Kejriwal Tihar Jail : సీఎం హాదాలో తీహార్ జైల్‌కు వెళ్తున్న తొలి సీఎంగా ఢిల్లీ ముఖ్య‌మంత్రి అర‌వింద్ కేజ్రివాల్‌ రికార్డు కెక్కారు. సోమ‌వారం ఆయ‌న్ను జ్యుడీషియ‌ల్ రిమాండ్ విధించ‌డంతో ఆయ‌న జైలుకు వెళ్ల‌నున్నారు. ఢిల్లీ లిక్క‌ర్ కుంభ‌కోణంలో 2024 మార్చి 24న ఎన్‌ఫోర్స్ మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) అరెస్టు చేసిన విష‌యం తెలిసింది. ఏప్రిల్ 1తో ఈడీ క‌స్ట‌డీ ముగిసింది. దీంతో కేజ్రివాల్‌ను ఢిల్లి రౌస్ అవెన్యూ కోర్టులో సోమ‌వారం హాజ‌రు ప‌రిచారు. దీంతో విచార‌ణ అనంత‌రం కోర్టు కేజ్రివాల్‌ను ఈనెల 15 వ‌ర‌కు జ్యుడీషియ‌ల్ రిమాండ్ విధించింది. దీంతో ఆయ‌న్ను తీహార్ జైలుకు త‌ర‌లించారు. నాడు అవినీతిపై పోరాడుతూ సామాజిక కార్య‌క‌ర్త అన్నాహ‌జారేతోపాటు జైలుకు వెళ్లిన కేజ్రివాల్ తాజాగా లిక్క‌ర్ స్కాం లో ఇరుక్కుని అదే జైలుకు వెళ్ల‌డం విశేషం.

ఈడీకి స‌హ‌క‌రించ‌ని కేజ్రివాల్‌…

లిక్క‌ర్ పాల‌సీతోపాటు మ‌నీ ల్యాండ‌రింగ్ కేసులో ద‌ర్యాప్తు చేప‌ట్టిన ఈడీకి కేజ్రివాల్ ఏ మాత్రం స‌హ‌క‌రించ‌డం లేద‌ని అధికారులు కోర్టుకు వెల్ల‌డించారు. ప్ర‌తీ విష‌యంలోనూ దాట వేత చ‌ర్య‌ల‌కు పాల్ప‌డుతున్న‌ట్టు కోర్టు దృష్టికి తెచ్చారు. డిజిట‌ల్ ప‌రికాలు పాస్‌వ‌ర్డ్ ఇవ్వ‌డం లేద‌ని, ప్ర‌తీ ప‌శ్న‌కు ఆయ‌న త‌న‌కు తెలియ‌దు న్న ధోర‌ణిలో స‌మాధానం ఇస్తున్న‌ట్టు పేర్కొంది. ఈ కేసులో కేజ్రివాల్ త‌న కేసును తానే వాధించుకుంటున్న విష‌యం విధిత‌మే. పూర్తి విద‌న‌లు విన్న కోర్టు సోమ‌వారం నుంచి ఏప్రిల్ 15 వ‌ర‌కు జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ విధించింది.

భ‌గ‌వ‌ద్గీత‌.. ఆ లాకెట్ అనుమ‌తించండి…

15 రోజుల జ్యుడిషియ‌ల్ క‌స్ట‌డీ కి వెళ్తున్న కేజ్రివాల్‌కు జైలులోకి భ‌గ‌వ‌ద్గీత‌, రామాయ‌ణం, హౌ ప్రైమ్ మినిస్ట‌ర్్స డిసైడ్ వంటి పుస్త‌కాల‌ను అనుమ‌తించాల‌ని కేజ్రివాల్ త‌ర‌పు న్యాయ‌వాదులు కోరారు. అలాగే, ప్ర‌త్యేక ఆహారం, మందులు, మ‌త ప‌ర‌మైన లాకెట్‌ను అనుమ‌తించాల‌ని కోరారు.

  • నాడు లోక్‌పాల్ బిల్లు కోసం తీహార్ జైలుకు..

  • లోక్‌పాల్‌ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటూ సామాజిక కార్య‌క‌ర్త ఉద్య‌మం చేప‌ట్టిన విష‌యం తెలిసింది. ఈ ఉద్య‌మంలో అర‌వింద్ కేజ్రీవాల్ (Kejriwal Tihar Jail )కూడా పాల్గొన్నారు. ఈ విష‌యంలో నాడు అన్నా హజారే, అరవింద్‌ కేజ్రీవాల్‌లను కూడా అరెస్టు చేసి తీహార్ జైలుకు త‌ర‌లించారు. నాడు ఉద్య‌మ‌కారుడుకు ఈ జైలుకు వ‌చ్చిన కేజ్రీవాల్ లిక్క‌ర్ స్కాం కేసులో రావ‌డం విశేషం.

తీహార్ జైలు వెళ్లింది ఎంద‌రో..

భారత రాజధాని ఢిల్లీ స‌మీపంలోని తీహార్‌ గ్రామంలో ఈ జైలు ఉండ‌డంతో తీహార్‌ జైలు అని వ‌చ్చింది. దక్షిణ ఆసియా లోనే అతి పెద్ద కారాగార మిది. కిరణ్ బేడీ ఆధ్వర్యంలో అనేక సంస్కరణలు జరిగి తీహార్ ఆశ్రమం అని మ‌రో పేరు వ‌చ్చింది. పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన అఫ్జల్‌ గురును, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ హత్య కేసులో కేహార్‌ సింగ్‌, సత్వంత్‌ సింగ్‌లను ఈ జైలులోనే ఉరి తీశారు. క్రిమినల్‌ చార్లెస్‌ శోభరాజ్‌ ఈ జైలు నుంచి త‌ప్పిచుకుని,
మళ్లీ దొరికి శిక్ష అనుభ‌వించారు. అస్సాం మాజీ విద్యాశాఖామంత్రి రిపున్‌ బోరా డానియల్‌ టాప్‌నో హత్యకేసులో ప్రధాన నిందితుడు బోరా, డిఎంకె ప్రముఖ నాయకులు, కేంద్ర మాజీ మంత్రులు ఎ.రాజా, ఎం.కె.కనిమొళి, వినోద్‌ గోయంకా, షాహిద్‌ బల్వా, సంజయ్‌ చంద్రా లను 2జీ కేసులో అరెస్టు చేసి ఇదే జైలులో ఉంచారు. ఒలంపిక్స్‌ అసోసియేషన్‌ మాజీ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి సురేష్‌ కల్మాడీని కామన్‌ వెల్త్‌ గేమ్స్‌లో అవినీతి ఆరోపణల కేసులో ఇక్కడికి తరలించారు. పార్లమెంటులో అవిశ్వాస తీర్మాన సమయంలో డబ్బు ఎర చూపి ఎంపిలను ప్రభావితం చేసిన ఆరోపణలపై సమాజ్‌ వాదీ పార్టీ మాజీ సభ్యుడు అమర్‌సింగ్‌ ఇదే జైలులో ఉంచారు. అలాగే, లోక్‌పాల్‌ బిల్లు పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలంటూ ఆందోళన చేస్తున్న అన్నా హజారే, అరవింద్‌ కేజ్రీవాల్‌లను అరెస్టు చేసి ఇక్కడే ఉంచారు. హర్యాన మాజీ ముఖ్యమంత్రి ఓం ప్రకాశ్‌ చౌతలా, అతని కుమారుడు అజయ్‌ చౌతలాలను అవినీతి కేసులో అరెస్టు చేసి ఈ జైలులోనే ఉంచారు.

 

ఎక్కువ‌గా చ‌దివిన వారు:

కేజ్రివాల్‌పై అవినీతి మ‌ర‌క‌..

బీజేపీ 400 ఎంసీ సీట్లు సాధిస్తుందా..

వంద రోజులో బీఆర్ ఎస్ సీన్ రివ‌ర్్స

అబ్బుర ప‌రిచే వేయిస్తంభాల గుడి

 

One thought on “Kejriwal Tihar Jail/ తీహార్ జైల్‌కు వెళ్తున్న తొలి సీఎంగా కేజ్రివాల్ రికార్డు..”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *