KING COBRA MISTORYS :అత్యంత విష పూరితమైన సరీసృపాలో ప్రధానమైనది రాచనాగు. దీనినే కింగ్ కోబ్రా అని పిలుస్తారు. ఇది ఎంత ప్రమాదకరమైనది అంటే ఏనుగును సైతం కాటువేసి చంపగలదు. ఇది మూడు నుంచి నాలుగు అడుగుల పొడవు ఉంటుంది. ఇది ఎక్కువగా అరణ్యంలో ఉంటాయి. సాధారణంగా ఇది మనుషులకు దూరంగా ఉంటాయి. రాచనాగులపై ఏళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నాయి. వాటిపై పరిశోధనకు ఎవరూ సాహసం చేయలేకపోయారు. అందుకే వాటి రహస్యాలు అలాగే ఉండిపోయాయి.
READ MORE: కవిత రాక కోసం ఎదురుచూపు.. లేదంటే..
ఇండియాలో మందే లేదు..
వివిధ రకాల పాముకాటుకుమందు ఉన్నా కోబ్రా విషానికి విరుగుడు ఇండియాలో ఇంకా అందుబాటులో లేకపోవడం బాధాకరం. ఒకవేళ కింగ్ కోబ్రా కాటు వేస్తే థాయిలాండ్ నుంచి మందును తీసుకురావాల్సిందే. ఇప్పటికీ ఆ దిశగా ఇండియాలో పరిశోధనలు జరుగుతున్నాయి.
15ఏళ్ల నుంచి పెరిగిన పరిశోధనలు..
KING COBRA MISTORYS : వివిధ రకాల పాములపై సుమారు 180 ఏళ్ల నుంచి పరిశోధనలు జరుగుతున్నా. గత 15ఏళ్ల నుంచి కోబ్రాలపై పరిశోధనలు ముమ్మరమయ్యాయి. సరీసృపాల పరిశోధకులు డాక్టర్ గౌరీ శంకర్ కొన్నేళ్ల నుంచి రాచనాగు(కోబ్రా)పై పరిశోధనలు చేస్తున్నారు. 2005లో ఇతను కోబ్రా కాటుకు గురయ్యాడు. అదృష్టవశాత్తు ఆయన కోలుకున్నారు. ఆ తర్వాత కోబ్రాపై ఆయన మరింత నిశితంగా పరిశోధనలు చేయడం ప్రారంభించారు. ఆయన బృందం ఏళ్ల నుంచి వెలుగుచూడని ఓ రహస్యాన్ని కొనుగొన్నారు.
READ MORE: తిరుమల రహస్యాలు ఇవిగో..
నాలుగు రకాల జాతులు..
ప్రపంచంలో నాలుగు రకాల రాచనాగులు (కోబ్రా) జాతులున్నాయి. జాతుల వారీగా కోబ్రాలను గుర్తించేందుకు 1961వరకు ప్రయత్నాలు జరిగినా ఫలితం లేకుండా పోయింది. డాక్టర్ గౌరీ శంకర్ బృందం ఆ రహస్యాలను కనుగొనడం విశేషం. ఒక్కో రకం కోబ్రా ఆయా ప్రాంతాన్ని బట్టి జీవిస్తాయి. పశ్చిమ కనుమలలో ఒక్క జాతికి చెందిన రాచనాగు మాత్రమే ఉంది. భారతదేశంలో ఓఫియోఫేగస్ హన్నా శాస్త్రీయ నామం గల రాచనాగు జాతి మాత్రమే నివసిస్తుందని భావించారు. అదే రకానికి చెందిన రాచనాగ జాతులు ఉత్తర, తూర్పు భారతదేశంలో, ఉన్నాయని గుర్తించారు. తూర్పు పాకిస్తాన్‌లోనూ ఉన్నట్టు భావిస్తున్నారు. తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్టాల్లో పశ్చిమ కనుమల్లో నివసించే ప్రత్యేక జాతి ప్రపంచంలో మరెక్కడా లేదని ఈ అధ్యయనంలో తేలింది. పరిశోధకులు ఈ ప్రత్యేకమైన కింగ్ స్నేక్‌కు ఓఫియోఫాగస్ కళింగ అని పేరు కూడా పెట్టారు. రెండు రకాల పాముల ఆవాసాలు, జీవనశైలి, ప్రవర్తనలో తేడాలు ఉన్నాయి. కోబ్రాలు నాజా జాతికి చెందినవి. కానీ, రాచనాగులను ఓపియోఫేగస్ జాతి కింద వర్గీకరించారు. శరీర పరిమాణంలో రెండింటికీ చాలా తేడాలు ఉన్నట్టు కనుగొన్నారు. కోబ్రాలు 6 నుంచి 8 అడుగుల వరకు పెరుగుతాయి. 14 అడుగుల వరకు ఇండియాలో కనిపించే రాచనాగులు పెరుగుతాయి. కోబ్రా శరీరమంతా ఒకే రంగులో ఉంటుంది. కానీ కింగ్ కోబ్రా శరీరంపై లేత రంగులో చారలుంటాయి. మనుషులు నివసించే ప్రాంతాలలో డ్రాగన్ ఎక్కువగా కనిపిస్తుంటుంది. రాచనాగులు ఎక్కువగా అభయారణ్యంలో నివసిస్తాయి.