TELANGALA : తెలంగాణలో ’రాజకీయ బాంబు’లు పేలుతున్నాయి. మాటల మంటలు అంటుకుంటున్నాయి. దక్షిణ కొరియా దేశం సియోల్‌ పర్యటనలో ఉన్న రాష్ట్ర సమాచార, రెవెన్యూ , గృహ నిర్మాణ శాఖా మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి దీపావళికి రెండు రోజుల ముందే రాష్ట్రంలో ప్రతిపక్షాలకు రాజకీయ బాంబులు పేలుతాయంటూ వ్యాఖ్యానించారు. ఈ మాటలు రాష్ట్రంలో రాజకీయ దుమారం రేపుతోంది. ఏమిటా బాంబులు అంటూ చర్చసాగుతోంది. ప్రతిపక్షాల పేరు ప్రస్తావించడంతో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై రేవంత్‌ సర్కారు చర్యలు తీసుకుంటుందా అన్న చర్చసాగుతోంది. ఇంతకి పొంగులేటి మాటల వెనుక మర్మం ఏమిటనే చర్చసాగుతోంది. ప్రతిపక్షాల ప్రధాన నాయకులపై అవినీతి ఫైళ్లు రెడీ అయ్యాయి.. సాక్ష్యాధారాలతో బయటపడనున్నాయి అంటూ పొంగులేటి మాటలు తాజాగా కాకరేపుతున్నాయి. ’కల్వకుంట్ల‘ అండ్‌ కో పై ఏమైనా కేసులు వేస్తారా అన్న చర్చసాగుతోంది. అసలు మంత్రి మనసులో ఏముందో అర్థంకాక ప్రతిపక్షాలు జుట్టుపీక్కుంటున్నాయి. ప్రతిపక్షాలు ఎవరికివారు తమ వెనుక ఏం జరుగుతుందో తమ అనుయాయుల ద్వారా వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైనట్టు సమాచారం.

కేసీఆర్‌ అరెస్టు ఖాయమా..

మంత్రి పొంగులేటి మాటల మర్మం ఏంటన్నది అర్థం కావడం లేదు. రేవంత్‌ సర్కారు ఏర్పడినప్పటి నుంచి కేసీఆర్‌ కుటుంబం టార్గెట్‌గా మాటల యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో కేసీఆర్‌ను వివిధ కేసుల్లో అయన్ను అరెస్ట్‌ చేసే అవకాశం ఉందా అన్న చర్చసాగుతోంది. అదే నిమజమైతే అయన్ను ఏ కేసులో అరెస్టు చేస్తారు.. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతిని ముందుపెడతారా తెలియడం లేదు. ఇటీవల కేంద్ర బృందాలతో పాటు చైనా బృందాలు కాళేశ్వరం(TELANGALA)ప్రాజెక్టు డిజైన్‌ మొత్తం కేసీఆర్‌దే అని అధికారులు తేల్చడంతో ఆదిశగా సర్కారు ఏమైనా దృష్టి బీబట్టిందా అన్నది తెలియడం లేదు. కాళేశ్వరం కేసు సుప్రీం కోర్టులో విచారణ సాగుతున్న విషయం తెలిసిందే.

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో..

ఎన్నికల ముందు బీఆర్‌ఎస్‌ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు పెను దామారం రేపిన విషయం తెలిసిందే. ఈ విషయంలో రేవంత్‌ రెడ్డి ప్రభుత్వం సీరియస్‌గానే ఉంది. బహుశా ఈ కేసును వేగిరం చేసి కేసీఆర్‌ అండ్‌ కో ను అరెస్టు దిశగా ఏమైనా అడుగులు వేస్తుందా అన్నది చూడాలి. ఈకేసులో ప్రధాన నిందితుడు ఎస్‌బీఐ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ హైదరాబాద్‌లో పోలీసులు అదుపులో ఉన్నాడని, అప్రూవర్‌గా మారినట్టు ప్రచారం సాగుతోంది. అదే నిజమైతే ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో బీఆర్‌ఎస్‌ కీలక నేతలు అరెస్టు ఖాయంగానే కనిపిస్తుంది. ఈ కేసులో ప్రభుత్వం ఏమైనా కీలక ఆధారాలు సేకరించిందా.. అందుకే మంత్రి శ్రీనివాస్‌ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

కేటీఆర్‌ మాటల అర్థం ఏమిటీ..

మంత్రి పొంగులేటి వ్యాఖ్యలకు ఎట్టకేలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే కె.తారకరామారావు(కేటీఆర్‌) స్పందించారు. మేం రియల్‌ బాంబులకే భయపడ లేదు ఉత్తుత్తి బాంబులకు భయపడతామా అంటూ వ్యాఖ్యానించారు. అంతేకాదు తాము అరెస్టులకు భయపడేది లేదని చెప్పడం వెనక మర్మం అరెస్టు తప్పదనే సంకేతాలు ఉన్నాయా అన్నది అర్థం కావడం లేదు. ఈ విషయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే టి.హరీష్‌ రావు మౌనం పాటించడం కూడా అరెస్టులు తప్పవనే సంకేతాలు పంపినట్టు అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *