Kachatheevu/ దేశంలో ఎన్నికల వేళ తమిళనాడులోని కచ్చతీవు దీవి పెనుదుమారం రేపుతోంది. రోజుకో మలుపుతో కేంద్రం, తమిళనాడు రాష్ట్రం దాటి ఇండియా.. శ్రీలంక మధ్య రగడకు దారితీస్తోంది. కచ్చతీవును రాజకీయ పార్టీలు తమ ప్రచార అస్త్రంగా మలుచుకోవడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇప్పటివరకు అడపాదడపా కచ్చతీవు సమస్య వెలుగులోకి వచ్చినా.. ఇటీవల బీజేపీ, తమిళనాడులో కాంగ్రెస్, డీఎంకేల పోటాపోటీ వ్యాఖ్యలతో అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. ఈ సున్నిత అంశం కాస్త శ్రీలంకతో వైరానికి దారితీసే పరిస్థితి కనిపిస్తోంది. దేశంలో కచ్చతీవు అంశం రచ్చకెక్కడంతో ఈ ఇతర దేశాలు అసలు ఏం జరుగుతుందోనని గమనిస్తున్నాయి. ముఖ్యంగా చైనా ఈ వైరాన్ని తనకు అనుకూలంగా మలుచుకునేందుకు కుట్ర పన్నుతోంది.
కచ్చతీవు కథేంటి..
కచ్చతీవు/ కచ్చదీవు ఇండియా– శ్రీలంక దేశాల మధ్య 285 ఎకరాల్లో ఉన్న ఓ చిన్నదీవి. సుమారు 14వ శతాబ్దంలో అగ్నిపర్వతం విస్పోటనంతో ఏర్పడింది. మధ్య సముద్రాన్ని మూడు సెక్టార్లుగా విభజించి రామేశ్వరం(ఇండియా) తలైమన్నార్(శ్రీలంక) ఆడమ్స్ బ్రిడ్జి (పాకిస్తాన్)గా ఏర్పాటయ్యాయి. రామేశ్వరానికి 11 నాటికల్ మైళ్ల దూరంలో.. తలైమన్నార్‌కు 18 నాటికల్ మైళ్ల దూరంలో ఉంది. ప్రస్తుతం ఇక్కడ జనం నివసించడం లేదు. కానీ ఓ పురాతన చర్చి ఉంది. ప్రస్తుతం ఇక్కడ జరిగే ఉత్సవాలకు ఇండియా, శ్రీలంకకు చెందిన క్రైస్తవులు వస్తుంటారు. బ్రిటిష్ పాలనలో ఇండియా, శ్రీలంక సంయుక్తంగా పాలించాయి. 1974లో అప్పటి ఇండియా ప్రధాన మంత్రి ఇందిరాగాంధీ, శ్రీలంక ప్రధాని సిరిమావో బండారు నాయకే మధ్య, రెండు దేశాల విదేశాంగ కార్యదర్శుల సమక్షంలో జరిగిన చర్చలో కచ్చతీవును శ్రీలంకకు ఇవ్వడం జరిగింది. ఇది ఇండియాలో అంతర్భాగమని, నాడు పాలించిన రాజవంశీయులు దీనికి ధృవీకరిస్తున్నారు.
ఇప్పుడే వివాదం ఎందుకంటే…
ఈ కచ్చతీవు (Kachateevu)అటు శ్రీలంక, ఇటు ఇండియాకు ఎంతో ముఖ్యమైనది. ఇరు దేశాల మత్స్యకారుల చేపల వేటకు, దేశ భద్రత చర్యలకు ఈ దీవి ఎంతో ముఖ్యమైంది. ఇటీవల ఇండియా నుంచి వెళ్లే మత్స్యకారులను శ్రీలంక అడ్డుకుంటూ వారికి శిక్షలు వేస్తోంది. 1974లో జరిగిన శ్రీలంక, భారత్ ఒప్పందాల్లో భాగంగా ఈ దీవి ఎందుకు పనిరాదని కేంద్రంలో ఉన్న అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం దీవిని శ్రీలంకకు అప్పజెప్పిందని, అప్పుడు తమిళనాడు రాష్ట్రంలో డీఎంకే అధికారంలోనే ఉందని బీజేపీ వాదన. ఇదిలాఉంటే తమిళనాడు ప్రాంత మత్స్యకారులు చేపల వేటకు వెళ్లినప్పుడు శ్రీలంక అధికారులు అదుపులోకి తీసుకుంటున్నారని, ఇండియాలో భాగమైనా కచ్చతీవును తిరిగి తమ ఆధీనంలోకి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ఇదే విషయమై ఇటీవల ప్రధాన నరేంద్ర మోదీ ఎక్స్(ట్విటర్) ద్వారా ఓ సందేశాన్ని పంపారు. అదేమిటంటే నాటి కాంగ్రెస్ పాలకులు అనాలోచితంగా ఇండియాకు భద్రత పరంగా ఎంతో ఉపయోగపడే కచ్చతీవుల్ని శ్రీలంకు అప్పజెప్పిందన్నది దీని సారాంశం. దీనికి బలపరుస్తూ కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ సర్థించడంతో ఈ చర్చ దేశావ్యాప్తంగా దుమారం రేపుతోంది. అయితే 1974 తర్వాత పలుమార్లు ఈ అంశమైన దేశవ్యాప్తంగా చర్చకు వచ్చాయి. అంతకుముందు కూడా జరిగింది. కానీ ఇప్పుడు అది చినికిచినికి గాలివానలా మారింది.
కుట్రలకు తెరలేపిన చైనా..
ఇండయాపై ఏ చిన్న అవకాశం దొరికినా రెచ్చిపోయే చైనా ప్రస్తుతం కచ్చతీవు అంశాన్ని తనకు అనుకూలంగా మార్చుకుంటోంది. ఆర్థిక ఇబ్బందులో కుదేలవుతున్న శ్రీలంకకు రుణ భారం అందించి ఇప్పటికే ఆదేశంపై చైనా ఆధిపత్యం చలాయిస్తోంది. ఇదిలాఉండగా, చైనా నిర్మిస్తున్న ముత్యాలహారం (సముద్రంపై నిర్మించే వారధి) ప్రాజెక్టుకు అనువుగా మార్చుకుంటోంది. అదే కాకుండా ఇప్పటికే కచ్చతీవులో చైనా తన స్థావరాలను ఏర్పాటు చేసుకుంటోందని స్పష్టమవుతోంది. దీంతో ఇండియా భద్రతకే పెనుముప్పు వాటిళ్లనుంది. గతంలో ఏం జరిగింది అన్నది పక్కబెడితే దేశ సార్వభౌమాధికారానికి ఇది గొడ్డలిపెట్టుల మారనుందని మేధావులు పేర్కొంటున్నారు.
ఎక్కువగా చదివిన వారు:
కేజ్రివాల్‌పై అవినీతి మరక..
బీజేపీ 400 ఎంసీ సీట్లు సాధిస్తుందా..
వంద రోజులో బీఆర్ ఎస్ సీన్ రివర్్స
అబ్బుర పరిచే వేయిస్తంభాల గుడి