KARTHIKA POURNAMI: హిందువులు అత్యంత పవిత్రంగా భావించే మాసం కార్తీక మాసం. ఈనెలంతా దైవారాధన, దీపారాధన, వ్రతాలు నిత్య పూజలు చేస్తారు. భక్తి శ్రద్ధలతో శివుడిని ఆరాధిస్తారు. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమిగా పిలుస్తారు. దేవతలు కార్తీక పూర్ణిమ రోజున దీపావళిని జరుపుకుంటారని హిందువులు భావిస్తారు. అందుకే ఈ రోజుని దేవ దీపావళి అంటారు. ఈ రోజున త్రిపురాసురుడు అనే రాక్షసుడిని శివుడు సంహరించిన సందర్భంగా దేవతలు స్వర్గంలో దీపాలు వెలిగించి పండుగ జరుపుకున్నారని.. దేవతలు భూమిపైకి వచ్చి దీపాలను వెలిగిస్తారని. చెబుతారు. త్రిపురాసురుడిని సంహరించిన తర్వాత దేవతలందరూ స్వర్గంలో దీపావళి జరుపుకున్నారని నమ్ముతారు. అందుకే వరలక్ష్మి, కేదారి, సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరిస్తారు. అంతేకాదు, పరమశివుడికి అత్యంత ప్రీకరమైన మాసంగా హిందువులు భావిస్తారు. అందుకే ఈనెలంతా శివుడిని ఆరాధిస్తారు. ఫలితంగా పాప ప్రక్షాళన, మోక్షం లభిస్తుందని నమ్మకం. అలాగే గంగానది, ఇతర పవిత్ర నదుల వద్ద దీపాలను వదిలే వదులుతారు. పుణ్యస్నానాలు ఆచరిస్తారు. కార్తికేయ స్వామి(కార్తికేయుని జన్మదినం)కి ఈ రోజుకు ప్రత్యేకమైన ది. ఈనేపథ్యంలోనే ఆయనకు ప్రత్యేక పూజలు, ఆయుధ పూజ నిర్వహిస్తారు. ఈ రోజున దానం ఇవ్వడం, సేవా కార్యక్రమాలు చేయడం పుణ్యప్రదంగా భావిస్తారు.
కాశిలో పౌర్ణమి వేళ గంగా హారతి..
దీపావళి వలెనే దేవ దీపావళి పండగ కూడా హిందువులకు పవిత్రమైనది. భారతదేశంలో దేవ దీపావళిని ప్రధానంగా వారణాసిలోని గంగా నది ఒడ్డున అత్యంత వైభవంగా జరుపుతారు. దేవ దీపావళి రోజున ఆచారాల ప్రకారం మహాదేవుని పూజించిన వ్యక్తీ కోరుకున్న ఫలితాలను పొందుతారని చెబుతారు. ఈ రోజ పౌర్ణమి తిథి కనుక ఈ రోజున చేసే స్నానం, దాన ధర్మాలు వలన పూర్వీకుల అనుగ్రహం కూడా లభిస్తుంది. కార్తీక పౌర్ణమి (KARTHIKA POURNAMI) రోజున దేవ దీపావళి వేడుకలను ప్రదోష కాల సమయంలో సాయంత్రం 5:10 నుంచి 7:47 వరకు జరుపుకుంటారు.
తిరుమలలో నేడు గరుడ సేవ..
తిరుమల శ్రీవారి ఆలయంలో శుక్రవారం రాత్రి కార్తీక మాస పౌర్ణమి గరుడసేవ జరగనుంది.
రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్పస్వామివారు సువర్ణకాంతులీనుతున్న గరుడునిపై తిరుమాడ వీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిస్తారు. తిరుపతి శ్రీకపిలేశ్వరస్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమి పర్వదినాన అన్నాభిషేకం నిర్వహించనున్నారు. ఉదయం 2 గంటలకు సుప్రభాతంతో మేల్కొలిపి, 2.30 నుంచి 4.30 గంటల వరకు అభిషేకం, అలంకారం, అర్చన నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏకాంతంగా అన్నాభిషేకం, దీపారాధన చేపడతారు. ఈ సందర్భంగా భక్తులకు స్వామివారి దర్శనం ఉండదు. తర్వాత సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు భక్తులకు అన్నలింగ దర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు ఏకాంతంగా అన్నలింగ ఉద్వాసన చేపడతారు. శుద్ధి అనంతరం రాత్రి 7.30 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
–ఎక్కువ మంది చదివినవి.. మీరు క్లిక్ చేసి చదవండి–
అదృశ్యమైన నటి.. తెలుగువారిని అవమానించినందుకే..
తెలుగు వారిని అంత మాటంటావా.. నటి కస్తూరిపై ఫైర్
మిస్త్ ఎర్త్ 2024 విజేతగా జెస్సికా లేన్
న్యూ ఎంట్రీ ఇస్తున్న ఎన్టీయార్
మహేష్ బాబు కోసం రాజమౌళి వెతుకులాట
విషాదంలో సినీ ఇండస్ట్రీ.. ప్రముఖ నటుడు కన్నుమూత
వంద రేప్‌లు చేశాడు.. వారంతా టాప్ హీరోయిన్స్ అయ్యారు..
విస్తరిస్తున్న షుగర్ డాడీ.. ఆ పనికోసమేనా..
ఎలాన్ ముస్క్ కు ట్రంప్ బిగ్ ఆఫర్..
సర్వే డేటా భద్రమేనా.. ప్రజలకు అనుమానాలు.. ముప్పు ఇదేనా..
వాటిని.. డ్రీమ్ గర్ల్ హేమామాలిని బుగ్గలుగా మారుస్తా..
టీడీపీ- జనసేన మధ్య ముదిరిన వార్
మన మెదడు పెరుగుతోంది.. లాభమా .. నష్టమా..
మబ్బుల్లో విహారం.. కొత్త చిక్కుతో విచారణం
ఇంటింటి సర్వే డేటా భద్రమేనా.. అసాంఘిక శక్తుల చేతిలోకి వెళ్తే..
కేదార్‌నాథ్ ఆలయం మూసివేత..ఎప్పుడు.. ఎందుకంటే..
బీజేపీలో ముసలం.. నెక్ట్స్ బాస్ ఎవరంటే..?
మెడికల్ వార్: ఆయుర్వేదం వర్సెస్ అలోపతి