janadhootha

KCR/ తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల ఫలితాలు వచ్చి వంద రోజులు గడిచేసరికి బీఆర్‌ఎస్‌(భారత రాష్ట్ర సమితి) పరిస్థితి తారుమారైంది. పార్టీ పరిస్థితి రోజురోజుకూ దిగరాజుతోంది. నమ్ముకున్నవారే ఒక్కొక్కరుగా చేజారిపోతున్నారు. ఎవరు ఉందుకు పోతున్నారో.. వారిని ఆపేందుకు ఏం చేయాలో తెలియక పార్టీ అధినేత, తాజామాజీ ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్‌రావు తల పట్టుకుంటున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కుంగిపోవడం.. కూతురు కవిత ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ఇరుక్కోవడం.. రోజుకో నాయకుడు పార్టీ వీడడం.. ఇన్నాళ్లు తనని ఆహా.. ఓహో అంటూ ఆకాశానికి ఎత్తినవారే విమర్శలు గుప్పిస్తుండడంతో ఏం చేయాలో తెలియని దుస్థితిలో కేసీఆర్‌ ఉన్నట్టు అర్థమవుతోంది. ఎంపీ ఎన్నికల సమీపిస్తున్న వేళ దెబ్బమీద దెబ్బ తగులుతుండడంతో కేసీఆర్‌ అండ్‌ కో ఏం రాజకీయ ఎత్తులు వేయాలో తెలియని దుస్థితి.

కవిత లిక్కర్‌ స్కాంతో..

ఢిల్లీ లిక్కర్‌ స్కాం కేసీఆర్‌(KCR) కూతురు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మెడకు చుట్టుకోవడం.. ఇటీవల అరెస్టు కూడా అయింది. ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఆమెకు ఉచ్చు బిగిస్తుండడంతో రాష్ట్రంలో పార్టీ పరిస్థితి నానాటికీ తీసుకట్టుగా మారుతోంది. ఉద్యమకారులై ఉండీ ఇలాంటి పనులు చేయడం.. అందునా కవిత మద్యం కుంభకోణంలో ఉండడంతో రాష్ట్ర ప్రజల్లో కూడా అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పట్లో ఈ కేసు తెగేలా లేదు.. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న ఎంపీ ఎన్నికల్లో మెజారిటీ సీట్ల గెలుపు దేవుడెరు ఉన్న సీట్లను కాపాడుకోవమూ కేసీఆర్‌కూ కష్టమే. దీనికి తోడు టికెట్‌ రానివారు పార్టీని వీడడం. వెళ్తూవెళ్తూ ఆరోపణలు చేయడం కేసీఆర్‌కు మింగుడు పడడం లేదు. ఎంపీ ఎన్నికల్లో ఏ నినాదంతో ప్రజల్లోకి వెళ్లాలో రాజకీయ ఉద్ధండపండితుడైన కేసీఆర్‌కే అర్థంకావడం లేదు. మళ్లీ తెలంగాణ సెంటిమెంట్‌ను రగిల్చిదామన్నా.. ఎవరూ నమ్మే పరిస్థితి లేదు.

కేసీఆర్‌ మౌనానికి అర్థమేమి…

త్వరలో సింహం(కేసీఆర్‌) వస్తుందంటూ ఇన్నాళ్లూ మాజీ మంత్రులు కేటీఆర్‌(KTR), హరీష్‌రావు తోపాటు బీఆర్‌ఎస్‌ నాయకులు చెబుతూ వచ్చారు. ఆపరేషన్‌ తర్వాత కోలుకుని వచ్చాక కేసీఆర్‌ ఇక విజృంభిస్తాడని రాష్ట్ర ప్రజలు  భావించారు. కాళేశ్వరం సమస్య రాష్ట్రవ్యాప్తంగా చర్చచర్చ జరిగినా పట్టించుకున్న దాఖలాలు కనిపించ లేదు. కన్నకూతురు కవిత అరెస్టయినా కనీసం ఖండించిన దాఖలాలు లేవు. ఓ వైపు నాయకులు పార్టీని వీడుతున్నా.. వారిని పిలిచి భరోసా కల్పించిం అసలే లేదని పార్టీ నాయకులే పేర్కొంటున్నారు.  పలు సందర్భాల్లో బహిరంగంగానే ‘దమ్ముంటే ఈడీని రమ్మను..’ అంటూ బీరాలు పలికిన కేసీఆర్‌ కనీసం తన కూతరు అరెస్టయిన తర్వాత కూడా ఏమీ మాట్లాడకపోవడం వెనక వ్యూహం ఏమిటో తెలియక తికమకపడుతున్నారు.  కేటీఆర్‌  ఢిల్లీలో లిక్కర్‌స్కాం ఇష్యూలో బిజీబిజీ అయ్యారు.

నమ్ముకున్నవారే చేజారుతున్నారు…

అసలే అధికారం కోల్పోయి ఆవేదనలో ఉన్న కేసీఆర్‌కు నమ్మినవారే ఒక్కొక్కరుగా చేజారుతుండడంతో ఏమీ పాలుపోని స్థితిలో ఉన్నారు. కేసీఆర్‌కు అండగా ఉండాల్సినవారే మాటమారుస్తున్నారు. కనీసం వంద రోజులు కూడా ఓపిక పట్టకపోవడం ఒకవిధంగా ఆయనకు అవమాన భారమే. సముచిత స్థానం కల్పించినా హ్యాండ్‌ ఇవ్వడంతో అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. వివక్షకు గురైనవారు ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడే జంప్‌ అన్నట్టుగా ఉన్నా… వారిని బుజ్జగించే చర్యలు అంతగా కనిపించడం లేదని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

కేసిఆర్ తీరే కారణమా…

తెలంగాణ ఉద్యమ సమయంలో కేంద్రమే గడగడ లాడించిన కేసీఆర్ కు.. ఇప్పటి కేసీఅర్ కు ఎంత తేడా..  పదేళ్లు అధికారం చెలాయించిన పార్టీనా.. కేంద్రానికి చుక్కలు చూపిన పార్టే నా చూస్తున్నది అన్న ప్రశ్న ప్రతీ ఒక్కరి మదిలో ఉండడం వింతేమీ కాదు. ఇదంతా కేసీఆర్ స్వయంకృతాప‌రాధ‌మేన‌ని పార్టీ వ‌ర్గాలు భావిస్తున్నాయి. దీనికి కార‌ణాలు లేక‌పోలేదు. తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో కాంగ్రెస్ కు ద‌గ్గ‌ర‌య్యారు. తెలంగాణ ప్ర‌త్యేక రాష్ట్రం ఇస్తే టీఆర్ ఎస్‌ను కాంగ్రెస్‌లో విలీనం చేస్తాన‌ని హామీ ఇచ్చారు. కానీ రాష్ట్రం వ‌చ్చాక మాట త‌ప్పారు. దీంతో కాంగ్రెస్‌తో వైరం పెరిగింది. తెలంగాణ‌లో కేసీఆర్ అధికారంలోకి వ‌చ్చాక బీజేపీతో వైరం పెంచుకున్నారు.దేశానికి మూడో కూట‌మి అవ‌స‌రం అంటూ హ‌ల్ చ‌ల్ చేయ‌డంతో ఇటు బీజేపీ, అటు కాం్ర‌గెస్ రెండు జాతీయ పార్టీలు కేసీఆర్ అంటేనే భగ్గుమ‌నే ప‌రిస్థితి నెల‌కొంది. త‌ర్వాతి కాలంలో మూడో కూట‌మి చీలిక‌లు పేలిక‌లైంది.  ఇలాంటి స‌మ‌యంలో ఆచితూచి ఉండాల్సిన ఆయ‌న కూతురు క‌విత లిక్క‌ర్ దందాకు పూనుకోవ‌డం.. కేసీఆర్‌కు తెలియ‌కుండా స్కాం న‌డిచిందా అంటే ఎవ‌రూ న‌మ్మ‌రు.. మ‌రీ తెలిసికూడా వారించ‌లేదా అన్న‌దే మిలియ‌న్ డాల‌ర్ ప్ర‌శ్న‌.

పార్టీ ప‌గ్గాలు వేరేవారికి అప్ప‌గిస్తారా..

కేసీఆర్ వృద్ధాప్యం.. అనారోగ్యం.. కూతురు లిక్క‌ర్ స్కాంలో ఇరుక్కోవ‌డం.. కేటీఆర్ ఢిల్లిలో వ్య‌వ‌హారం చక్క‌దిద్ద‌డం.. హ‌రీష్ రావు త‌న నియోకవ‌ర్గంకే ప‌రిమిత మ‌వ‌డం అంతా బీఆర్ ఎస్‌కు వ్య‌తిరేక ప‌వ‌నాలే వీస్తున్నాయి.. ఎన్నిక‌లు వేళ ఏ నినాదంతో వెళ్లిన ప్ర‌జ‌లు న‌మ్మే ప‌రిస్థితి లేదు. కేసీఆర్ కుటుంబ మాట‌లు కూడా విశ్వ‌సించేవారు త‌క్కువే అయితే పార్టీ ప‌గ్గాలు మ‌రెవ‌రికైనా ఇస్తారా.. అన్న‌ది వేచి చూడాలి. ఒక‌విధంగా ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అదీ మంచిదే. లేదంటే పార్టీ గ్రాఫ్ మ‌రింత ప‌డిపోయే ప్ర‌మాదం ఉంది.

=====================
ఎక్కువ‌గా చ‌దివిన‌వి:

* కేజ్రివాల్‌పై మ‌ర‌క‌.. ఎందుకు దారి త‌ప్పాడో?

*వ‌రంగ‌ల్ ఎంపీ సీటుపై కాంగ్రెస్ – సీపీఐ మ‌ల్ల‌గుల్లాలు

* తెలంగాణ మాజీ గ‌వ‌ర్న‌ర్ పోటీపై ఆస‌క్తి

* బీజేపీ దేశంలో 400 సీట్లు సాధించ‌డం సాధ్య‌మేనా?

* ఐపీఎల్ లో ఒక్క‌సారి కూడా టైటిల్ సాధించ‌ని జ‌ట్లు ఇన్నా..

One thought on “KCR/వంద రోజుల్లోనే సీన్ రివ‌ర్స్‌.. చే జారుతున్న న‌మ్మిన నేత‌లు”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *