Janasena Party : కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా మారింది ఆంధ్రప్రదేశ్‌లోని జనసేన పార్టీ పరిస్థితి. ఇన్నాళ్లు బీరాలు పలికిన పార్టీ అధినేత, సినీ హీరో పవర్‌స్టార్ పవన్ కల్యాణ్ రాజకీయ ఎత్తుగడ ఫలించలేదని అర్థమవుతోంది. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపిన జనసేన పార్టీ ఊహించిన స్థాయిలో సీట్లను రాబట్టుకోవడంలో విఫలమైనట్టు స్పష్టమవుతోంది. అసలు పవన్ కల్యాణ్ ఏ కోణంలో ఈ పంపకాలకు సై అన్నారో అర్థం కాక జనసేనానులు తలలు పట్టుకుంటున్నారు. ఏపీలో మొత్తం 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ స్థానాలు ఉన్నాయి. బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులో భాగంగా బీజేపీ, జనసేన పార్టీలకు 31 అసెంబ్లీ, ఎనిమిది ఎంపీ స్థానాలను కేటాయించారు. దీంతో జనసేనకు దక్కింది కేవలం 21 అసెంబ్లీ, రెండు ఎంపీ స్థానాలు మాత్రమే. బోటాబోటి సీట్లతో పవన్ అనుకున్న లక్ష్యం ఏ మేరకు సాధిస్తారనే చర్చ సాగుతోంది.
భయమా.. వ్యూహమా..
జనసేన అధినేత పవన్‌కల్యాణ్ (Pawan kalyan) ఇంత తక్కువ సీట్లకు ఒప్పుకోవడానికి భయమా.. లేక వ్యూహమా అన్నది అర్థం కావడం లేదు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ పార్టీ(జనసేన) కేవలం ఒకేఒక్క చోట గెలిచింది. కనీసం పవన్ కల్యాణ్ కూడా ఓటమి చవిచూశారు. దీంతో పార్టీ క్యాడర్ నైరాశ్యంలోకి వెళ్లింది. ఒకదశలో పవన్ కల్యాణ్ మళ్లీ సినిమాలవైపు వెళ్లడంతో పార్టీని కొనసాగిస్తారా? లేక ఏదైనా పార్టీలో విలీనం చేస్తారా అన్న చర్చసాగింది. కానీ అనూహ్యంగా పవన్ రాజకీయాల వైపు మొగ్గుచూపారు. నిత్య ప్రజల్లో ఉంటూ పార్టీని ప్రజల్లో తీసుకెళ్లడంలో ఎట్టకేలకు సఫలం అయ్యారమే చెప్పవచ్చు. కానీ పొత్తలో ఉన్న సీట్లను చూస్తేపవన్‌ను ఏం ప్రభావితం చేశాయో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఒంటరి పోరాటం చేస్తే గతంలో మాదిరిగా ఫలితాలు వస్తే ఏంటనే భయంతోనే పొత్తులో తక్కువ సీట్లు వచ్చినా ఓకే చెప్పినట్టు ఆంధ్ర నాట ప్రచారం సాగుతోంది. ఈవిషయాన్ని కూడా కొట్టిపారేయలేని పరిస్థితి. మరోవైపు ఇప్పటికే తన ఆస్తులను అమ్మకానికి పెట్టినట్టు స్వయంగా పవనే చెప్పారు. ఇప్పటికే తన స్థిరాన్ని అమ్మినట్టు పేర్కొన్నారు. ఎన్నికల బరిలో నిలవాలంటే వేలకోట్లు అవసరం. అంత డబ్బులు లేకనే వెనుకడుగు వేశారా తెలియడం లేదు. ఇవే కారణాలా.. లేక భవిష్యత్తులో పవన్‌కు బీజేపీ ఏమైనా గట్టి హామీ ఇచ్చిందా.. అందుకే వ్యూహాత్మకంగానే పంపకాలకు ఒప్పుకున్నారా అన్నది మునుముందు తెలియనుంది.
బీజేపీ, టీడీపీలో ఎత్తులో చిత్తయ్యారా..
బీజేపీ ఢిల్లీ రాజకీయాలు, రాజకీయ ఎత్తుగడలో ఉద్దండుడైన టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు వ్యూహంలో పవన్ కల్యాణ్ చిత్తు అయ్యారా అంటే అవుననే రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అసలే రాజకీయ అనుభవం లేని పవన్ రాజకీయ చదరంగంలో బీజేపీ, టీడీపీ చేతిలో పావులా మారారని వారు భావిస్తున్నారు. చంద్రబాబు నాయుడు స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టు అయిన సందర్భంగా వపన్ కల్యాణ్ నేరుగా చంద్రబాబును జైలులో కలిసి బయటకు రాగానే మీడియా సమావేశంలో టీడీపీతో కలిసి పనిచేస్తామని ప్రకటించారు. ఈ హఠాత్పరిణామంతో అటు జనసే, ఇటు టీడీపీ శ్రేణులు హతాశులయ్యారు. పవన్ ఏ వ్యూహంతో ఈ ప్రకటన చేశారో అన్న విషయం తెలియక తికమకపడ్డారు. ఇన్నాళ్లు టీడీపీపై మాటలయుద్ధం చేసిన తమ నాయకుడు ఒక్కసారిగా ఇలా మార్చడంతో ఖంగుతిన్నారు. అటు టీడీపీలోనూ ఇదే చర్చసాగింది. సీనియర్ నాయకులు సైతం అసలు ఏం జరుగుతుందో అర్థంకాలేదు.
జనసేన (Janasena Party) ముందున్న సవాళ్లు..
- 21 అసెంబ్లీ, 2 ఎంపీ సీట్లలో అన్ని సీట్లు గెలుస్తా పవన్ కల్యాణ్ కీలకంగా మారే అవకాశముంది. సీట్లు ఏమాత్రం తగ్గిన జరిగే పరిణామలు వేరు..
- కూటమి అధికారంలోకి వచ్చాక తగిన ప్రాధాన్యం ఉండకుంటే ఏంటి పరిస్థితి.
- అధికారంలోకి వచ్చాక జనసేన నేతల్ని టీడీపీ తమ వైపు తిప్పుకుంటే తర్వాతి వ్యూహం ఏమిటి..
- ఎన్నికల్లో కూటమికి మ్యాజిక్ ఫిగర్ సీట్లు గెలువకుంటే ఎక్కువ నష్ట పోయేది జనసేనే.
- అప్పుడు కూటమి నుంచి బయటకు వస్తే ప్రజల్లో నమ్మకం ఉంటుందా.
- రెండు సీట్లకు రెండు ఎంపీ సీట్లు జనసేన గెలిస్తే ఒకే.. లేదంటే బీజేపీ మళ్లీ అదే స్నేహ హస్తం అందిస్తుందా..
[…] […]
[…] […]