PONGULETI: మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేలుస్తామన్న రాజకీయ బాంబు ఇదేనా.. కేటీఆర్ బావమరిది రేప్‌పార్టీ వ్యవహారం ఆయనకు ముందే తెలుసా.. ఇదికాకుండా మరేదైనా ఉందా.. ఇంతకు మంత్రి ఉద్దేశం ఏమై ఉంటుంది అన్న చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. తెలంగాణ రాష్ట్ర సమాచార, రెవెన్యూ, గృహనిర్మాణ శాఖా మంత్రి, ఖమ్మం ఎమ్మెల్యే పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించినట్టు దీపావళికి రెండు రోజుల ముందే రాజకీయ బాంబు పేలుతుందని పేర్కొనగా, అది జన్వాడ రేవ్ పార్టీయేనా అన్న చర్చ సాగుతోంది. ఇటీవల విదేశీ పర్యటనలో మంత్రి పొంగులేటి దీవాళికి ముందే రాష్ట్రంలో పొలిటికల్ బాంబ్ పేలనుందని, అన్ని ఆధారాలు తమవద్ద ఉన్నాయని సంచనల వ్యాఖ్యలు చేశారు. ప్రతిపక్షాల ప్రధాన నాయకుల అవినీతి ఫైల్ తమ వద్ద ఉందంటూ బాంబు పేల్చారు. అప్పటి నుంచి దీనిపై రాష్ట్రంలో ఆసక్తికర చర్చసాగుతోంది. మంత్రి మాటల పరమార్థం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అండ్ కో పై ఏదైనా చర్యలు తీసుకోబోతున్నారా అన్న కోణంలో గుసగుసలు వినిపించారు.
అది.. కేటీఆర్ బావమరిది రేవ్ పార్టీయేనా..
శంకర్‌పల్లి మండలం జన్వాడలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే కేటీఆర్ బావమరిది పాకాల రాజేంద్ర ప్రసాద్( రాజ్ పాకాల) ఫాం హౌస్‌లో శనివారం అర్ధరాత్రి రేప్ పార్టీ జరిగింది. దివాలీ దావత్ పేరుతో కేటీఆర్ బావమరిది రాజ్ ఈ పార్టీని నిర్వహించారు. పెద్ద ఎత్తున విదేశీ మద్యం, ఇతర రాష్ట్రాలకు చెందిన ఖరీదైన మద్యం సీసాలతోపాటు క్యాసినో కాయిన్స్, పేక ముక్కలు వంటివి పోలీసుల దాడిలో లభ్యమవడంతో సంచలనం సృష్టించింది. ఇందులో రాజ్ స్నేహితుడు మద్దూరి విజయ్ డ్రగ్ తీసుకున్నట్టు పోలీసులు చెబుతున్నారు. అయితే తన మాటలను వక్రీకరిస్తున్నారని విజయ్ పేర్కొంటున్నాడు. పోలీసులు రాజ్‌పై ఏ–1, విజయ్‌పై ఏ2 కేసు నమోదు చేశారు. కేటీఆర్ బామరిది రాజ్ హైదరాబాద్‌లో సాఫ్ట్‌వేర్ కంపెనీలు ఉండగా ఓ కంపెనీకి విజయ్ సీఈవోగా ఉన్నట్టు తెలుస్తోంది.
- ఇదిలాఉంటే.. రాజ్ తన ఫాం హౌస్‌లో తరచూ పార్టీలు చేసుకుంటారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే దీపావళి దావత్ పేరుతో రాజ్ తన సన్నిహితులు, స్నేహితుల కోసం పార్టీ అరేంజ్ చేసినట్టు తెలుస్తోంది. ఈ పార్టీ కోసం కొద్ది రోజుల నుంచే ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈనెల 26 నుంచి వ్తతరం రాజ్ పార్టీ వ్యవహారంపై సన్నిహితులకు మెజెస్‌లు పెడుతున్నట్లు తెలుస్తోంది. పార్టీ విషయం ముందే ఎవరైనా మంత్రి పొంగులేటికి లీక్ చేసి ఉంటారా.. వేరే ఇష్యూలు వ్యాఖ్యలు చేశారా అన్నది తేలాల్సి ఉంది. కాగా, మంత్రి చెప్పినట్టు పండుగకు రెండు రోజుల ముందే రాజకీయ బాంబు పేతుందని చెప్పారు.. అయితే మరో రెండు రోజుల ముందే ఈ ఇష్యూ వెలుగు చూసింది. అది ఇదేనేమో అన్న చర్చ తెలంగాణలో సహజంగానే సాగుతోంది.
కేటీఆర్ అందుకే వెళ్లలేదా..?
బామమరిది ఇచ్చే పార్టీకీ కేటీఆర్ ఎందుకు వెళ్లలేదనే చర్చ ఆసక్తిగామారింది. తన బావమరిది రేవ్ పార్టీ చేయలేదని, అది కేవలం తమ బంధువులకు దావత్ ఇచ్చాడని ఈ ఇష్యూ అనంతరం మీడియా ఎందుట పేర్కొన్నారు. మరి తన బావమరిది బంధువులకు వచ్చిన పార్టీలో కేటీఆర్ ఎందుకు పాల్గొనలేదన్నది అంతుచిక్కడం లేదు. ఈ పార్టీలో తను పాల్గొనలేదని, రాత్రి తన కుటుంబంతో ఇంట్లోనే ఉన్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. రేవ్ పార్టీ వ్యవహారం కేటీఆర్‌కు ముందే తెలుసా.. మంత్రి పొంగులేని వ్యాఖ్యలను దృష్టిలోని పార్టీ వెళ్లలేదా అన్న ప్రశ్న సహజంగానే తొలుస్తున్నది. ఏది నిజమామె అన్నది ముందుముందు తేలనుంది.