INDIAN OSCAR MOVIES

INDIAN OSCAR MOVIES: ప్రపంచ సినీ పరిశ్రమ ఆసక్తిగా ఎదురుచూసే అతిపెద్ద పండుగ అస్కార్‌ వేడుక. సినీ రంగానికి చెందిన అతిపెద్ద అవార్డు. 2025 సంవత్సరానికి గాను పోటీలు నిర్వహిస్తున్నారు.  97వ అకాడమీ అవార్డ్స్‌కు సంబంధంచిన జాబితా విడుదలైంది. ది అకాడమీ ఆఫ్‌ మోషన్‌ పిక్చర్స్‌ ఆర్ట్స్‌ అండ్‌ సైన్సెస్‌ తాజాగా విడుదల చేసింది. ఉత్తమ చిత్రం విభాగంలో 323 ప్రపంచవ్యాప్తంగా సినిమాలు పోటీ పడ్డాయి. వీటిలో కేవలం 207 సినిమాలు నామినేట్‌ అయ్యాయి. ఇండియా నుంచిఆరు సినిమాలు నామినేషన్స్‌ పొందడం విశేషం. బెంగాలీ చిత్రం ‘పుతుల్‌’, తమిళ చిత్రం ‘కంగువ’, హిందీ చిత్రం ‘స్వాతంత్య్ర వీర్‌ సావర్కర్‌’, ‘గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌’, మలయాళ చిత్రం ఆడుజీవితం (ది గోట్‌ లైఫ్‌) మరియు ‘ఆల్‌ వియ్‌ ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ నామినేట్‌ అవడం విశేషం. యూకే చిత్రం సంతోష్‌ అంతర్జాతీయ చిత్ర విభాగంలో నామినేషన్‌ దక్కింది. భారతీయ నేపథ్యం ఉన్న సినిమా. నామినేషన్‌  చిత్రాలకు 8 నుంచి 12వరకూ ఓటింగ్‌ నిర్వహిస్తారు. 17న తుది జాబితా, మార్చి 2న అవార్డుల ప్రదానోత్సవం ఉంటుంది.

కంగువ…

INDIAN OSCAR MOVIES:  తమిళ విలక్షణ నటుడు చియాన్‌ విక్రం నటించిన చిత్రం కంగువ. ఆదిమ తెగల మధ్య వెయ్యేళ్ల క్రితం జరిగిన యుద్ధాల నేపథ్యంలో ఈ సినిమా చిత్రం తెరకెక్కింది.  శివ దర్శకత్వం వహించగా, బాబీడియోల్‌, దిశాపటానీ, కీలకపాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. సినిమా నిడివి 154 నిమిషాలు.

ఆడుజీవితం :

మలయాళ చిత్రం ఆడుజీవితం(ది గోట్‌ లైఫ్‌) పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ కథానాయకుడిగా నటించిన సినిమా ఇది. ఏజెంట్ మోసంతో ఎడాది దేశంలో ప‌డుతున్న ఇబ్బందులు, స్వ‌దేశం రాలేక న‌ర‌క‌యాత‌ను క‌ళ్ల‌కు క‌ట్టారు.దర్శకత్వం బ్లెస్సీ వహించగా, ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిచాడు. అమలాపాల్‌, జిమ్మీజీన్‌ లూయిస్‌ ఇతర ప్రాతలు పోషించారు. నిడివి 173 నిమిషాలు.

స్వాతంత్య్ర వీర్‌ సావర్కర్‌ ..

స్వాతంత్య్ర వీర్‌ సావర్కర్‌ సినిమా స్వత్రంత్ర సమరయోధుడు వినాయక్‌ దామోదర్‌ సావర్కర్‌ బయోపిక్‌. రణ్‌దీప్‌ హుడా దర్శకత్వం వహిస్తూ టైటిల్‌ రోల్‌ పోషించారు. ఇతర పాత్రలో అంకిత లోకండే, అమిత్‌ సియల్‌లు నటించగా అనుమాలిక్‌, విపిన్‌ పట్‌వా సంగీతం అందించారు.నిడివి 178 నిమిషాలు.

ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌ :

ఇద్దరు కేరళ అమ్మాయిలు ఉపాధి కోసం ముంబైకి వెళ్తారు. అక్కడ నర్సులుగా పనిచేస్తూ తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు.  ‘ఆల్‌ వి ఇమాజిన్‌ యాజ్‌ లైట్‌’ సినిమాకి పాయల్‌ కపాడియా రచించి, దర్శకత్వం వహించారు. నిడివి 115 నిమిషాలు.

సంతోష్‌ ..

కేన్స్‌ ఫెస్టివల్‌లో అవార్డు పొందిన హిందీ సినిమా ‘సంతోష్‌’. షహనా గోస్వామి ప్రధాన పాత్ర పోషించారు. రూరల్‌ క్రైమ్‌ డ్రామాగా తెరకెక్కింది. సంధ్యా సూరి దర్శకత్వం వహించగా, కానిస్టేబుల్‌ పాత్రలో షహనా గోస్వామి నటించారు. లూసియా సంగీతం అందించారు. నిడివి 120 నిమిషాలు.

‘పుతుల్‌’ ..

నిర్లక్ష్యానికి, అక్రమ రవాణాకు గురవుతున్న అనాథల జీవితలపై రూపొందించిన తొలి బెంగాలీ చిత్రం ‘పుతుల్‌’. దర్శక నిర్మాతగా ఇందిరా ధర్‌కు ఇది తొలి చిత్రం కావడం విశేషం. తనుశ్రీ శంకర్‌, ముంతాజ్‌, సుజన్‌ముఖర్జి, కోనీనియా బెనర్జీ ముఖ్యపాత్రల పోషించారు.

‘గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌’.

INDIAN OSCAR MOVIES: అలీ ఫజల్‌, హీరోయిన్‌ రిచా చద్దా సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘గర్ల్స్‌ విల్‌ బీ గర్ల్స్‌’. మీరా అనే విద్యార్థిని జీవితంలో జరిగిన ఆసక్తికర సంఘటనల సమాహారంగా ఈ చిత్రం తెరకెక్కింది.

 

READ MORE: ఒక్క‌సారి చార్జింగ్ చేస్తే 312 కి.మీ. ఇక బైక్‌ల‌తో ప‌నేంటి.. 

READ MORE: విస్త‌రిస్తున్న షుగ‌ర్ డాడీ.. ఆ ప‌నికోస‌మేనా..

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *