ADHIRE ABHI: ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్ ప్రోగ్రాం నుంచి ఎంతో మంది కమేడియన్‌లు వెండితెరపై వెలిగిపోతున్నారు. సుడిగాలి సుధీర్, గెటప్ శ్రీను, ఆటో రాంప్రసాద్, శకలక శంకర్, ధనాధన్ ధన్‌రాజ్ లాంటి వారు ఇప్పటికే హీరోలుగా తమ సత్తా నిరూపించుకున్నారు. రచ్చ రవి, చమ్మక్ చంద్ర, మహేష్, వంటివారు తమ ఇమేజ్‌ను అమాంతం పెంచుకున్నారు. రెష్మీ, అనసూయ, భాను, రీతు, సత్యవతి తదితరులు కూడా సినిమాలో తమదైన శైలిలో ఆకట్టుకుంటున్నారు. ఇప్పటికే రేష్మీ హీరోయిన్‌గా రాణించింది, అనసూయ ప్రముఖ పాత్రలో నటిస్తూ ప్రత్యేక గుర్తింపును పొంది, స్టార్ హీరోరున్ ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. అలాగే జబర్దస్త్ కమేడియన్‌లు కకొందరు డైరెక్టర్‌గాను రాణిస్తున్నారు. ఇప్పటికే వేణు బలగం సినిమాలో వండర్ క్రియేట్ చేశాడు. సినిమా థియేటర్‌లే వెలవెలబోతున్న ఈ రోజుల్లో ఏకంగా గ్రామగ్రామాల్లో ప్రత్యేక తెరలు ఏర్పాటుచేసి చిత్రాన్ని ప్రదర్శించారంటే వేణు దర్శకత్వ ప్రతిభను అర్థం చేసుకోవచ్చు. ఇటీవల రాకింగ్ రాకేష్ కేసీఆర్ పేరుతో సినిమాను నిర్మించి, దర్శకత్వం వహించారు. మరికొందరు దర్శకత్వం దిశగా కమేడియన్ అడుగులు వేసేందుకు సమాయత్తమవుతున్నారు.
డైరెక్టర్‌గా మారిన మరో కమేడియన్..
తాగాజా జబర్దస్త్ కమేడియన్ దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. ఇప్పటికే పలు చిత్రాల్లో విభిన్న పాత్రల్లో అలరించిన నటుడు ఓ వినూత్న కథనంతో మెగాఫోన్ పట్టుకున్నాడు. అతడే అదిరే అభి అలియాస్ అభినయకృష్ణ ఈశ్వర్ సినిమాలో వెండి తెరకు పరిచయమయ్యారు. ఇప్పటికే పలు చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జబర్దస్త్‌తో తానేంటో నిరూపించుకున్నాడు. ఇప్పుడు ఏకంగా దర్శకత్వం వహించే స్థాయికి చేరాడు.
మైథాలజీగా చిరంజీవ…
అదిరే అభి (ADHIRE ABHI) డైరెక్టర్‌గా మారి ఓ మైథాలజీ( పురాణశాస్త్రం) వెబ్ సిరిస్‌కు దర్శకత్వం వహిస్తున్నాడు. తెలుగు ఓటీటీలో అగ్రగామిగా నిలిచిన స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్‌కు చెందిన ఆహాలో చిరంజీవ సిరీస్ ప్రసారం కానుంది. ఓ విభిన్న కథనంతో అభి ఈ సిరీస్‌ను ఆసక్తిగా మలిచినట్టు తెలుస్తోంది. చిరంజీవ ఓ పురాణగాధగా వారు రిలీజ్ చేసిన పోస్టర్‌ను బట్టి తెలుస్తోంది. కాగా, చిరంజీవ పోస్టర్‌మాత్రం అదుర్స్ అంటూ అభిని అభినందిస్తున్నారు. ఈ సిరీస్ డిసెంబర్ ఆహాలో ప్రసారం కానుందని ప్రకటించారు. ఈ సిరీస్‌కు అభి కథ, దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు.ఎ.రాహుల్ యాదవ్, సుహాసిని రాహుల్ నిర్మిస్తునానరు. ఈ సిరీస్‌కు ఏచు రాజమణి మ్యూజిక్‌ను అందిస్తున్నారు.
ఆకట్టుకున్న పోస్టర్
అదిరే అభి దర్శకత్వం వహిస్తున్న చిరంజీవ పోస్టర్ ఆకట్టుకుంది. ఆకాశంలో భడభాగ్నిని చీల్చుకుంటే సూర్య తేజస్సుతో నందీశ్వరుడు వస్తుండగా, నడి రోడ్డుపై అర్ధరాత్రి ఓ యువకుడు శూన్యంపై ముందు నిలుచున్న దృశ్యం అభి ఫ్యాన్స్‌ను ఫిదా చేస్తోంది. డిసెంబర్ నుంచి స్ర్టీమింగ్ అయ్యే ఈ సిరీస్ ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి.
అభి మల్టీ టాలెంట్..
తెలంగాణ రాష్ట్రం, కామారెడ్డిలో జన్మించిన అభి డెలాయిట్ ఎయిర్స్ ఇండియా (సాప్ సెక్యూరిటీ కన్సల్టెంట్) లో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. కొరియోగ్రాఫర్, ఇమిటేషన్ డాన్సర్ రవీంద్రభారతిలో ప్రదర్శనలు ఇచ్చారు. సినిమాపై ఉన్న మక్కువతో అవకాశాల కోసం ఎదురుచూశారు. ఈ క్రమంలోనే ప్రముఖ డైరెక్టర్ జయంత్ సి పరాన్జీ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్‌ను పరిచయం చేస్తూ తీసిన ఈశ్వర్ చిత్రంతో అభి వెండితెరపై అడుగు పెట్టాడు. ప్రభాస్ స్నేహితుడిగా ఇందులోకనిపించారు. కలేనియల్ కజిన్స్ లెజ్ లూయిస్, ఇండి పాప్ సింగర్ అనామిక, ఎం.ఎంశ్రీలేఖ, సంగం సినిమా అవార్డులు వంటి కార్యక్రమాలలో (భారతదేశంలోనే కాకుండా షార్జా, సింగపూర్ వంటి దేశాలలో) దాదాపు 1500 ప్రదర్శనలు ఇచ్చాడు.
–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్ చేసి చదవండి–
వాటిని.. డ్రీమ్ గర్ల్ హేమామాలిని బుగ్గలుగా మారుస్తా..
వంద రేప్‌లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..
టీడీపీ- జనసేన మధ్య ముదిరిన వార్
మన మెదడు పెరుగుతోంది.. లాభమా .. నష్టమా..
తెలుగు వారిని అంత మాటంటావా.. నటి కస్తూరిపై ఫైర్
మబ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారణం
ఇంటింటి సర్వే డేటా భద్రమేనా.. అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తే..
కేదార్‌నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
బీజేపీలో ముసలం.. నెక్ట్స్ బాస్ ఎవరంటే..?
మెడికల్ వార్: ఆయుర్వేదం వర్సెస్ అలోపతి
పడిపోతున్న ఇండియా గ్రాఫ్.. కానీ..