INIDA- AMERICA: అమెరికా అధ్యక్షుడుగా ట్రంప్ రెండోసారి ఎన్నికై సంచలనం సృష్టించారు. ఆయన గెలుపునకు అనేక హామీలే కారణం. అందులో ప్రధానమైనది వలసవాదానికి చెక్ పెట్టడం ఒకటి. ఇప్పుడు ఇదే ఇండియాకు తలనొప్పిగా మారింది. ఇండియా అమెరికా మిత్ర దేశమైనప్పటికీ అక్కడి మారిన పరిస్థితులు ఇండియన్లను కలవర పెడుతోంది. దీనికీ కారణం లేకపోలేదు. అమెరికాకు వలస వెళ్తున్న వారిలో ఇండియా మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు ఇదే ఆందోళనకు కారణమవుతోంది. ట్రంప్ ఇండియాపై ఎలా సానుకూలంగా వ్యవహరిస్తా.. అదే జరిగితే భారత ప్రభుత్వం వ్యూహం ఏంటనే చర్చ సర్వత్రా ఇండియాలో చర్చనీయాంశమైంది. అమెరికా వెళ్లడం యువత ఓ డ్రీమ్ గా భావిస్తారు. ఇప్పటికే దేశ వ్యాప్తంగా వేలాది మంది అమెరికా వీసా కోసం దరఖస్తు చేసుకున్నారు. గ్రీన్ కార్డులు, హెచ్-1 వీసాలు, ఉద్యోగావకాశాలు వంటి వాటిపైనే ప్రధానంగా యువత దృష్టి సారిస్తోంది. ట్రంప్ రాకతో ఉద్యోగ భద్రత లేకుండా పోయిందనే ప్రచారం సాగుతోంది. ట్రంప్ ఏ రోజు ఏ నిర్ణయం తీసుకుంటారే.. ఉద్యోగులపై ఎలాంటి వేటు వేస్తారో అన్న భయం ఇండిన్లలో నెలకొంది.
భారత వ్యూహం ఏంటి…?
అమెరికా తాగా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌తో భారత ప్రధాని నరేంద్ర మోదీకి మధ్య మంచి సత్సంబంధాలు ఉన్నాయి. మోదీ ప్రత్యేక చొరవ తీసుకుని ట్రంప్‌తో సానుకూల చర్చలు సాగించాలని యువత కోరుతోంది. నరేంద్రమోదీ ప్రధాన మంత్రి అయ్యాకే విదేశాంగ విధానాలు ఇండియా స్టామినాను అంతర్జాతీయ మంచి గుర్తింపు తెచ్చిపెడుతున్నాయి. ఇప్పటికే ఇండియాను విశ్వగురువుగా చాటాలనే నినాదం ఆయనకు స్టామినాకు నిదర్శంగా నిలుస్తున్నాయి. పాకిస్తాన్, చైనా వంటి శత్రు దేశాలను కట్టడి చేయడంతో ఆయన దూకుడు విధానాలే కారణమని భావిస్తున్నారు. శత్రుదేశాలకు ఇండియా పపర్ను చూపిన వ్యక్తిగా మోదీ మంచి గుర్తింపు ఉంది. అదే చొరవతో ట్రంప్‌తో సత్సంబంధాలు కొనసాగించాలని కోరుతున్నారు. యువతకు ఎలాంటి ఇబ్బందులు ఎదురుకాకుండా చొరవ చూపాలని కోరుతున్నారు.
ట్రంప్ యూ టర్న్ అసాధ్యమేనా?
అగ్రరాజ్యం అమెరికాలో (INIDA- AMERICA) వలస వాదం తగ్గించాలని ఆ దేశంలో కొంతకాలంగా ఓ వాదం బలంగా వినిపిస్తోంది. రాజకీయాలు కూడా కొన్నళ్ల నుంచి అంశం చుట్టూనే తిరుగుతున్నాయి. అ ఇదే అంశం ట్రంప్ బలంగా వినిపించడంతో ఆయనకు అమెరికన్ల ఘనం విజయం అందించారు. ఈక్రమంలో ట్రంప్ వలసలపై యూ టర్న్ తీసుకుంటారని ఎవరూ భావించడం లేదు. అదే జరిగే ఇండియాకు పెద్ద ఎదురు దెబ్బ ఖాయమంటున్నారు అంతర్జాతీయ విశ్లేషకులు. ప్రపంచ దేశాలపైనా ఇదే ప్రభావంచూపుతుందంటున్నారు.
ఉద్యోగ కల్పనా ట్రంప్‌కు సవాలేనా..
ప్రజలకిచ్చిన వాగ్దానాలు పూర్తిచేయడంలో ఏ శక్తీ తనను ఆపజాలదని ట్రంప్ బలంగా వినిపిస్తున్నారు. అసలైన అమెరికన్లకు దేశంలో ఉద్యోగ అవకాశాలు దక్కకుండా పోతున్నాయనీ, అమెరికా ఉత్పత్తుల అమ్మకాలకు అన్నిచోట్ల అడ్డంకులు ఎదురవుతున్నాయన్నదే ట్రంప్‌ది ప్రధాన నినాదం. ఇంతకు ముందు ట్రంప్ తొలిసారి అధ్యక్షుడిగా ఎన్నికైనప్పుడు ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ట్రంప్ చెబుతు న్నట్లు అమెరికా ఎదుర్కొంటున్న ఈ సమస్యకు కారణం నాలుగు దశాబ్దాలుగా ఆ దేశ పాలకులు అనుసరించిన విధానాలేనని చెబుతున్నారు.
వలసను విస్మరిస్తే ట్రంప్‌కు చిక్కులు..
వలస వాదులను విస్మరిస్తే అమెరికా కు పెద్ద సమస్యను ఎదుర్కోవడం ఖాయమంటూ విశ్లేషకులు చెబుతున్నారు. ఆ దేశం మీద ఆధారపడ్డ ఇతర దేశాల వారిని చులకన చేయడం మంచిది కాదు. అన్ని దేశాల ఆర్థిక విధానాలను సరళీకరించి విదేశీ పెట్టుబడులకు ద్వారాలు తెరిచేలా చేసింది అమెరికా విధానకర్తలే. 1990ల నుంచి బాగా ఊపందుకున్న ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఒక దశ దాటిన తర్వాత అవసరమైన స్థాయిలో అమెరికన్ యువతకు ఉద్యోగాలను సృష్టించలేదు. ఈ రంగంలో కూడా చౌకగా లభ్యమయ్యే ఆసియా నిపుణులే ఎక్కువగా లబ్ది పొందారు. ఇటీవల వచ్చిన కృత్రిమ మేధో సాంకేతిక పరిజ్ఞానం కూడా ఊడిపోయే ఉద్యోగాలతో పోల్చితే సృష్టి అయ్యే ఉద్యోగాల సంఖ్య తక్కువే.
మోదీ చతురతమైనే ఆశలు..
–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్ చేసి చదవండి–
బైక్‌తో పనేంటి.. ఒక్కసారి చార్జ్ చేస్తే 312 కి.మీ. ఇచ్చే కారు..
సర్వే డేటా భద్రమేనా.. ప్రజలకు అనుమానాలు.. ముప్పు ఇదేనా..
వాటిని.. డ్రీమ్ గర్ల్ హేమామాలిని బుగ్గలుగా మారుస్తా..
వంద రేప్‌లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..
టీడీపీ- జనసేన మధ్య ముదిరిన వార్
మన మెదడు పెరుగుతోంది.. లాభమా .. నష్టమా..
తెలుగు వారిని అంత మాటంటావా.. నటి కస్తూరిపై ఫైర్
మబ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారణం
ఇంటింటి సర్వే డేటా భద్రమేనా.. అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తే..
కేదార్నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
బీజేపీలో ముసలం.. నెక్ట్స్ బాస్ ఎవరంటే..?
మెడికల్ వార్: ఆయుర్వేదం వర్సెస్ అలోపతి
పడిపోతున్న ఇండియా గ్రాఫ్.. కానీ..