INDIA LOSS TEST MATCH: ఇండియా, ఆస్ట్రేలియా మధ్య జరిగిన ఐదో టెస్టులో టీం ఇండియా ఘోర పరాభవాన్ని మూటగట్టుకుంది. ఈ ఓటమితో క్రికెట్ అభిమానుల్ని తీవ్ర నిరాశకు గురి చేసింది. ఐదు రోజుల ఆట కేవలం మూడు రోజుల్లో ముగియడంతో ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలాగే వారి ఆటపై మండి పడుతున్నారు. అంతేకాదు ఇదేం ఆట అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. టీ–20 మ్యాచుల్లోనే 250 పరుగులు అవలీలగా దాటుతున్నారు. కానీ రోజుల తరబడి జరిగే మ్యాచ్‌లో కనీసం 200 పరుగులు దాటేందుకు ఆపసోపాలు పడుతున్నారంటూ గరం గరం అవుతున్నారు.
- ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి టెస్టులో ఇండియా విజయం సాధించింది. ఆ తర్వాత అన్ని విభాగాల్లో విఫలమవుతూ వరస ఓటములు మూటగట్టుకుంది. రెండో మ్యాచ్ వరుణుడి దయ వల్ల టైగా మారింది. లేదంటే అదీ ఓడిపోయేదే. తొలి మ్యాచ్ ఓడినా అనూహ్యంగా పుంజుకున్న అసిస్ వరుసగా మూడు మ్యాచ్‌లను గెలిచి ఆధిపత్యాన్ని ప్రదర్శించింది.
బౌలింగ్.. బ్యాటింగ్‌లోనూ విఫలం..
LOSS MATCH: ఆస్ట్రేలియా టూర్‌కు వెళ్లిన టీం ఇండియా ప్రతిష్టాత్మకమైన బోర్డర్–గవాస్కర్ ట్రోఫీలో పాల్గొంది. ఐదు టెస్టు మ్యాచ్‌ల సీరిస్‌లో ఇండియా అటు బౌలింగ్, ఇటు బ్యాటింగ్‌లోనూ విఫలమైంది. అసిస్ బౌలర్లు వికెట్లు తీయడానికి పోటీ పడ్డారు. మనోళ్లు మాత్రం ఆపసోపాలు పడ్డారు. బ్యాటర్లదీ అదే దుస్థితి. ఒక్కో పరుగు తీయడానికి నానాతంటాలు పడ్డారు. ఒక్కమ్యాచ్‌లో ఇలా జరిగితే ఏమైనా అనుకోవచ్చు. కానీ ప్రతీ మ్యాచ్‌లోనూ ఇదే పరిస్థితి. సిరీస్ మొత్తంలో నితిష్ రెడ్డి మినహా ఒక్క బ్యాటర్ కూడా సెంటరీ చేయకపోవడం టీం ఇండియా బ్యాటింగ్ లైనప్ చెప్పనే చెప్పినట్టయింది. యశస్వీ జైస్వాల్, లాస్ట్ టెస్ట్‌లో రిషబ్‌పంత్ తప్ప చెప్పుకోదగిన బ్యాటింగ్ ఒక్కరంటే ఒక్కరూ చేయకపోవడంతో ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. అడపాదడపా నితిష్ రెడ్డి ఇన్నింగ్ కాస్త పరువును కాపాడినట్టయింది.
లైన్ తప్పిన బౌలింగ్..
INDIA LOSS TEST MATCH: ఇక ఈ సిరీస్‌లో ఒక్క బూమ్రా తప్ప ఏ ఒక్క బౌలర్‌లోనూ పస కనిపించలేదు. ఏదో గల్లీ క్రికెటర్‌లా బౌలింగ్ కనిపించింది. సిరాజ్ కూడా ఒక్కటంటే ఒక్క మ్యాచ్‌లోనూ ఆకట్టుకోలేదు. అన్ని మ్యాచ్‌లూ ఆస్ట్రేలియా బ్యాటర్లను తక్కువ స్కోర్‌కే పరిమితం చేయగలిగామంటే ఒక్క బూమ్రా చలవే. అతడూ విఫలం చెంది అంటే పరిస్థితి మరింత దారుణంగా ఉండేది.
బ్యాటర్ల చెత్త ఆట…
ఈ సిరీస్ నుంచి అవమానకర పరిస్థితిలో ఇండియా వెనుదిరిగింటే దానికి ప్రధాన కారణం బ్యాటర్లే. ఒక్కరంటే ఒక్కరు పరులు వరద పారించింది లేదు. పది పరుగులు చేయాలంటే ముప్పు తిప్పలు పడ్డారు. సీనియర్ ఆటగాళ్లు గల్లీ ఆటగాళ్లను తలపించారు. క్రీజ్‌లోకి ఇలా వెళ్లి అలా వచ్చారు. ముఖ్యంగా శుభ్‌మన్ గిల్, విరాట్, రోహిత్, జడేజా వరుసగా విఫలమయ్యారు. కేఎల్ రాహుల్, పంత్(ఒకటి, రెండు ఇన్నింగ్స్ మినహా) చేసిన తప్పులే మళ్లీ చేస్తూ ఓటమికి ముఖ్యకారుకులయ్యారు. టాప్ ఆర్డర్ బ్యాటర్లే విఫలమైతే ఇక మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ చేస్తుంది. వారూ అదే బాటపట్టారు.
డ్రెస్సింగ్ రూంలో ఏం జరుగుతోంది..
వైఫల్యాలకు డ్రెసింగ్ రూంలో ఆహ్లాదకర వాతావరణం లేకపోవమేని అభిమానులు భావిస్తున్నారు. గెలుపు కోసం ఏ ఒక్కరు పాటుపడిన దాఖాలు కనిపించలేదు. ఇందుకు డెస్సింగ్ రూం కారణమని తెలుస్తోంది. డ్రెసింగ్ రూంపై ఇటీవల మీడియాలో కథనాలు రావడంతో భవిష్యత్ ఆటపై అభిమానుల్లో కొత్త అనుమానాలను రేకెత్తిస్తోంది.
[…] READ MORE: అవమానకర ఓటమి […]