవంతంగా పరీక్షించిన భారత్‌.. జలాంతర్గాముల ద్వారా ప్రయోగించడానికి రూపొందించిన అణ్వాయుధ సామర్థ్యం కలిగిన క్షిపణి కే–4ను పరీక్షించాలని యోచిస్తున్నట్లు శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. నోటమ్‌ ఫ్లైజోన్‌ కూడా బంగాళాఖాతానికి దక్షిణాన 3,500 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. కే–4 క్షిపణి పరిధి కూడా 3,500 కిలోమీటర్లు.

డ్రాగన్‌ కంట్రీకి దడదడ..

ఇటీవల కాలంలో చైనా హిందూ మహాసముద్రంపై నిఘా పెంచింది. గతంలో శ్రీలంక సముద్ర తీరంలో తన పరిశోధనా నౌక (జియాన్‌ యాంగ్‌హాంగ్‌–3)ను ఉంచిన చైనా, బంగాళాఖాతంలోనూ యాంగ్‌హాంగ్‌–01ను మోహరించింది. భారత్‌ క్షిపణి పరీక్షలకు సిద్ధమైన వేళ చైనా చర్యలు అనుమానాలకు తావిస్తున్నాయి. నోటమ్‌ను ప్రకటించగానే చైనా నౌక విశాఖ సముద్ర తీరంలో లంగరు వేయడం చర్చకు తావిస్తోంది. భారత నౌకాదళం ఆ నౌక కదలికలను నిశితంగా గమనిస్తున్నట్లు తెలిపింది.

మల్దీవులు, చైనా అక్కసు..

ఇటీవల భారత్‌పై మల్దీవుల దేశం చేసిన వ్యాఖ్యలతో.. ప్రధాని నరేంద్ర మోదీ లక్షద్వీప్‌లు పిలుస్తోందంటూ అక్కడి బీచ్‌ను సందర్శించి సందేశమిచ్చారు. దీంతో అత్యధికంగా మల్దీవులు వెళ్లే భారత పర్యటకుల ఆదేశం వెళ్లడం మానేశారు. మల్దీవులకు ప్రధాన ఆదాయవనరు భారత పర్యాటకులే కావడంతో ఒక్కసారిగా దివాలా తీసింది. ఆ తర్వాత కాస్త తగ్గినా తర్వాత ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్‌ మయిజ్జు మళ్లీ దూకుడు పెంచారు. దీనికి వెనకాల చైనా హస్తం ఉందనే ప్రచారం సాగుతోంది. చైనా అండతోనే మల్దీవుల ప్రెసిడెంట్‌ భారత్‌ను కవ్వించే చర్యలకు పాల్పడుతున్న మేధావులు అంచనా వేస్తున్నారు. ఇటీవల చైనాతో దోస్తీ కట్టీ అధునాత ఆయుధాల కొనుగోలుకు ఒప్పందం కుదిరినట్టు సమాచారం. భారత్‌పై మల్దీవులను ఎగదోసేందుకే చైనా ఆ దేశంతో దోస్తీ ఎత్తు వేసినట్టు స్పష్టమవుతోంది. అధునాత డ్రోన్లను సైతం ఆ దేశానికి అందించేందుకు చైనా ఒప్పందం చేసుకుంది. మునుముందును మల్దీవులు చైనా చెప్పుచేతుల్లో ఉండి ఏ స్థాయిలో ముందుకు వెళ్తుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *